
మెల్‌బోర్న్ : ‘క్రికెట్ చరిత్రలో ఇలాంటి క్యాచ్ చూసుండరు’.. బిగ్‌బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్‌బోర్న్ రెనిగేడ్స్ మ్యాచ్‌లో కామెంటేటర్ నోట వచ్చిన మాట ఇది. ఈ వీడియో మీరు చూసిన ఇదే మాట అంటారు. అంత అద్భుత క్యాచ్ అందుకున్నాడు.. కాదు కాదు.. అందుకున్నారు. అడిలైడ్ స్ట్రైకర్స్ ఆటగాళ్లు బెన్ లాఫ్‌లిన్, జేక్ వెదరాల్డ్‌లు.
మెల్‌బోర్న్ రెనిగేడ్స్బ్యాట్స్మన్ వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వాన్ బ్రావో, యువ బౌలర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడాడు. అది గాల్లో ఉండగా బౌండరీ వద్ద పరుగెత్తుతూ బెన్ లాఫ్‌లిన్ అందుకున్నాడు. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయిన లాఫ్‌లిన్ బంతిని బౌండరీ లైన్ వద్ద గాల్లోకి విసిరేసి పడిపోయాడు. అయితే ఈ బంతిని జేక్ వెదరాల్డ్ చక్కటి డైవ్‌తో అందుకొని మైమరిపించాడు. ఈ క్యాచ్‌తో ఒక్క క్షణం మైదానంలో ఏం జరిగిందో అర్ధం కాలేదు. ఆ వెంటనే కామెంటేటర్ మైకెల్ స్లాటర్ ఇలాంటి బెస్ట్ క్యాచ్ ఇప్పటి వరకు చూసుండరు అని వ్యాఖ్యానించాడు. ఈ క్యాచ్‌కు మైదానంలోని అభిమానులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు సైతం ముగ్ధులయ్యారు.
‘నేను లాఫ్‌లిన్ వెనుకే పరుగేత్తాను. అతను క్యాచ్ పట్టుకుంటాడనుకున్నా కానీ అతను నాకు పని పెట్టాడు. మరో కొన్ని అడుగులు వెనక్కి వేసి క్యాచ్ అందుకున్నా’ అని మ్యాచ్ అనంతరం వెదరాల్డ్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment