వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో పాకిస్తాన్ ఛాంపియన్స్ వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన పాక్.. రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించింది. బర్మింగ్హమ్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో పాక్ 29 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన విండీస్ 165 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమతమై ఓటమిపాలైంది.
రాణించిన షోయబ్ మాలిక్
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ షోయబ్ మాలిక్ (41 బంతుల్లో 54; 5 ఫోర్లు, సిక్స్), షర్జీల్ ఖాన్ (15 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో ఆమిర్ యామిన్ (11 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించాడు. విండీస్ బౌలర్లలో ఆష్లే నర్స్ 3, ఫిడేల్ ఎడ్వర్డ్స్ 2, శామ్యుల్ బద్రీ, జేరోమ్ టేలర్, సులేమాన్ బెన్ తలో వికెట్ పడగొట్టారు.
నిప్పులు చెరిగిన సోహైల్ తన్వీర్.. సత్తా చాటిన అఫ్రిది
195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. సోహైల్ తన్వీర్ (4-0-14-4), షాహిద్ అఫ్రిది (3/31), వాహబ్ రియాజ్ (2/18) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 165 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితమైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో డ్వేన్ స్మిత్ (46 బంతుల్లో 65;8 ఫోర్లు, 2 సిక్సర్లు), జోనాథన్ కార్టర్ (25 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించినా ఉపయోగం లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment