
హోబర్ట్ : కరేబియన్ స్టార్ జోఫ్రా ఆర్చర్ బౌండరీ లైన్ వద్ద అదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా మంగళవారం బ్రిస్బెన్‌హీట్-హోబర్ట్ హరికేన్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో జోఫ్రా అద్భుత ఫీల్డింగ్ అదరగొట్టాడు. బ్రిస్బెన్ హీట్ ఇన్నింగ్స్‌లో జేమ్స్ ఫాల్క్‌నర్ వేసిన మూడో ఓవర్ ఐదో బంతిని ఓపెనర్ మ్యాక్స్ బ్రియాంట్ లాంగాన్‌లో భారీ షాట్ ఆడాడు. అందరూ పక్కా సిక్స్ అని భావించారు. కానీ ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న ఆర్చర్.. చిరుతలా పరుగెత్తి బౌండరీ లైన్ వద్ద ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. ఈ సమయంలో సమన్వయం కోల్పోతున్ననట్లు గ్రహించిన ఆర్చర్ బంతిని గాల్లోకి విసిరేసి తిరుగొచ్చి అందుకున్నాడు. రెప్పపాటులో జరిగిన ఈ ఫీట్‌తో మైదానంలో ఆటగాళ్లు, అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఇక బ్యాట్స్‌మన్ మ్యాక్స్ బ్రియాంట్ (7) నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిది.
ఆర్చర్ ఈ అద్భుత క్యాచ్‌తో పాటు క్రిస్‌లిన్(10),రేన్‌షా(0)ల వికెట్లను పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బెన్ హీట్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన హరికేన్స్ 14.2 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
JOFRA ARCHER STOP IT 😲😲#BBL08 | @BKTtires pic.twitter.com/ZjkGB7BjVp
— cricket.com.au (@cricketcomau) 29 January 2019
Comments
Please login to add a commentAdd a comment