
మెల్‌బోర్న్: ప్రపంచవ్యాప్తంగా టి20 లీగ్ నిర్వాహకులు కొత్త తరహా ఆకర్షణలతో ముందుకు వస్తున్నారు. ఈ కోవలో తాజాగా ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) కూడా చేరింది. ఈ సారి ‘టాస్’ను కూడా ఆసక్తికరంగా మార్చేందుకు బీబీఎల్ ప్రయత్నిస్తోంది. ఈ నెల 19న ప్రారంభం కానున్న ఈ లీగ్‌లో టాస్ కోసం నాణేన్ని కాకుండా ‘బ్యాట్’ను గాల్లోకి ఎగరేయనున్నారు. కెప్టెన్ బ్యాట్ ముందు భాగం లేదా వెనుక భాగాన్ని ఎంచుకోవాల్సి (హిల్స్ లేదా ఫ్లాట్స్) ఉంటుంది. టాస్ కోసం ఎగరవేసే ఒకే తరహా బ్యాట్‌ను బీబీఎల్ నిర్వాహకులే అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment