మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధన కళ్లు చెదిరే రన్నింగ్ క్యాచ్ పట్టుకుంది. డబ్ల్యూబీబీఎల్‌లో అడిలైడ్ స్ట్రయికర్స్‌కు ఆడే మంధన పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదిరిపోయే ఫీల్డింగ్ విన్యాసాన్ని ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌లో మంధన అమండ జేడ్ బౌలింగ్‌లో కార్లీ లీసన్ క్యాచ్‌ను పట్టుకుంది.
స్కార్చర్స్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ తొలి బంతికి లీసన్ కవర్స్ దిశగా షాట్ ఆడగా.. మిడ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మంధన వెనక్కు పరిగెడుతూ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకుంది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరవతువుంది.
WHAT A STUNNING CATCH BY SMRITI MANDHANA IN WBBL 🤯🔥 pic.twitter.com/byoJRzx69i
— Johns. (@CricCrazyJohns) November 19, 2024
మూడు క్యాచ్‌లు పట్టుకున్న మంధన
ఈ మ్యాచ్‌లో మంధన మొత్తం మూడు క్యాచ్‌లు పట్టుకుంది. ఈ మూడు అద్భుతమైన క్యాచ్‌లే. మైదానంలో పాదరసంలా కదిలిన మంధన బ్యాట్‌తోనూ రాణించింది. 29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 41 పరుగులు చేసింది. మంధన బ్యాట్‌తో, ఫీల్డ్‌లో రాణించడంతో అడిలైడ్ స్ట్రయికర్స్ 30 పరుగులు తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్ట్రయికర్స్.. మంధన (41), కేటీ మ్యాక్(41), లారా వోల్వార్డ్ట్ (48) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. స్కార్చర్స్ బౌలర్లలో అలానా కింగ్ 3, కెప్టెన్ సోఫీ డివైన్ 2, క్లో ఐన్స్‌వర్త్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కార్చర్స్.. మెగాన్ షట్ (3/19), ముషాంగ్వే (2/35), అమండ జేడ్ వెల్లింగ్టన్ (2/26), తహిల మెక్‌గ్రాత్ (1/27) ధాటికి నిర్ణీత ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్కార్చర్స్ ఇన్నింగ్స్‌లో బ్రూక్ హ్యాలీడే (47), సోఫీ డివైన్ (35), అలానా కింగ్ (29 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment