కేఎల్ రాహుల్‌పై నెటిజన్స్ ఫైర్ (PC: BCCI/ X)
Fans Fires On KL Rahul: టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై అభిమానులు మండిపడుతున్నారు. ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టుతో తలపడతున్నపుడు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా భారీ మూల్యం చెల్లించకతప్పదని చురకలు అంటిస్తున్నారు. చేతి దాకా వచ్చిన బంతిని అలా ఎలా వదిలేస్తావంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
కాగా వన్డే వరల్డ్‌కప్-2023కి ముందు సన్నాహకంగా భారత్.. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలి రెండు మ్యాచ్‌లకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినివ్వగా.. కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు.
ఈ క్రమంలో మొహాలీ వేదికగా శుక్రవారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఈ టీమిండియా... తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన కంగారూ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా పేసర్లలో మహ్మద్ షమీ 5 వికెట్లతో చెలరేగగా.. బుమ్రా, శార్దూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ తీశారు. స్పిన్ విభాగం నుంచి అశ్విన్, జడేజా చెరో వికెట్ కూల్చారు.
రాహుల్ వల్ల రనౌట్ మిస్
కాగా.. 23వ ఓవర్ మొదటి బంతికి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో మార్నస్ లబుషేన్‌ను రనౌట్ చేసే అవకాశం వచ్చింది టీమిండియాకు! కానీ వికెట్ కీపింగ్ చేస్తున్న రాహుల్ నిర్లక్ష్యం కారణంగా అతడు బతికిపోయాడు.
అయితే, సూర్యకుమార్ యాదవ్ బంతి అందుకునే క్రమంలో లబుషేన్, కామెరాన్ గ్రీన్ కన్ఫ్యూజన్‌కు లోనయ్యారు. లబుషేన్ పిచ్ మధ్యలో ఉన్న సమయంలో సూర్య బంతిని రాహుల్ వైపునకు విసిరాడు. కానీ క్యాచ్ పట్టడంలో అతడు విఫలం కావడంతో ఆసీస్ బ్యాటర్‌కు లైఫ్ వచ్చింది.
సూర్య చాకచక్యం వల్ల ఆ రనౌట్
ఇదిలా ఉంటే.. 40వ ఓవర్లో వికెట్ కీపర్ రాహుల్ కారణంగా సువర్ణావకాశం టీమిండియా చేజారేదే! 39.3వ ఓవర్.. షమీ బౌలింగ్‌లో కామెరాన్ గ్రీన్ బ్యాట్ తాకిన బంతిని ఆపే అవకాశాన్ని మిస్ చేశాడు రాహుల్. ఆ తర్వాత కూడా దానిని ఆపేందుకు పెద్దగా ప్రయత్నం చేయలేదు.
రనౌట్‌కు ఆస్కారం ఉన్న తరుణంలో కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లే అనిపించింది. థర్డ్ మ్యాన్ దిశగా బంతి దూసుకుపోతున్న తరుణంలో.. దీనిని అలుసుగా తీసుకున్న ఆసీస్ బ్యాటర్లు మరో రన్ కోసం పరుగు తీయడానికి సిద్ధమయ్యారు.
అయితే ఫీల్డర్ రుతురాజ్ విసిరిన బాల్‌ను.. సూర్య తన చేతుల్లోకి తీసుకుని.. చాకచక్యంగా వికెట్లకు గిరాటేయడంతో గ్రీన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ రెండు సందర్భాల్లో కేఎల్ రాహల్ వైఖరిని ఉద్దేశించి ఫ్యాన్స్ ఈ మేరకు ఫైర్ అవుతున్నారు. బద్ధుండాలి.. కెప్టెన్‌వే ఇలా చేస్తే ఎలా అని చురకలు అంటిస్తున్నారు.
చదవండి: అవును.. నాకు ధోనితో విభేదాలున్నాయి.. కానీ! గంభీర్‌కు స్ట్రాంగ్ కౌంటర్?
ICYMI
— BCCI (@BCCI) September 22, 2023
Direct-Hit Alert!
Confusion in the middle & @surya_14kumar gets the throw right to dismiss Cameron Green.#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/Alg6Avxyif
Comments
Please login to add a commentAdd a comment