చరిత్రలో ఇలాంటి క్యాచ్‌ చూసుండరు! | Fielders Team Up To Take The Best Catch You will Ever See | Sakshi
Sakshi News home page

చరిత్రలో ఇలాంటి క్యాచ్‌ చూసుండరు!

Published Tue, Jan 23 2018 5:17 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

‘క్రికెట్‌ చరిత్రలో ఇలాంటి క్యాచ్‌ చూసుండరు’..  బిగ్‌బాష్‌ లీగ్‌లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌ మ్యాచ్‌లో కామెంటేటర్‌ నోట వచ్చిన మాట ఇది. ఈ వీడియో మీరు చూసిన ఇదే మాట అంటారు. అంత అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు.. కాదు కాదు.. అందుకున్నారు అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ ఆటగాళ్లు బెన్‌ లాఫ్‌లిన్‌‌, జేక్‌ వెదరాల్డ్‌లు. మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌​బ్యాట్స్‌మన్‌ వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వాన్‌ బ్రావో, అఫ్ఘనిస్తాన్‌ యువ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడాడు. అది గాల్లో ఉండగా బౌండరీ వద్ద  పరుగెత్తుతూ బెన్‌ లాఫ్‌లిన్‌ అందుకున్నాడు. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయిన లాఫ్‌లిన్‌ బంతిని బౌండరీ లైన్‌ వద్ద గాల్లోకి విసిరేసి పడిపోయాడు. అయితే ఈ బంతిని జేక్‌ వెదరాల్డ్‌ చక్కటి డైవ్‌తో అందుకొని మైమరిపించాడు. ఈ క్యాచ్‌తో ఒక్క క్షణం మైదానంలో ఏం జరిగిందో అర్ధం కాలేదు. ఎవరి నోట మాట కూడా రాలేదు. ఆ వెంటనే కామెంటేటర్‌ మైకెల్‌ స్లాటర్‌ ఇలాంటి బెస్ట్‌ క్యాచ్‌ ఇప్పటి వరకు చూసుండరు అని వ్యాఖ్యానించాడు. ఈ క్యాచ్‌కు మైదానంలోని అభిమానులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ ప్రేమికులు సైతం ముగ్ధులయ్యారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement