పట్నా: క్రికెట్ చరిత్రలోనే సంచలన విజయం నమోదైంది. ఈ సంచలనానికి విజయ్ మర్చంట్ అండర్-16 ట్రోఫీ వేదిక కాగా ఈ భారీ విజయం బీహార్‌ను వరించింది. టోర్నీలో ఆదివారం పట్నా ఎనర్జీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన అరుణాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బీహార్ బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించింది.
బీహార్ బ్యాట్స్‌మెన్ బిన్నీ358(380 బంతులు) ట్రిపుల్ సెంచరీ, ప్రకాశ్ 220(222 బంతులు) డబుల్ సెంచరీతో పాటు అర్ణవ్ కిశోర్ 161(129 బంతులు) వేగవంతమైన సెంచరీతో 7 వికెట్లు కోల్పోయి 1007 పరుగుల చేసి డిక్లెర్ ఇచ్చింది. 924 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అరుణాచల్ ప్రదేశ్ 54 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇన్నింగ్స్‌తో పాటు 870 పరుగుల భారీ తేడాతో బీహార్ సంచలన విజయం నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment