ICC Test Rankings- Ravichandran Ashwin- Virat Kohli: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి నంబర్ 1 బౌలర్‌గా అవతరించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాకింగ్స్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. మరోవైపు.. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ర్యాంకింగ్స్‌లో ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకాడు.
తద్వారా 13వ ర్యాంకు సాధించాడు. ఇక స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ సైతం బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 44వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో సత్తా చాటి ఈ మేరకు టీమిండియా ఆటగాళ్లు ఆయా విభాగాల్లో ర్యాంకులు సాధించారు.
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అశ్విన్
సొంతగడ్డపై ఆసీస్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అశ్విన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొత్తంగా 25 వికెట్లు కూల్చి టీమిండియా ట్రోఫీ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.
మొత్తంగా 25 వికెట్లు తీయడంతో పాటు 86 పరుగులు సాధించిన అశూ.. మరో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(22 వికెట్లు, 135 పరుగులు)తో కలిసి సంయుక్తంగా ఈ అవార్డు పంచుకున్నాడు.
కాగా బీజీటీ-2023 నేపథ్యంలో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌ను వెనక్కి నెట్టి నంబర్1గా అవతరించిన అశ్విన్.. మధ్యలో పాయింట్లు కోల్పోయి అతడితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఆసీస్‌తో ఆఖరి టెస్టులో 7 వికెట్లు తీసి మళ్లీ నంబర్ 1 ర్యాంకు కైవసం చేసుకున్నాడు.
1205 రోజుల నిరీక్షణకు తెరదించి కోహ్లి
టీమిండియా స్టార్ బ్యాటర్, రన్‌మెషీన్ దాదాపు మూడున్నరేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టెస్టుల్లో సెంచరీ సాధించాడు. ఆసీస్‌తో ఆఖరిదైన అహ్మదాబాద్ మ్యాచ్‌లో అంతర్జాతీయ కెరీర్‌లో 75, టెస్టుల్లో 28వ శతకం సాధించాడు.
దీంతో బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి చేరుకున్నాడు. కోహ్లి కంటే ముందు వరుసలో ఉన్న రిషభ్ పంత్ 9, రోహిత్ శర్మ 10వ ర్యాంకుతో టాప్-10లో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానంలో ఉన్నాడు.
చదవండి: Ban Vs Eng 3rd T20: ఏంటి.. అసలు ఈ మనిషి కనిపించడమే లేదు! ఏమైందబ్బా? కౌంటర్ అదుర్స్
WTC Final: కేఎస్ భరత్ స్థానానికి ఎసరు పెట్టిన టీమిండియా దిగ్గజం! అతడే సరైనోడు! అవునా.. నిజమా?!
Comments
Please login to add a commentAdd a comment