
భారత మహిళా క్రికెటర్లకు శుభవార్త!
న్యూఢిల్లీ: విదేశాల్లో నిర్వహిస్తున్న లీగ్లో పాల్గొనాలనుకునే భారత మహిళా క్రికెటర్లకు శుభవార్త. ఇంగ్లండ్(మహిళల సూపర్ లీగ్), ఆస్ట్రేలియా(మహిళల బిగ్ బాష్ లీగ్)లలో నిర్వహించే లీగ్లో ఇక నుంచి భారత స్టార్ మహిళా క్రికెటర్లు ఆడేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అనుమతినిచ్చింది. ఈ మేరకు మహిళల క్రికెట్ సమావేశంలో నిబంధనలను సులభతరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో స్టార్ క్రికెటర్స్ మిథాలీ రాజ్,జులన్ గోస్వామి లాంటి వారికి ఈ నిర్ణయం ఆర్థికంగా లాభం చేకూర్చనుంది.అయితే బీసీసీఐ ఆల్యస్యంగా నిర్ణయం తీసుకోవడంతో ఈ ఏడాది జూలై 30 నుంచి ఆగస్టు 14 వరకూ జరిగే డబ్యుఎస్ఎల్ తొలి సీజన్లో ఆడే అవకాశం తక్కువగా కనబడుతోంది.