లండన్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరగుతున్న యాషెస్ ఆఖరి టెస్టు రసవత్తరంగా మారింది. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 61/1 తో రెండో రోజు శుక్రవారం ఆట కొనసాగించిన ఆసీస్ 151 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో స్మిత్ (71; 6 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే ఆసీస్‌కు లభించింది. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
లబుషేన్‌పై ట్రోల్స్..
ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ స్లో ఇన్నింగ్స్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. అతడిని నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో లబుషేన్ తన ఆటతీరుతో విసుగు తెప్పించాడు. 82 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసిన లబుషేన్.. ఆఖరికి వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
లుబషేన్ స్లో ఇన్నింగ్స్ కారణంగా ఆసీస్ రెండో రోజు తొలి సెషన్‌లో కేవలం 54 పరుగులు మాత్రమే చేయగల్గింది. దీంతో లుబషేన్‌ను ఉద్దేశించి మరో ఛతేశ్వర్ పుజారా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇంగ్లండ్ బజ్‌బాల్‌కు వ్యతిరేకంగా లబుషేన్ ఆడుతున్నాడని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు. కాగా అంతకముందు నాలుగో టెస్టులో లబుషేన్ సెంచరీ నమోదు చేశాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 162 పరుగులు చేశాడు.
చదవండి: MLC 2023: జూనియర్ 'ఏబీడీ' సూపర్ ఇన్నింగ్స్.. ఫైనల్‌కు చేరిన ముంబై ఇండియన్స్ టీమ్
Comments
Please login to add a commentAdd a comment