
ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లాబుషేన్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీతో చెలరేగిన లాబుషేన్.. 935 పాయింట్లతో ఇంగ్లండ్ బ్యాటర్ జోరూట్ అధిగమించి తొలి స్థానంలో నిలిచాడు. ఇక ఫస్ట్ ర్యాంక్‌లో ఉన్న జో రూట్ నాలుగో స్థానానికి పడిపోయాడు.
అదే విధంగా వెస్టిండీస్‌పై డబుల్ సెంచరీ సాధించిన స్మిత్ రెండో ర్యాంక్‌కు, ఇంగ్లండ్‌పై సెంచరీతో రాణించిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం మూడో ర్యాంక్‌కు చేరుకున్నారు. మరోవైపు వెస్టిండీస్ కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్ టాప్ 20లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో బ్రాత్‌వైట్ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 174 పరుగులు సాధించాడు.
ఇక బౌలర్ల విషయానికి వస్తే.. విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్లు పడగొట్టిన ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లయాన్ ఒక స్థానం ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. అదే విధంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఐదు వికెట్లు సాధించిన నసీం షా ఐదు స్థానాలు ఎగబాకి 54 వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
చదవండి: IND vs BAN: వారెవ్వా ఉమ్రాన్.. 151 కిమీ వేగంతో బౌలింగ్! బంగ్లా బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఔట్