
మెల్‌బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు(బాక్సింగ్ డే టెస్టు)లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 318 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు మాత్రం పాక్ బౌలర్లు అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు. 187/3 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. అదనంగా 131 పరుగులు చేసి తమ తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది.
ఆస్ట్రేలియా బ్యాటర్లలో లబుషేన్(63) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఖావాజా(42), మిచెల్ మార్ష్(41) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో అమీర్ జమాల్ మూడు వికెట్లతో మరోసారి అద్భుత ప్రదర్శన కనబరచగా, షాహీన్ అఫ్రిది, మీర్ హంజా హసన్ అలీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా తొలి టెస్టులో పాక్‌ను ఆస్ట్రేలియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం.. ‘ఖేల్‌రత్న... అర్జున’ వెనక్కి