ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు హ్యారీ బ్రూక్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. బిగ్ బాష్ లీగ్-2023 సీజన్ నుంచి బ్రూక్ వైదొలిగాడు. తన జాతీయ జట్టు విధుల కారణంగా బ్రూక్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు బ్రూక్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఇంగ్లండ్ జట్టు ఈ ఏడాది డిసెంబర్‌లో వైట్‌బాల్ సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌లో పర్యటించనుంది.
ఈ కరేబియన్ టూర్‌లో భాగంగా ఆతిథ్య విండీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో ఇంగ్లండ్ తలపడనుంది. ఈ రెండు సిరీస్‌లకు వెర్వేరు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ జట్లను ప్రకటించింది. అయితే ఈ రెండు జట్లలోను హ్యారీ బ్రూక్ సభ్యునిగా ఉన్నాడు.
ఈ క్రమంలో రాబోయే బిగ్ బాష్ లీగ్ సీజన్‌కు దూరంగా ఉండాలని అతడు నిర్ణయించకున్నాడు. బిగ్ బాష్ లీగ్-2023 డిసెంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. అదే విధంగా ఇంగ్లండ్ కరేబియన్ టూర్ డిసెంబర్ 3న మొదలు కానుంది. వెస్టిండీస్ పర్యటన ముగిసినంతరం ఇంగ్లీష్ జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత గడ్డపై అడుగుపెట్టనుంది. వచ్చే ఏడాది జనవరిలో భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ జరగనుంది.
చదవండి: World Cup 2023: ఇదేమి బ్యాటింగ్ రా బాబు.. అందుకే 'చోకర్స్' ట్యాగ్ లైన్
Comments
Please login to add a commentAdd a comment