
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. పెర్త్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో లబుషేన్ తీవ్ర నిరాశపరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 5 పరుగులు మాత్రమే లబుషేన్ చేశాడు.
అంతేకాకుండా భారత బౌలర్లను ఎదుర్కొనేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తమ బౌన్సర్‌లతో లబుషేన్‌ను బెంబేలెత్తించారు. అయితే తొలి మ్యాచ్‌లో ఓటమి అనంతరం మార్నస్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు.
డిసెంబర్ 6న ఆడిలైడ్ వేదికగా జరగనున్న రెండో టెస్టుతో తిరిగి ఫామ్‌లోకి రావాలని అతడు భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో లబుషేన్‌కు తన మెంటార్ నీల్ డి'కోస్టా సపోర్ట్‌గా నిలిచాడు. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిలా తనను తను లబుషేన్ నమ్మాలి అని నీల్ సూచించాడు.
"లబుషేన్ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లేయర్లలో ఒకడు. అతడు కొంచెం కష్టపడితే తన ఫామ్‌ను తిరిగి పొందుతాడన్న నమ్మకం నాకు ఉంది. నెట్స్‌లో కొంచెం ఎక్కువ సమయం గడపాలి. ఒకనొక దశలో లబుషేన్ వరల్డ్ నెం1గా కొంతకాలం కొనసాగాడు. కానీ ఆతర్వాత అతడు తన రిథమ్‌ను కోల్పోయాడు.
ఇప్పటికి అతడు టెస్టుల్లో టాప్ 10 ర్యాంక్స్ లోనే ఉన్నాడు. అదేవిధంగా అతడి బ్యాటింగ్ సగటు కూడా దాదాపు ఏభైకి దగ్గరగా ఉంది. ఇటువంటి ప్లేయర్లకు ఒక్క భారీ ఇన్నింగ్స్‌లో తిరిగి తన రిథమ్‌ను పొందే సత్తాఉంటుంది. ఎంతటి టాప్ క్లాస్ క్రికెటర్లరైనా ఏదో ఒక సమయంలో కఠిన పరిస్థితులను ఎదుర్కొక తప్పదు.
విరాట్ కోహ్లి లాంటి ప్లేయర్ కూడా ఒకనొక సమయంలో గడ్డు పరిస్థితులును ఎదుర్కొన్నాడు. కానీ తనను తను నమ్ముతూ తిరిగి మళ్లీ అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. నీవు కూడా కోహ్లిలా నిన్ను నమ్ముకో, నీ ఆటపై దృష్టి పెట్టూ అంటూ" ఈఎస్పీఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీల్ డి'కోస్టా పేర్కొన్నాడు.
చదవండి: అతడొక విధ్వంసక బ్యాటర్.. అందుకే భారీ ధర: ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ డీకే
Comments
Please login to add a commentAdd a comment