చారిత్రాత్మక ఓటమి నుంచి కోలుకుని తదుపరి టెస్టు సిరీస్‌పై టీమిండియా దృష్టి పెట్టింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో రాణించాలని పట్టుదలగా ఉంది. అయితే, ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్‌ను తప్పించండి
ఆస్ట్రేలియాతో సిరీస్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించాలని గావస్కర్ బీసీసీఐకి సూచించాడు. అతడి స్థానంలో ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను సారథిగా నియమిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ‘‘రోహిత్ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో ఉండడనే వార్తలు వినిపిస్తున్నాయి. బహుశా అతడు రెండో టెస్టు కూడా ఆడకపోవచ్చు.
అదే నిజమైతే మాత్రం.. టీమిండియా సెలక్షన్ కమిటీ కాస్త కఠినంగానే వ్యవహరించాలి. ఒకవేళ రోహిత్‌కు విశ్రాంతినివ్వాలని భావిస్తే అలాగే చేయండి. కానీ వ్యక్తిగత కారణాల దృష్ట్యా జట్టుకు దూరమై.. రెండు- మూడు టెస్టులకు అందుబాటులో లేకుండా పోతే మాత్రం.. ఈ టూర్‌లో అతడిని కేవలం ఆటగాడినే పరిగణించండి.
భారత క్రికెట్ కంటే ఎవరూ ఎక్కువ కాదు
వైస్ కెప్టెన్‌ను ఈ సిరీస్‌కు పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించండి. వ్యక్తుల కంటే కూడా భారత క్రికెట్ బాగోగులే మనకు ముఖ్యం. ఒకవేళ మనం న్యూజిలాండ్ సిరీస్‌ను 3-0తో గెలిచి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ.. మనం కివీస్ చేతిలో 3-0తో ఓడిపోయాం. కాబట్టి ఇకపై ప్రతి మ్యాచ్‌కు కెప్టెన్ అవసరం తప్పకుండా ఉంటుంది.
కెప్టెన్ ఉంటేనే జట్టు ఐకమత్యంగా ఉంటుంది. ఆరంభంలో ఒక సారథి.. ఆ తర్వాత మరో కెప్టెన్ వచ్చాడంటే మాత్రం పరిస్థితి మన ఆధీనంలో ఉండకపోవచ్చు’’ అని సునిల్ గావస్కర్ స్పోర్ట్స్ తక్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇక భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సైతం గావస్కర్ వ్యాఖ్యలను సమర్థించాడు.
టెస్టు సారథిగా ఒకే ఒకసారి
ఇదిలా ఉంటే.. బుమ్రా టెస్టుల్లో ఇప్పటి వరకు టీమిండియాకు ఒకేసారి సారథ్యం వహించాడు. ఇంగ్లండ్‌తో 2022లో జరిగిన బర్మింగ్‌హామ్ టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో బుమ్రా ఐదు వికెట్లతో రాణించినా భారత్‌కు ఓటమి తప్పలేదు.
నాడు ఇంగ్లండ్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో బుమ్రా సేన పరాజయం పాలైంది. ఇక.. స్వదేశంలో ఇటీవల న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0తో భారత జట్టు వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే. భారత క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై ఇలా జరగటం ఇదే తొలిసారి. కాగా ఆసీస్‌తో నవంబరు 22 నుంచి టీమిండియా టెస్టులు ఆరంభం కానున్నాయి.
ఆస్ట్రేలియా పర్యటనకు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టు
రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, యశస్వి జైశ్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్‌కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.
చదవండి: IPL Auction: టీమిండియా స్టార్ల కనీస ధర? అప్పటి నుంచి ఒక్క టీ20 ఆడకుండానే...
Comments
Please login to add a commentAdd a comment