దక్షిణాఫ్రికాతో ఐదు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా ప్రోటీస్‌తో జరిగిన తొలి వన్డేలో 3 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ టెంబా బావుమా(114) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
అతడితో పాటు మార్కో జానెసన్(32) పరుగులతో రాణించాడు. ఆసీస్ బౌలర్లో హాజిల్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా..స్టోయినిస్ రెండు, అబాట్, అగర్, జంపా, గ్రీన్ తలా వికెట్ సాధించారు.
కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి..
223 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 74 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలో పడింది. ఈ సమయంలో క్రీజులోకి కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మార్నస్ లూబుషేన్(93 బంతుల్లో 80 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. తొలుత తుది జట్టులో లబుషేన్‌కు చోటు దక్కలేదు.
కానీ కామెరూన్ గ్రీన్ తలకు గాయం కావడంతో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆడే అవకాశం మార్నస్‌కు వచ్చింది. దీంతో తనకు వచ్చిన అవకాశాన్ని లబుషేన్ సద్వినియోగపరుచుకున్నాడు. అతడితో పాటు అస్టన్ అగర్(44) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 80 పరుగులతో అదరగొట్టిన లబుషేన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఇక ప్రోటీస్ బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ, రబాడ చెరో రెండు వికెట్లు సాధించగా.. ఎంగిడి, మహారాజ్, జానెసన్ తలా వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 9న ఇదే వేదికగా జరగనుంది.
చదవండి: WC: ప్రపంచకప్-2023 జట్టును ప్రకటించిన నెదర్లాండ్స్.. తేజకు చోటు.. కెప్టెన్ ఎవరంటే!
Comments
Please login to add a commentAdd a comment