టీమిండియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు వికెట్‌కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడని తెలుస్తుంది. జేమీ స్మిత్ భారత్‌తో ఇటీవల జరిగిన మూడో టీ20 సందర్భంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అతను చికిత్స తీసుకుంటున్నాడు. తొలి వన్డేకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండగా.. జేమీ స్మిత్ ఇంకా కోలుకోలేదు.
దీంతో అతను తొలి రెండు వన్డేలకు దూరం కానున్నాడని తెలుస్తుంది. అయితే ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. భారత్‌తో వన్డే సిరీస్‌లో స్మిత్ లేకపోయినా ఇంగ్లండ్‌కు మరో రెండు వికెట్‌కీపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. కెప్టెన్ జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్‌లలో ఎవరో ఒకరు వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టవచ్చు. అయితే బట్లర్ గాయం నుంచి కోలుకున్న తర్వాత ఇప్పటివరకు వికెట్‌కీపింగ్ చేయలేదు. మరోవైపు సాల్ట్‌కు వన్డేల్లో పెద్దగా వికెట్‌కీపింగ్ చేసిన అనుభవం లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ ఏం చేస్తుందో వేచి చూడాలి.
కాగా, భారత్‌తో తాజాగా ముగిసిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ 1-4 తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో పరాభవం తర్వాత ఇంగ్లండ్ కోలుకోవాలని చూస్తుంది. ఫిబ్రవరి 6 నుంచి భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని భావిస్తుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌కు ఇదే ఆఖరి వన్డే సిరీస్. ఈ సిరీస్‌లో సత్తా చాటి ఛాంపియన్స్ ట్రోఫీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వాలని ఇంగ్లండ్ ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు ఇంగ్లండ్ వన్డే జట్టులో స్టార్ ఆటగాడు జో రూట్ చేరాడు. రూట్ చేరికతో ఇంగ్లండ్ బలం పెరుగుతుంది.
ఫిబ్రవరి 6 నుంచి మొదలు
భారత్‌తో తొలి వన్డే నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 6న జరుగనుంది. అనంతరం ఫిబ్రవరి 9, 12 తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లకు కటక్, అహ్మదాబాద్ వేదికలు కానున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి ప్రారంభమవుతాయి.
భారత్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు..
జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, జో రూట్, బెన్ డకెట్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, ఫిల్ సాల్ట్, జేమీ స్మిత్, బ్రైడన్ కార్స్, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
Comments
Please login to add a commentAdd a comment