ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్లు, డాషింగ్ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ తదితరులు మరోసారి కలిసి బరిలోకి దిగబోతున్నారు. జనవరి 20 నుంచి 29 వరకు ఒమన్ వేదికగా జరగనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా మహరాజాస్ జట్టుకు వీరంతా ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఈ టోర్నీలో ఇండియా మహరాజాస్‌తో పాటు ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్ జట్లు పొల్గొంటున్నాయి. ఆసియా లయన్స్ తరఫున ఆసియా క్రికెటర్లు( ఆఫ్రిది, జయసూర్య, అక్తర్, మురళీధరన్ తదితరులు), వరల్డ్ జెయింట్స్ తరఫున ఆసియా ఏతర క్రికెటర్లు( జాంటీ రోడ్స్,షేన్ వార్న్, షాన్ పొలాక్, లారా తదితరులు) రంగంలోకి దిగనున్నారు. ఈ లీగ్‌కు బిగ్ బీ అమితాబ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. భారతకాలమానం ప్రకారం మ్యాచ్‌లన్నీ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి.
చదవండి: IPL 2022: అహ్మదాబాద్ హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ పేసర్..!
Comments
Please login to add a commentAdd a comment