Melbourne Stars sign Andre Russell for Big Bash league 2021: వెస్టిండీస్ విద్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ తిరిగి బిగ్ బాష్ లీగ్‌లో అడుగు పెట్టనునన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న11వ ఎడిషన్ కోసం మెల్‌బోర్న్ స్టార్స్‌తో ఒప్పందం రస్సెల్ కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని మెల్‌బోర్న్ స్టార్స్ కోచ్ డేవిడ్ హస్సీ సృష్టం చేశాడు. రస్సెల్ లాంటి స్టార్ ఆటగాడు మాతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషకరమని హస్సీ తెలిపాడు. రస్సెల్ ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడని హస్సీ చెప్పాడు.
డిసెంబర్10న సిడ్నీ థండర్స్‌తో జరిగే మ్యాచ్‌లో రస్సెల్ ఆడనున్నాడని హస్సీ పేర్కొన్నాడు. కాగా రస్సెల్‌కు బిగ్ బాష్ లీగ్‌లో ఆడడం ఇదేం తొలిసారి కాదు. అంతకుముందు రస్సెల్ ఈ లీగ్‌లో 2014 నుంచి 2017 వరకు సిడ్నీ థండర్స్ తరుపున ఆడాడు. కాగా ఐపీఎల్-14 సీజన్‌లో రస్సెల్ పేలవ ప్రదర్శన కనబర్చాడు. కానీ ఇటీవల ముగిసిన అబుదాబి టీ10 లీగ్‌లో రస్సెల్ అద్బుతంగా రాణించి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. మరి ఈ ఆస్ట్రేలియాన్ లీగ్‌లో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. కాగా బిగ్ బాష్ లీగ్ డిసెంబర్ 5న ప్రారంభంమైన సంగతి తెలిసిందే.
చదవండి: Ashes Series: ఇంగ్లండ్ చెత్త ఆట.. క్వీన్స్‌లాండ్ పోలీస్ విచారణ
Comments
Please login to add a commentAdd a comment