ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లాబుషేన్ టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 3000 పరుగుల మైలు రాయిని అందుకున్న రెండో బ్యాటర్‌గా లాబుషేన్ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో లాబుషేన్ వెస్టిండీస్ దిగ్గజం ఎవర్టన్ వీక్స్ సరసన నిలిచాడు.
లాబుషేన్ 51 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించగా.. ఎవర్టన్ వీక్స్ కూడా ఈ మైల్‌స్టోన్‌ను 51 ఇన్నింగ్స్‌లోనే నమోదు చేశాడు. వెస్టిండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా తొలి ఇన్నింగ్స్‌లో 163 పరుగులు చేసిన లాబుషేన్ ఈ అరుదైన ఘనత సాధించాడు. ఇక ఈ రికార్డు సాధించిన జాబితాలో తొలి స్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజం బ్రాడ్‌మన్ ఉన్నాడు. బ్రాడ్‌మాన్ కేవలం 33 ఇన్నింగ్స్‌లోనే 3 వేల పరుగుల రాయిని అందుకున్నాడు.
లాబుషేన్ సెంచరీల మోత
లాబుషేన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. విండీస్‌తో తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు సాధించిన లబుషేన్ తాజాగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ శతకం నమోదు చేశాడు. కాగా ప్రస్తుతం టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో లబుషేన్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. లబుషేన్ ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా తరఫున 30 టెస్టులు ఆడి 3010 రన్స్ చేశాడు. అందులో 10 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: ENG vs PAK: పాకిస్తాన్ క్రికెట్‌లో మరో యువ సంచలనం.. అరంగేట్ర మ్యాచ్‌లోనే 7 వికెట్లు..
Comments
Please login to add a commentAdd a comment