ఢిల్లీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే. ఉస్మాన్ ఖవాజా 81 పరుగులు, పీటర్ హ్యాండ్స్‌కోబ్ 72 నాటౌట్ మాత్రమే రాణించారు. అయితే ప్రభావం చూపిస్తారనుకున్న స్టీవ్ స్మిత్ డకౌట్ కాగా.. మార్నస్ లబుషేన్ 18 పరుగులకు వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లు స్పిన్నర్ అశ్విన్ ఖాతాలోకి వెళ్లాయి. అది కూడా మూడు బంతుల వ్యవధిలోనే ఇద్దరిని పెవిలియన్ చేర్చి ఆసీస్‌కు కోలుకోలేని దెబ్బ తీశాడు. ఇక స్మిత్‌ను రెండుసార్లు డకౌట్ చేసిన తొలి బౌలర్‌గా అశ్విన్ రికార్డులకెక్కాడు.
ఈ విషయం పక్కనబెడితే.. స్మిత్, లబుషేన్‌లను ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. నెట్స్‌లో ఇద్దరు కలిసే ప్రాక్టీస్ చేశారని.. ఇప్పుడు కూడా ఇద్దరు కలిసే ఔటయ్యారంటూ వాళ్ల ప్రాక్టీస్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. అశ్విన్ ను సమర్థంగా ఎదుర్కోవడానికే ఆస్ట్రేలియా టీమ్ బెంగళూరులో ప్రత్యేకంగా స్పిన్ పిచ్ లు ఏర్పాటు చేయించుకొని మరీ ప్రాక్టీస్ చేసింది. అశ్విన్ లాగే బౌలింగ్ చేసే మహేష్ పితియాను రప్పించింది.
ముఖ్యంగా అతని బౌలింగ్ లో స్మిత్ ఎక్కువగా ప్రాక్టీస్ చేశాడు. అయినా అశ్విన్ ను ఎదుర్కోవడంలో అతడు ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. స్మిత్ తోపాటు లబుషేన్ లపైనే ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆధారపడి ఉంది. ఓపెనర్లు వార్నర్, ఖవాజాలు కూడా మంచి బ్యాటర్లే అయినా.. ఇండియాలోని స్పిన్ పిచ్ లపై వీళ్లే సమర్థంగా ఆడతారని అంచనా వేశారు. కానీ తొలి రెండు టెస్టుల్లో ఈ ఇద్దరూ నిరాశ పరిచారు. దీంతో వాళ్లను ఉద్దేశించి జాఫర్ ఇలా కౌంటర్ వేయడం విశేషం.
Marnus Labuschagne ✅
— BCCI (@BCCI) February 17, 2023
Steve Smith ✅@ashwinravi99 gets 2⃣ big wickets in one over 💪💥#TeamIndia #INDvAUS pic.twitter.com/UwSIxep8q2
చదవండి: కోహ్లి.. ఎందుకిలా?
Comments
Please login to add a commentAdd a comment