ఇవాళ (సెప్టెంబర్ 1) జరిగిన పురుషుల బిగ్‌బాష్ లీగ్ డ్రాఫ్ట్‌లో ఇంగ్లండ్ ప్లేయర్లకు మాంచి గిరాకీ ఉండింది. డ్రాఫ్ట్‌లో మొత్తం 14 మంది ఇంగ్లండ్ ప్లేయర్లను వివిధ ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. నాలుగు రౌండ్ల పాటు సాగిన డ్రాఫ్ట్‌లో ఇంగ్లండ్ (14), న్యూజిలాండ్ (4), వెస్టిండీస్ (4), బంగ్లాదేశ్ (1), పాకిస్తాన్ (1) దేశాలకు చెందిన 24 మంది ప్లేయర్లు ఎంపిక చేయబడ్డారు. ఆసియా దేశాల నుంచి పాక్‌కు చెందిన ఉసామా మిర్, బంగ్లాదేశ్‌కు చెందిన రిషద్ హొస్సేన్ మాత్రమే ఎంపిక చేయబడ్డారు.
రౌండ్ల వారీగా వివిధ ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్న ఆటగాళ్ల వివరాలు..
తొలి రౌండ్:
బెన్ డకెట్- మెల్‌బోర్న్ స్టార్స్
జేమ్స్ విన్స్-సిడ్నీ సిక్సర్స్ (రిటెన్షన్)
లారీ ఈవాన్స్- మెల్‌బోర్న్ రెనిగేడ్స్
లోకీ ఫెర్గూసన్- సీడ్నీ థండర్
షాయ్ హోప్- హోబర్ట్ హరికేన్స్
జేమీ ఓవర్టన్- అడిలైడ్ స్ట్రయికర్స్ (రిటెన్షన్)
కొలిన్ మున్రో- బ్రిస్బేన్ హీట్ (ప్రీ సైన్డ్)
ఫిన్ అలెన్- పెర్త్ స్కార్చర్స్ (ప్రీ సైన్డ్)
రెండో రౌండ్:
టామ్ కర్రన్ మెల్‌బోర్న్ స్టార్స్ (ప్రీ సైన్డ్)
జాకబ్ బెతెల్ - మెల్‌బోర్న్ రెనెగేడ్స్
ఒల్లీ పోప్ - అడిలైడ్ స్ట్రైకర్స్ (ప్రీ సైన్డ్ ప్లేయర్)
హోబర్ట్ హరికేన్స్ - క్రిస్ జోర్డన్ (ప్రీ-సైన్డ్ ప్లేయర్)
సామ్ బిల్లింగ్స్ - సిడ్నీ థండర్ (ప్రీ-సైన్డ్ ప్లేయర్)
పాల్ వాల్టర్ - బ్రిస్బేన్ హీట్
అకీల్ హోసేన్ - సిడ్నీ సిక్సర్స్ (ప్రీ సైన్డ్)
మూడో రౌండ్:
మాథ్యూ హర్స్ట్ - పెర్త్ స్కార్చర్స్
ఫాబియన్ అలెన్ - అడిలైడ్ స్ట్రైకర్స్
షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ - సిడ్నీ థండర్
టిమ్ సీఫెర్ట్ - మెల్‌బోర్న్ రెనిగేడ్స్ (ప్రీ సైన్డ్)
ఉసామా మీర్ - మెల్‌బోర్న్ స్టార్స్
నాలుగో రౌండ్:
రిషద్ హుస్సేన్-హోబర్ట్ హరికేన్స్
బ్రిస్బేన్ హీట్ - టామ్ అల్సోప్
కీటన్ జెన్నింగ్స్ - పెర్త్ స్కార్చర్స్
జాఫర్ చోహన్-సిడ్నీ సిక్సర్స్
Comments
Please login to add a commentAdd a comment