
వరల్డ్ కప్‌లో మెరుపులు!
తొలిసారి ఎల్‌ఈడీ బెయిల్స్
ఢాకా: టి20 ప్రపంచ కప్‌లో మనం వెలుగులు విరజిమ్మే బెయిల్స్‌ను చూడవచ్చు. తొలిసారి ఈ టోర్నీలో లైట్ ఎమిటింగ్ డయోడ్ (ఎల్‌ఈడీ) బెయిల్స్‌ను వాడాలని ఐసీసీ నిర్ణయించింది. ఆస్ట్రేలియాలోని బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) లో ఈ ప్రయోగం విజయవంతం కావడంతో దానిని ప్రపంచకప్‌లో కూడా ప్రవేశ పెడుతున్నారు. ముఖ్యం గా రనౌట్లు, స్టంపింగ్‌ల సమయంలో థర్డ్ అంపైర్లకు ఇవి ఎంతో ఉపకరిస్తాయి.
బంతి బెయిల్స్‌ను తాకిన క్షణమే వచ్చే మెరుపులతో మరింత సమర్ధవంతంగా, స్పష్టంగా వారు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉం టుంది. బీబీఎల్‌లో ఇది సక్సెస్ అయినా వివాదాన్ని కూడా వెంట తెచ్చింది. సాధారణ బెయిల్స్‌తో పోలిస్తే ఇవి కాస్త బరువు ఎక్కువగా ఉంటాయి.
సిడ్నీ, మెల్‌బోర్న్ మధ్య జరిగిన మ్యాచ్‌లో దిల్షాన్, ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ హాడ్జ్‌ను రనౌట్ చేయడానికి ప్రయత్నిం చాడు. అయితే త్రో సరిగ్గానే తగిలి బెయిల్స్ మెరిసినా వాటి బరువు కారణంగా కిందకు పడలేదు. దాంతో హాడ్జ్ రనౌట్‌పై వివాదం చెలరేగింది. ఇక ప్రపంచకప్‌లో ఇది ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి.