ఐసీసీ తాజా టెస్టు బ్యాటింగ్ ర్యాకింగ్స్‌లో ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్ సత్తా చాటాడు. ఏకంగా మూడుస్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంకు సంపాదించాడు. శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న బ్రూక్.. తొలి మ్యాచ్‌లో వరుసగా 56, 32 పరుగులు సాధించాడు.
టాప్-10లోనే మనోళ్లు
ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం స్థానాన్ని భర్తీ చేస్తూ టాప్-5లో నిలిచాడు. ఇక ఇంగ్లిష్ వెటరన్ స్టార్ జో రూట్ తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా.. న్యూజిలాండ్ మాజీ సారథి కేన్ విలియమ్సన్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు.. టీమిండియా స్టార్లు కెప్టెన్ రోహిత్ శర్మ ఆరో ర్యాంకులో కొనసాగుతుండగా.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక స్థానం(7), రన్‌మెషీన్ విరాట్ కోహ్లి(8) రెండు స్థానాలు మెరుగుపరచుకుని టాప్-10లో నిలిచారు.
తొమ్మిదికి పడిపోయిన బాబర్
కాగా గత కొన్నాళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శల పాలవుతున్న పాక్ బ్యాటర్ బాబర్ ఆజం ఏకంగా ఆరు స్థానాలు దిగజారి తొమ్మిదో ర్యాంకుకు పడిపోయాడు. అయితే, ఇటీవల బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో శతకం బాదిన పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్.. ఏడు స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ పదవ ర్యాంకు అందుకున్నాడు. ఇక ఇదే మ్యాచ్‌లో 191 పరుగులతో చెలరేగిన బంగ్లా వెటరన్ స్టార్ ముష్ఫికర్ రహీం సైతం కెరీర్ హై రేటింగ్ సాధించి 17వ ర్యాంకులో నిలిచాడు.
ఐసీసీ తాజా టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-10
👉జో రూట్(ఇంగ్లండ్)- 881 రేటింగ్ పాయింట్లు
👉కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)- 859 రేటింగ్ పాయింట్లు
👉డారిల్ మిచెల్(న్యూజిలాండ్)- 768 రేటింగ్ పాయింట్లు
👉హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్)- 758 రేటింగ్ పాయింట్లు
👉స్టీవెన్ స్మిత్(ఆస్ట్రేలియా)- 757 రేటింగ్ పాయింట్లు
👉రోహిత్ శర్మ(ఇండియా)- 751 రేటింగ్ పాయింట్లు
👉యశస్వి జైస్వాల్(ఇండియా)- 740 రేటింగ్ పాయింట్లు
👉విరాట్ కోహ్లి(ఇండియా)- 737 రేటింగ్ పాయింట్లు
👉బాబర్ ఆజం(పాకిస్తాన్)- 734 రేటింగ్ పాయింట్లు
👉ఉస్మాన్ ఖవాజా(ఆస్ట్రేలియా)- 728 రేటింగ్ పాయింట్లు
ఇక టెస్టు బౌలర్ల ర్యాంకుల విషయానికొస్తే టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నంబర్ వన్‌గా కొనసాగుతుండగా.. జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా), జస్‌ప్రీత్ బుమ్రా(ఇండియా), ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా), కగిసో రబడ(సౌతాఫ్రికా) టాప్-5లో నిలకడగా ఉన్నారు.
చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్
Comments
Please login to add a commentAdd a comment