Cricket History
-
క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒకే ఓవర్లో ఆరు వికెట్లు
దుబాయ్: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. దుబాయ్ వేదికగా జరిగిన కర్వాన్ అండర్-19 గ్లోబల్ లీగ్ టీ20 టోర్నీలో భారత సంతతి(ఢిల్లీ)కి చెందిన స్థానిక కుర్రాడు హర్షిత్ సేథ్ ఒకే ఓవర్లో ఆరు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. పాకిస్థాన్‌కు చెందిన హైదరాబాద్ హాక్స్ అకాడమీ ఆర్సీజీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో దుబాయ్ క్రికెట్ కౌన్సిల్ స్టార్లెట్స్కు ప్రాతినిధ్యం వహించిన హర్షిత్.. డబుల్ హ్యాట్రిక్ సహా మొత్తం 8 వికెట్లు(4-0-4-8) సాధించడంతో పర్యాటక జట్టు 44 పరుగులకే కుప్పకూలింది. ప్రస్తుత క్రికెట్లో దాదాపుగా అసాధ్యమైన డబుల్ ఈ హ్యాట్రిక్ ఫీట్‌ను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్షిత్ సాధించాడు. ఈ ఏడాది నవంబర్ 28న జరిగిన ఈ ఘట్టం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘట్టం ఇంతవరకు ఆవిష్కృతం కాలేదు. అయితే, 2017 జనవరిలో ఆస్ట్రేలియా క్లబ్ క్రికెట్లో ఇలాంటి ఘట్టమే ఆవిష్కృతమైంది. గోల్డన్ పాయింట్ క్రికెట్ క్లబ్ తరఫున అలెడ్ క్యారీ డబుల్ హ్యాట్రిక్ సాధించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అంతకుముందు 1930లో భారత స్కూల్ క్రికెట్లో వైఎస్ రామస్వామి, 1951లో ఇంగ్లండ్ లోకల్ క్రికెట్లో జి సిరెట్ ఈ రికార్డును సాధించినట్లు తెలుస్తోంది. చదవండి: ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌కు కీలక పదవి.. -
16 ఏళ్లయినా ఆ రికార్డును కొట్టలేకపోయారు
సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఇదే రోజు (ఏప్రిల్ 12, 2004)లో టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. అప్పటివరకు టెస్టుల్లో డబుల్, ట్రిపుల్ సెంచరీలు సాధించడమే రికార్డుగా ఉండేది. కానీ ఒక్కడు మాత్రం ఎవరు ఊహించని రీతిలో క్వాడ్రపుల్ సెంచరీ(400* పరుగులు) నమోదు చేసి తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు. ఇప్పటికి ఆ రికార్డు సాధించి పదహారేళ్లు అవుతున్నా దాన్ని ఎవరు బద్దలు కొట్టలేకపోయారు. ఆ రికార్డును సాధించిన ఆటగాడెవరో ఈ పాటికే మీకు అర్థమయిందని అనుకుంటున్నాం. ఆ ఆటగాడు మరెవరో కాదు.. వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా. అంతకుముందు వరకు ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజ బ్యాట్స్‌మెన్ గ్యారీ సోబర్స్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును పదేళ్ల తర్వాత లారా 375 పరుగులతో అధిగమించాడు. అయితే లారా చేసిన 375 పరుగుల రికార్డును బ్రేక్ చేస్తూ ఆస్ట్రేలియా నుంచి మాథ్యూ హెడెన్ 2003లో జింబాబ్వేపై 380 పరుగులు చేసి టెస్టుల్లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. (ఆ చీకటి రోజుకు సరిగ్గా 20 ఏళ్లు) అయితే ఏడాది తిరగకుండానే హెడెన్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును లారా సవరించడమే గాక టెస్టుల్లో అనితరసాధ్యమైన (400 నాటౌట్) సాధించాడు. లారా రికార్డును అందుకోవాలని చాలా మంది ఆటగాళ్లు ప్రయత్నించారు. ఇక భారత్ నుంచి రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన విధ్వంసక ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్వాడ్రపుల్ సెంచరీని మాత్రం సాధించలేకపోయాడు. అప్పటినుంచి ఈ 400 పరుగుల రికార్డు అలాగే ఉండిపోయింది. అయితే ఈ ఇన్నింగ్స్‌కు 16 ఏళ్లు నిండడంతో మరోసారి ఆ విశేషాలు మరోసారి గుర్తుచేసుకుందాం. 2004 ఏప్రిల్‌లో ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటించింది. నాలుగు టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి మూడు మ్యాచ్‌ల్లో లారా ఘోరంగా విఫలమయ్యాడు. 3 టెస్టుల్లో కలిపి కేవలం 100 పరుగులు చేయడంతో లారా ఫామ్‌పై అతని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. సెయింట్ జాన్స్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం క్రికెట్ చరిత్రలో ఎవరు అందుకోలేని 400 పరుగుల రికార్డును సాధించి తనపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేశాడు. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 582 బంతులు ఎదుర్కొన్న లారా ఏకంగా 43 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 400 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. లారా భారీ ఇన్నింగ్స్‌తో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 751/5 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకే ఆలౌటై.. ఫాలో ఆన్ ఆడినా ఓటమి నుంచి గట్టెక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 422/5 రాణించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. (‘ఇమ్రాన్ కంటే భారత్ గురించే ఎక్కువ తెలుసు’) లారా వ్యక్తిగత రికార్డు కోసం తొలి ఇన్నింగ్స్‌ను మూడు రోజుల పాటు కొనసాగించడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. జట్టుకు విజయం అందించాలనేది పక్కనపెట్టి కేవలం తన రికార్డుల కోసం ఆరాటపడ్డాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విండీస్.. తమ సొంతగడ్డపై జరిగిన నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 0-3తో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. అయితే నాలుగోటెస్టులో మాత్రం లారా ఇన్నింగ్స్‌తో డ్రాగా ముగిసింది. లారా ఆటతీరుపై ఎన్ని వివాదాలు ఉన్నప్పటికి అతను చేసిన 400 పరుగుల రికార్డు 16 ఏళ్లయినా బద్దలు కాకపోవడమనేది ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే లారా రికార్డును ఎవరు బ్రేక్ చేస్తారనేది వేచి చూద్దాం. -
కప్పు కొట్లాటలో...
44 ఏళ్ల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఐదు జట్లే (వెస్టిండీస్, భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక) ఇప్పటివరకు చాంపియన్లుగా నిలిచాయి. పెద్ద టోర్నీల్లో తేలిపోయే దురదృష్ట దక్షిణాఫ్రికాను మినహాయిస్తే మిగతా వాటిలో కచ్చితంగా జగజ్జేతగా నిలిచే సత్తా ఉన్నవి ఇంగ్లండ్, న్యూజిలాండ్. అయితే, వీటి పోరాటం ఇన్నాళ్లూ సెమీఫైనల్లోనో, ఫైనల్లోనో ముగిసింది. ఇక ఆ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది. కొత్త చాంపియన్ ఆవిర్భావానికి వేదిక సిద్ధమవుతోంది. సరికొత్త చరిత్ర నమోదుకు కాలం వేచి చూస్తోంది. మరి ఈ జట్ల గత ఫైనల్ ప్రస్థానం ఎలా ఉందంటే? సాక్షి క్రీడా విభాగం ఇంగ్లండ్ మూడుసార్లు 1979, 1987, 1992లో న్యూజిలాండ్ 2015లో ప్రపంచ కప్ చివరి మెట్టు వరకు వచ్చాయి. ఇంగ్లిష్ జట్టు... వరుసగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలై విశ్వ విజేతగా నిలిచే అవకాశం చేజార్చుకుంది. కివీస్‌ను గత కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా దెబ్బకొట్టింది. ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడనుండటం ఇదే మొదటిసారి కావడం ఓ విశేషమైతే... 12వ ప్రపంచ కప్ ద్వారా 23 ఏళ్ల తర్వాత కొత్త చాంపియన్‌ను ప్రేక్షకులు చూడబోతుండటం మరో విశేషం. చివరి సారిగా 1996లో (శ్రీలంక) ఓ కొత్త జట్టు జగజ్జేత అయింది. ఇంగ్లండ్ ఆ మూడుసార్లు ఇలా... క్రికెట్ పుట్టిల్లయిన ఇంగ్లండ్ ఇంతవరకు వన్డేల్లో విశ్వవిజేత కాలేకపోవడం ఆశ్చర్యమే. మంచి ఫామ్, గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ కొన్ని తప్పిదాల కారణంగా ఆ జట్టు మిగతా దేశాలతో పోటీలో వెనుకబడిపోయింది. వీటిలో సంప్రదాయ టెస్టు తరహా ఆటను విడనాడకపోవడం మొదటిది. కాలానికి తగ్గట్లు మారకపోవడం రెండోది. ఇప్పుడు వాటిని ఛేదించి అమీతుమీకి సిద్ధమైంది. గతంలోని మూడు విఫలయత్నాలను గమనిస్తే... వివ్ విధ్వంసంలో కొట్టుకుపోయింది... వరుసగా రెండోసారి ఆతిథ్యమిచ్చిన 1979 కప్‌లో ఇంగ్లండ్ గ్రూప్ మ్యాచ్‌లన్నిటిలో అజేయంగా నిలిచింది. కెప్టెన్ మైక్ బ్రియర్లీ, బాయ్‌కాట్ వంటి ఓపెనర్లతో, కుర్రాళ్లు గూచ్, బోథమ్, డేవిడ్ గోవర్లతో టైటిల్ ఫేవరెట్‌గా కనిపించింది. సెమీస్‌లో గట్టి పోటీని తట్టుకుని 9 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్ చేరింది. తుది సమరంలో మాత్రం భీకర వెస్టిండీస్‌కు తలొంచింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం ఓ తప్పిదం కాగా... విధ్వంసక వివ్ రిచర్డ్స్ (157 బంతుల్లో 138 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకంతో ఆతిథ్య జట్టును చితక్కొట్టాడు. కొలిస్ కింగ్ (66 బంతుల్లో 86; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అతడికి అండగా నిలవడంతో కరీబియన్లు నిర్ణీత 60 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేశారు. ఛేదనలో బ్రియర్లీ (64), బాయ్‌కాట్ (57) అర్ధ సెంచరీలతో మంచి పునాది వేసినా జోయల్ గార్నర్ (5/38) ధాటికి గూచ్ (32) మినహా మిగతావారు విఫలమయ్యారు. వీరు కాక రాండల్ (15) మాత్రమే రెండంకెల స్కోరు చేయడంతో ఇంగ్లండ్ 51 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. 92 పరుగుల తేడాతో ఓడి కప్‌ను చేజార్చుకుంది. గాటింగ్ షాట్‌తో గూబ గుయ్... భారత్ ఆతిథ్యమిచ్చిన 1987 కప్‌లో గ్రూప్ దశలో రెండుసార్లు (ఫార్మాట్ ప్రకారం) పాకిస్తాన్ చేతిలో ఓడిన ఇంగ్లండ్... శ్రీలంక, వెస్టిండీస్‌లపై అజేయ విజయాలతో సెమీస్ చేరింది. సెమీస్‌లో నాటి డిఫెండింగ్ చాంపియన్ భారత్‌పై 35 పరుగులతో నెగ్గింది. ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ను 50 ఓవర్లలో 253/5 కు కట్టడి చేసింది. గూచ్ (35), అథె (58)కు తోడు కెప్టెన్ గాటింగ్ (41), అలెన్ లాంబ్ (45) రాణించడంతో లక్ష్యం దిశగా సాగింది. అయితే, 135/2తో ఉన్న దశలో గాటింగ్ అత్యుత్సాహ రివర్స్ స్వీప్ సీన్‌ను రివర్స్ చేసింది. స్కోరు 177 వద్ద అథెను ఔట్ చేసిన ఆసీస్ బౌలర్లు పట్టుబిగించి ఇంగ్లండ్‌ను 50 ఓవర్లలో 246/8కే పరిమితం చేశారు. కప్‌నకు అతి దగ్గరగా వచ్చిన ఇంగ్లండ్ ఏడు పరుగుల తేడాతో కోల్పోయింది. పాక్ ప్రతాపాన్ని తట్టుకోలేక... ఆ వెంటనే జరిగిన 1992 కప్‌లో రౌండ్ రాబిన్ ఫార్మాట్లో ఇంగ్లండ్ అదరగొట్టింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. వర్షం రూపంలో అదృష్టం కలిసివచ్చి సెమీస్‌లో దక్షిణాఫ్రికాను 19 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు వెళ్లింది. అటువైపు ప్రత్యర్థి పాకిస్తాన్ కావడంతో ఇంగ్లండ్‌దే కప్ అని అంతా అనుకున్నారు. కానీ, పాక్ పట్టువిడవకుండా ఆడి ఇంగ్లండ్ కలను చెదరగొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ (72), జావెద్ మియాందాద్ (58) అర్ధసెంచరీలు, ఇంజమామ్ (42) అక్రమ్ (32) మెరుపులతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఛేదనలో అక్రమ్ (3/49), ముస్తాక్ అహ్మద్ (3/41), అకిబ్ జావెద్ (2/27) ప్రతాపానికి నీల్ ఫెయిర్ బ్రదర్ (62) తప్ప మిగతా ఇంగ్లండ్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. దీంతో 49.2 ఓవర్లలో 227 పరుగులకే ఆలౌటై కప్‌నకు 22 పరుగుల దూరంలో ఆగిపోయింది. కివీస్‌కు ఆసీస్ కిక్... ప్రపంచ కప్‌లలో న్యూజిలాండ్‌ది స్థిరమైన ప్రదర్శన. టోర్నీ ఎక్కడ జరిగినా కనీసం సెమీస్ చేరే స్థాయి ఉన్న జట్టుగా బరిలో దిగుతుంది. మొత్తం 12 కప్‌లలో 8 సార్లు సెమీస్‌కు రావడమే దీనికి నిదర్శనం. వాస్తవానికి మార్టిన్ క్రో బ్యాటింగ్ మెరుపులతో సహ ఆతిథ్యమిచ్చిన 1992 కప్‌లోనే కివీస్ హాట్ ఫేవరెట్‌గా కనిపించింది. కానీ, సెమీస్‌లో పాకిస్తాన్ విజృంభణకు తలొంచింది. మళ్లీ 2015లో సహ ఆతిథ్యంలో కెప్టెన్ మెకల్లమ్ విధ్వంసక ఇన్నింగ్స్‌లతో మెగా టోర్నీలో విజేతగా నిలిచేలా కనిపించింది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియాను నిలువరించలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నా... భీకర ఫామ్‌లో ఉన్న మెకల్లమ్ (0) డకౌట్ కావడంతో మానసికంగా బలహీన పడిపోయింది. ఇలియట్ (83), రాస్ టేలర్ (40) మాత్రమే రాణించడంతో 45 ఓవర్లలో 183కే ఆలౌటైంది. స్వల్ప స్కోరును ఆస్ట్రేలియా 33.1 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది. -
క్రికెట్ చరిత్రలో ఇలాంటి క్యాచ్ చూసుండరు!
మెల్బోర్న్ : ‘క్రికెట్ చరిత్రలో ఇలాంటి క్యాచ్ చూసుండరు’.. బిగ్‌బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్బోర్న్ రెనిగేడ్స్ మ్యాచ్‌లో కామెంటేటర్ నోట వచ్చిన మాట ఇది. ఈ వీడియో మీరు చూసిన ఇదే మాట అంటారు. అంత అద్భుత క్యాచ్ అందుకున్నాడు.. కాదు కాదు.. అందుకున్నారు. అడిలైడ్ స్ట్రైకర్స్ ఆటగాళ్లు బెన్ లాఫ్లిన్, జేక్ వెదరాల్డ్లు. మెల్బోర్న్ రెనిగేడ్స్బ్యాట్స్మన్ వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వాన్ బ్రావో, యువ బౌలర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడాడు. అది గాల్లో ఉండగా బౌండరీ వద్ద పరుగెత్తుతూ బెన్ లాఫ్లిన్ అందుకున్నాడు. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయిన లాఫ్లిన్ బంతిని బౌండరీ లైన్ వద్ద గాల్లోకి విసిరేసి పడిపోయాడు. అయితే ఈ బంతిని జేక్ వెదరాల్డ్ చక్కటి డైవ్‌తో అందుకొని మైమరిపించాడు. ఈ క్యాచ్‌తో ఒక్క క్షణం మైదానంలో ఏం జరిగిందో అర్ధం కాలేదు. ఆ వెంటనే కామెంటేటర్ మైకెల్ స్లాటర్ ఇలాంటి బెస్ట్ క్యాచ్ ఇప్పటి వరకు చూసుండరు అని వ్యాఖ్యానించాడు. ఈ క్యాచ్‌కు మైదానంలోని అభిమానులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు సైతం ముగ్ధులయ్యారు. ‘నేను లాఫ్లిన్ వెనుకే పరుగేత్తాను. అతను క్యాచ్ పట్టుకుంటాడనుకున్నా కానీ అతను నాకు పని పెట్టాడు. మరో కొన్ని అడుగులు వెనక్కి వేసి క్యాచ్ అందుకున్నా’ అని మ్యాచ్ అనంతరం వెదరాల్డ్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
చరిత్రలో ఇలాంటి క్యాచ్ చూసుండరు!
-
క్రికెట్ చరిత్రలోనే సంచలన విజయం
పట్నా: క్రికెట్ చరిత్రలోనే సంచలన విజయం నమోదైంది. ఈ సంచలనానికి విజయ్ మర్చంట్ అండర్-16 ట్రోఫీ వేదిక కాగా ఈ భారీ విజయం బీహార్‌ను వరించింది. టోర్నీలో ఆదివారం పట్నా ఎనర్జీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన అరుణాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బీహార్ బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించింది. బీహార్ బ్యాట్స్‌మెన్ బిన్నీ358(380 బంతులు) ట్రిపుల్ సెంచరీ, ప్రకాశ్ 220(222 బంతులు) డబుల్ సెంచరీతో పాటు అర్ణవ్ కిశోర్ 161(129 బంతులు) వేగవంతమైన సెంచరీతో 7 వికెట్లు కోల్పోయి 1007 పరుగుల చేసి డిక్లెర్ ఇచ్చింది. 924 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అరుణాచల్ ప్రదేశ్ 54 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇన్నింగ్స్‌తో పాటు 870 పరుగుల భారీ తేడాతో బీహార్ సంచలన విజయం నమోదు చేసింది. -
హిట్.. హిట్.. హుర్రే..!
ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో టెస్టు మ్యాచ్‌లకు ఆదరణ ఇప్పటికీ తగ్గలేదు. ఏ దేశంలో ఆడినా ప్రేక్షకులు బాగానే ఉంటారు. ఇక యాషెస్ సిరీస్ అయితే పోటెత్తుతారు. కాబట్టి డేనైట్ టెస్టు క్రికెట్‌కు కూడా భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావడంలో ఆశ్చర్యం లేకపోయినా... మూడు రోజుల్లో ఏకంగా లక్షా 23 వేల 736 మంది మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడ టం కచ్చితంగా గొప్ప విషయమే. అంతేకాదు... ఈ టెస్టుకు ప్రపంచ వ్యాప్తంగా టీవీ రేటింగ్స్ కూడా విశేషంగా వచ్చాయి. దీంతో ఐసీసీ ఆనందంలో మునిగింది. డేనైట్ మ్యాచ్‌లను మరింత విస్తరించాలనే ఆలోచనలో ఉంది. డేనైట్ టెస్టు ప్రయోగం విజయవంతం * మరిన్ని మ్యాచ్‌ల ఆలోచనలో ఐసీసీ సాక్షి క్రీడావిభాగం: టి20ల మాయలో టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గిపోతోందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. భారత్, పాకిస్తాన్ లేదా యాషెస్ సిరీస్‌కు తప్ప మిగిలిన ఏ దేశాల మధ్య టెస్టులు జరిగినా ప్రేక్షకులు రావడం లేదు. క్రికెట్‌ను విపరీతంగా ప్రేమించే భారత్‌లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ప్రేక్షకులే లేరు. పాఠశాల పిల్లలను ఉచితంగా స్టేడియాలకు తీసుకొచ్చినా కనీసం నాలుగు వేల మందిని కూడా స్టేడియానికి రప్పించలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల మధ్య అడిలైడ్‌లో జరిగిన టెస్టుకు వచ్చిన ఆదరణ అమోఘం. స్టేడియానికి భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావడంతో పాటు టీవీల్లో ఈ మ్యాచ్‌ను విశేషంగా చూశారు. ఒక్క ఆస్ట్రేలియాలో మ్యాచ్ ఆఖరి రోజు రాత్రి 32 లక్షల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశారు. ఇటు భారత్‌లోనూ ఇది పూర్తిగా పగటి పూట రావడంతో వీక్షకులు సంఖ్య బాగానే ఉంది. వచ్చే ఏడాది మరో రెండు తొలిసారి తమ దగ్గర నిర్వహించిన డేనైట్ మ్యాచ్ విజయవంతం కావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త ఉత్సాహంలో ఉంది. వచ్చే ఏడాది తమ సీజన్ ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టును డేనైట్‌గా నిర్వహించాలని భావిస్తోంది. అలాగే పాకిస్తాన్‌తో కూడా ఓ టెస్టు పింక్ బంతితో ఆడాలనే ప్రతిపాదన చేస్తున్నారు. అటు ఐసీసీ కూడా అన్ని బోర్డులనూ ఈ ప్రతిపాదనను పరిశీలించాలని కోరింది. సమస్యలు లేవా? పింక్ బంతితో మ్యాచ్‌లు ఆడటం వల్ల సమస్యలు పెద్దగా లేవు. లైట్ల వెలుతురులో ఈ బంతి మైదానంలో వెళుతుంటే మరింత ఆహ్లాదంగా ఉంది. కాబట్టి బంతి రంగు విషయంలో ఇన్నాళ్ల కష్టం ఫలించినట్లే. అయితే పింక్ బంతి ఎరుపు బంతులతో పోలిస్తే త్వరగా మెత్తబడుతోందనే ఫిర్యాదు ఒకటుంది. దీనితో పాటు సాయం సమయంలో కాస్త ఇబ్బందిగా ఉందని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెటర్లు చెబుతున్నారు. సూర్యాస్తమయం జరుగుతున్న సమయంలో... లైట్ల ప్రభావం పూర్తిగా రాకముందు ఒక గంట పాటు బ్యాటింగ్ క్లిష్టంగా ఉందని అంటున్నారు. కాబట్టి బంతి తయారీదారులు దీనికి పరిష్కారాన్ని వెతకాల్సి రావచ్చు. అలాగే పింక్ బంతి కోసం పచ్చిక ఎక్కువగా ఉండేలా పిచ్‌ను రూపొం దించారు. దీనివల్ల మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగి సింది. ఇలాంటి పిచ్ మీద ఆడటం ఉపఖండం జట్లకు చాలా కష్టం. అయితే అంత పచ్చిక లేకున్నా సమస్య లేదని ఆస్ట్రేలియా కోచ్ లీమన్ అంటున్నారు. ఇంకా ప్రయోగాలు చేయాలి రాత్రి పూట టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు వీలుగా బంతిని తయారు చేసేందుకు కూకాబూరా కంపెనీ పదేళ్లు కష్టపడింది. రకరకాల ప్రయోగాలు చేసిన తర్వాత తొలి మ్యాచ్ జరిగింది. అయితే వచ్చే ఏడాది కాలంలో ఈ బంతిని మరింత మెరుగుపరచాలని క్రికెటర్లు కోరుతున్నారు. ఏమైనా క్రికెట్ చరిత్రలో ఇదో పెద్ద మలుపనే అనుకోవాలి. టి20లు వచ్చాక, ఆటలో వేగం పెరిగి... రోజంతా కూర్చుని మ్యాచ్‌లు చూసే ఓపిక అభిమానులకు తగ్గిపోయింది. రాత్రి పూట మ్యాచ్‌లు చూడటం ఎప్పుడైనా బాగానే ఉంటుంది. అయితే ఉపఖండంలోని పిచ్‌లపై ఈ బంతితో ఆడటం కష్టమని నిర్వాహకులే చెబుతున్నారు. కాబట్టి ఈ విజయవంతమైన ప్రయోగాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయాలంటే ఐసీసీ కూడా భారీగానే కసరత్తు చేయాల్సి ఉంటుంది. -
క్రికెట్ చరిత్రలో పెద్ద జాబితానే ఉంది