టీమిండియా కెప్టెన్‌కు అవమానం | Indian Captain Harmanpreet Kaur Unsold In WBBL Draft 2024, Check Draft Results Names Inside | Sakshi
Sakshi News home page

WBBL Draft 2024: టీమిండియా కెప్టెన్‌కు అవమానం

Published Sun, Sep 1 2024 4:55 PM | Last Updated on Sun, Sep 1 2024 5:57 PM

Indian Captain Harmanpreet Kaur Unsold In WBBL Draft 2024

మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ డ్రాఫ్ట్‌లో టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు అవమానం జరిగింది. ఇవాళ (సెప్టెంబర్‌ 1) జరిగిన డ్రాఫ్ట్‌లో హర్మన్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. బిగ్‌బాష్‌ లీగ్‌లో ఘనమైన ట్రాక్‌ రికార్డు కలిగిన హర్మన్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడం గమనార్హం. 

హర్మన్‌ బీబీఎల్‌లో 62 మ్యాచ్‌లు ఆడి 117.16 స్ట్రయిక్‌రేట్‌తో 1440 పరుగులు చేసింది. 35 ఏళ్ల హర్మన్‌ మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌, సిడ్నీ థండర్‌ తరఫున ఐదు సీజన్ల పాటు బిగ్‌బాష్‌ లీగ్‌లో పాల్గొంది. హర్మన్‌ 2023 మహిళల ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టింది. గత సీజన్‌లోనూ ముంబై ఇండియన్స్‌ను ఫైనల్‌కు చేర్చింది. 

అంతర్జాతీయ టీ20ల్లోనూ ఘనమైన ట్రాక్‌ రికార్డు (153 మ్యాచ్‌ల్లో 3426 పరుగులు) కలిగిన హర్మన్‌ను ఏ ఫ్రాంచైజీ ఎంపిక చేసుకోకపోవడం విచారకరం.

కాగా, మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ డ్రాఫ్ట్‌లో మొత్తం 19 మంది భారత ఆటగాళ్లు తమ పేరు నమోదు చేసుకోగా.. కేవలం ఆరుగురు మాత్రమే వివిధ ఫ్రాంచైజీల చేత ఎంపిక చేసుకోబడ్డారు. 

స్మృతి మంధనను అడిలైడ్‌ స్ట్రయికర్స్‌ ముందస్తుగా (ప్రీ సైన్డ్‌) సొంతం చేసుకోగా.. దయాలన్‌ హేమలతను పెర్త్‌ స్కార్టర్స్‌, శిఖా పాండేను బ్రిస్బేన్‌ హీట్‌, యస్తికా భాటియాను మెల్‌బోర్న్‌ స్టార్స్‌, దీప్తి శర్మను మెల్‌బోర్న్‌ స్టార్స్‌, జెమీమా రోడ్రిగెజ్‌ను బ్రిస్బేన్‌ హీట్‌ డ్రాఫ్ట్‌లో ఎంపిక​ చేసుకున్నాయి. మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ అక్టోబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 1 వరకు సాగనుంది.

డ్రాఫ్ట్‌ రిజల్ట్స్‌..

సోఫీ ఎక్లెస్టోన్ (సిడ్నీ సిక్సర్లు,రిటెన్షన్ పిక్)
హీథర్ నైట్ (సిడ్నీ థండర్, రిటెన్షన్ పిక్)
లారా వోల్వార్డ్ట్ (అడిలైడ్ స్ట్రైకర్స్, రిటెన్షన్ పిక్)
డాని వ్యాట్ (హోబర్ట్ హరికేన్స్)
డియాండ్రా డాటిన్ (మెల్బోర్న్ రెనెగేడ్స్)
దీప్తి శర్మ (మెల్‌బోర్న్ స్టార్స్)
జెమిమా రోడ్రిగ్స్ (బ్రిస్బేన్ హీట్)
సోఫీ డివైన్ (పెర్త్ స్కార్చర్స్, ప్రీ-సైన్డ్ ప్లేయర్)
క్లో ట్రయాన్ (హోబర్ట్ హరికేన్స్)
అమేలియా కెర్ (సిడ్నీ సిక్సర్స్, ప్రీ-సైన్డ్ ప్లేయర్)
హేలీ మాథ్యూస్ (మెల్బోర్న్ రెనెగేడ్స్, ప్రీ-సైన్డ్ ప్లేయర్)
మారిజానే కాప్ (మెల్బోర్న్ స్టార్స్, ప్రీ-సైన్డ్ ప్లేయర్)
షబ్నిమ్ ఇస్మాయిల్ (సిడ్నీ థండర్)
శిఖా పాండే (బ్రిస్బేన్ హీట్)
అమీ జోన్స్ (పెర్త్ స్కార్చర్స్)
హేమలత దయాళన్ (పెర్త్ స్కార్చర్స్)
ఆలిస్ క్యాప్సే (మెల్బోర్న్ రెనెగేడ్స్)
చమారి అతపత్తు (సిడ్నీ థండర్, ప్రీ-సైన్డ్ ప్లేయర్)
యాస్తిక భాటియా (మెల్‌బోర్న్ స్టార్స్)
స్మృతి మంధాన (అడిలైడ్ స్ట్రైకర్స్, ప్రీ-సైన్డ్‌ ప్లేయర్‌)
లిజెల్ లీ (హోబర్ట్ హరికేన్స్, ప్రీ-సైన్డ్ ప్లేయర్)
హోలీ ఆర్మిటేజ్ (సిడ్నీ సిక్సర్లు)
ఓర్లా ప్రెండర్‌గాస్ట్ (అడిలైడ్ స్ట్రైకర్స్)
జార్జియా ఆడమ్స్ (సిడ్నీ థండర్)
నదీన్ డి క్లెర్క్ (బ్రిస్బేన్ హీట్, ప్రీ-సైన్డ్ ప్లేయర్)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement