IND Vs AUS: లడ్డూ లాంటి క్యాచ్‌ను వదిలేసిన కోహ్లి? బుమ్రా షాకింగ్‌ రియాక్షన్‌! వీడియో | IND Vs AUS 1st Test: Virat Kohli Drops Easiest Catch Ever, Embarrasses Himself In Perth Test, Video Goes Viral | Sakshi
Sakshi News home page

IND Vs AUS 1st Test: లడ్డూ లాంటి క్యాచ్‌ను వదిలేసిన కోహ్లి? బుమ్రా షాకింగ్‌ రియాక్షన్‌! వీడియో

Published Fri, Nov 22 2024 3:11 PM | Last Updated on Fri, Nov 22 2024 4:18 PM

 Virat Kohli Drops Easiest Catch Ever, Embarrasses Himself In Perth Test

టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి త‌న పేల‌వ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో విరాట్ తీవ్ర నిరాశపరిచాడు. ​కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లి కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.

ఈ మ్యాచ్‌లో కోహ్లి బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ఆసీస్ స్టార్ బ్యాటర్ ల‌బుషేన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను విరాట్ జార‌విడిచాడు. దీంతో ఆరంభంలోనే లబుషేన్‌కు కోహ్లి లైఫ్ ఇచ్చేశాడు.

అసలేం జ‌రిగిందంటే?
ఆసీస్ ఇన్నింగ్స్ 3వ ఓవ‌ర్ వేసిన జ‌స్ప్రీత్ బుమ్రా తొలి బంతికే మెక్‌స్వీనీ ఔట్ చేసి  బిగ్ షాకిచ్చాడు. దీంతో ఫ‌స్ట్ డౌన్‌లో ల‌బుషేన్‌ క్రీజులోకి వ‌చ్చాడు. రెండో బంతిని ల‌బుషేన్ డిఫెన్స్ ఆడాడు. ఆ త‌ర్వాత బంతికే ల‌బుషేన్ ఔట‌య్యే ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నాడు.

మూడో బంతిని మార్న‌స్‌కు ఫుల్ లెంగ్త్ డెలివ‌రీగా సంధించాడు. ఆ డెలివ‌రీని ల‌బుషేన్ డిఫెన్స్ ఆడ‌టానికి ప్ర‌య‌త్నించాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్‌లో విరాట్ కోహ్లి చేతిలో పడింది. కానీ విరాట్ మాత్రం అనూహ్య రీతిలో బంతిని జారవిడిచాడు.

అయితే కోహ్లి క్యాచ్ క్లీన్ క్యాచ్ అందుకున్నాడ‌ని స్లిప్‌లో ఉన్న రాహుల్‌తోపాటు ఇతర ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. కానీ కోహ్లి మాత్రం క్యాచ్‌గా క్లీన్‌గా అందుకోలేద‌ని సైగ చేశాడు. దీంతో అంద‌రూ నిరాశ‌చెందారు. కెప్టెన్ బుమ్రా సైతం కోహ్లి వైపు చూస్తూ షాకింగ్ రియాక్ష‌న్ ఇచ్చాడు. 

ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. కాగా తర్వాతి ఓవర్‌లో మాత్రం ఉస్మాన్ ఖావాజా ఇచ్చిన క్యాచ్‌ను అదే స్లిప్స్‌లో కోహ్లి అందుకున్నాడు. కాగా కోహ్లి జారవిడిచిన క్యాచ్ కాస్ట్‌లీగా మారలేదు. లబుషేన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
చదవండి: నితీశ్‌ రెడ్డి ‘ధనాధన్‌’ ఇన్నింగ్స్‌.. టీమిండియా 150 ఆలౌట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement