టీ20ల్లో ఆస్ట్రేలియా విధ్వంసం.. ఏకంగా 274 పరుగులు | Australia Champions won by 55 runs | Sakshi
Sakshi News home page

టీ20ల్లో ఆస్ట్రేలియా విధ్వంసం.. ఏకంగా 274 పరుగులు

Published Thu, Jul 11 2024 1:05 PM | Last Updated on Thu, Jul 11 2024 2:53 PM

 Australia Champions won by 55 runs

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఆస్ట్రేలియా తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బుధవారం నార్తాంప్టన్ వేదిక‌గా వెస్టిండీస్‌తో ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగుల తేడాతో ఆసీస్‌ ఘన విజయం సాధించింది. 

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆసీస్‌ 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆసీస్‌ బ్యాటర్లలో బెన్‌ డంక్‌, క్రిస్టియన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. విండీస్‌ బౌలర్లను ఊచకోత కోశారు.

డంక్‌ కేవలం 35 బంతుల్లోనే 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో సెంచరీ మార్క్‌ను అందుకోగా.. క్రిస్టియన్‌ 35 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 99 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఆసీస్‌ సాధించినదే అత్యధిక స్కోర్‌ కావడం గమనార్హం. 

ఇక విండీస్‌ బౌలర్లలో ఎమిరిట్‌ 3 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం 275 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ సైతం ధీటుగా బదులిచ్చింది. కానీ ఇంతటి భారీ లక్ష్యాన్ని విండీస్‌ చేరుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు మాత్రమే చేయగల్గింది. 

విండీస్‌ బ్యాటర్లలో డ్వేన్‌ స్మిత్‌(64), నర్స్‌(70) హాఫ్‌ సెంచరీలతో మెరిశారు. ఆసీసీ బౌలర్లలో కెప్టెన్‌ బ్రెట్‌లీ రెండు, సిడిల్‌,  దోహర్టీ, కౌల్టర్‌ నైల్‌,క్రిస్టియన్‌ తలా వికెట్‌ సాధించారు. ఇక ఈ మెగా టోర్నీ సెకెండ్‌ సెమీఫైనల్లో జూలై 12న ఇండియా ఛాంపియన్స్‌తో ఆసీస్‌ తలపడనుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement