భారత్-ఆస్ట్రేలియా జట్లు ఏ ఫార్మాట్‌లో తలపడినా అభిమానులు అసలు సిసలు క్రికెట్ మజా ఆస్వాదిస్తారు. అందులోనూ ఇరు జట్ల మధ్య టెస్టు క్రికెట్ అంటే ప్రత్యేకంగా చేప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బోర్డర్-గవాస్కర్ వంటి ట్రోఫీలో ఇరు జట్ల ఆటగాళ్ల స్లేడ్జింగ్‌లు, మైండ్‌గేమ్‌లు అభిమానులకు ఎంతో వినోదాన్ని పంచుతాయి. ఇక తాజాగా నాగ్‌పూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ మొదటి రోజు నుంచే ఆటగాళ్ల కవ్వింపు చర్యలు మొదలయ్యాయి.
తొలుత భారత పేసర్ మహ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ మధ్య చిన్నపాటి మాటలు యుద్దం జరగగా.. అనంతరం అశ్విన్, లబుషేన్ మధ్య కూడా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
ఏం జరిగిందంటే?
ఆసీస్ ఇన్నింగ్స్ 22వ ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కొవడానికి లబుషేన్ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఇదే ఓవర్‌లో అశ్విన్ వేసిన ఆఖరి బంతి అనూహ్యంగా టర్న్ అయ్యి బౌన్స్ అయ్యింది. అంతేకాకుండా బంతి లబుషేన్ సైడ్‌కు తాకింది. దీంతో లబుషేన్ వైపు సీరియస్‌గా చూసిన అశ్విన్.. బంతి టర్న్ అవ్వడమే కాదు బౌన్స్ కూడా అవుతోంది అన్నట్లు చేతితో సైగలు చేశాడు.
దానికి ప్రతిస్పందనగా లాబుషేన్ కూడా అవును టర్న్ అవుతోంది అని బదులిచ్చాడు. ఆ కొద్దిసేపటికే 49 పరుగులు చేసిన లబుషేన్ జడేజా బౌలింగ్‌లో స్టంఫౌట్‌గా వెనుదిరిగాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
177 పరుగులకే కుప్పకూలిన ఆసీస్
ఇక భారత స్పిన్నర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మార్నస్ లబుషేన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్టీవ్ స్మిత్ 37, అలెక్స్ కేరీ 36 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో జడేజా ఐదు వికెట్లతో కంగరూల పతనాన్ని శాసించగా.. అశ్విన్ మూడు వికెట్లతో రాణించాడు.
సిరాజ్, షమీ చెరొక వికెట్ తీశారు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మొదటి రోజు ఆటముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోయి 77 పరుగులు చేసింది.
IND vs AUS: జడేజా దెబ్బకు స్మిత్ మైండ్ బ్లాంక్.. వీడియో చూసి తీరాల్సిందే?
— Anna 24GhanteChaukanna (@Anna24GhanteCh2) February 9, 2023
Comments
Please login to add a commentAdd a comment