Ind Vs Aus 1st Test: Cricket Fans Serious Reactions On Shubman Gill Exclusion From Team - Sakshi
Sakshi News home page

Shubman Gill: బాగా ఆడితే మీకిదే గతి పడుతుంది.. తదుపరి మ్యాచ్‌లో బెంచ్‌ మీదే!

Published Thu, Feb 9 2023 12:23 PM | Last Updated on Thu, Feb 9 2023 1:33 PM

Ind Vs Aus: Gill Exclusion If You Perform Will Sit Out Fans Angry Reactions - Sakshi

శుబ్‌మన్‌ గిల్‌

India Vs Australia 1st Test Nagpur: ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు సూపర్‌ ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ను పక్కన పెట్టడాన్ని టీమిండియా అభిమానులు తప్పుపడుతున్నారు. అద్భుతంగా ఆడుతున్న ఆటగాడికి మొండిచేయి చూపడం సరికాదంటూ మండిపడుతున్నారు. మేనేజ్‌మెంట్‌పై అసహనం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్‌ చేస్తున్నారు.

కాగా ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ నేపథ్యంలో నాగ్‌పూర్‌ టెస్టులో కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జోడీగా కేఎ‍ల్‌ రాహుల్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. దీంతో యువ ఆటగాడు గిల్‌ను పక్కనపెట్టకతప్పలేదు.

సూర్య అరంగేట్రం కోసమేనా?
నిజానికి శ్రేయస్‌ అయ్యర్‌ జట్టుకు దూరమైన కారణంగా రాహుల్‌ను ఐదోస్థానంలో ఆడించి.. గిల్‌తో ఓపెనింగ్‌ చేయిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, సూర్యకుమార్‌ అరంగేట్రం నేపథ్యంలో రాహుల్‌ టాపార్డర్‌లో కొనసాగనుండగా.. స్కై ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేయనున్నాడు.

కాగా ఫామ్‌లో ఉన్న గిల్‌ను కాదని రాహుల్‌ను ఓపెనర్‌గా తీసుకోవడం పట్ల ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. అదే విధంగా సూర్యకు టెస్టుల్లో అనుభవం లేదని.. అతడి కోసం రాహుల్‌ను ప్రమోట్‌ చేసి.. గిల్‌ను తప్పించడం సరికాదని మండిపడుతున్నారు. 

రాహుల్‌ను మాత్రం ఆడిస్తారా?
ఈ సందర్భంగా గిల్‌ అత్యుత్తమ ఇన్నింగ్స్‌ గురించి ప్రస్తావిస్తూ మేనేజ్‌మెంట్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. ‘‘గత పది ఇంటర్నేషనల్‌ ఇన్నింగ్స్‌లో గిల్‌ స్కోర్లు.. 126(నాటౌట్‌), 11,7, 112, 40(నాటౌట్‌), 208, 116, 21, 70... వన్డేలో సెంచరీ, డబుల్‌ సెంచరీ... టీ20లో అజేయ శతకం.. ఇన్ని చేసినా గిల్‌కు తుదిజట్టులో చోటు ఇవ్వలేరా? వరుసగా విఫలమవుతున్న రాహుల్‌ను మాత్రం ఆడిస్తారా?’’ అని కామెంట్లు చేస్తున్నారు.

బాగా ఆడితే బెంచ్‌ మీదే కూర్చోబెడతారు!
ఇక మరికొందరు.. ‘‘శుబ్‌మన్‌ ఇకపై రన్స్‌ స్కోరు చేయడం ఆపేయాలి.. అలాగే కుల్దీప్‌ యాదవ్‌ వికెట్లు తీయకూడదు. ఒకవేళ బాగా ఆడారంటే.. మిమ్మల్ని బెంచ్‌కే పరిమితమని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పష్టమైన సందేశం ఇచ్చారు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

గాయం నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే తిరిగి క్రికెట్‌ ఆడుతున్న జడేజాపై ఉన్న నమ్మకం కుల్దీప్‌ యాదవ్‌పై లేకపోవడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌ సందర్భంగా.. సూర్యతో పాటు ఆంధ్ర ప్లేయర్‌ శ్రీకర్‌ భరత్‌ కూడా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. 

చదవండి: Suryakumar Yadav: కల ఫలించింది.. టెస్టుల్లో అరంగేట్రం.. సూర్య, భరత్‌ ఉద్విగ్న క్షణాలు
IND vs AUS: షమీ సూపర్‌ డెలివరీ.. ఆఫ్‌ స్టంప్‌ ఎగిరిపోయిందిగా! పాపం వార్నర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement