
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలిరోజు ఆట ముగిసింది. తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిక్యం చూపించింది. తొలి సెషన్ నుంచి నిలకడగా ఆడిన ఆస్ట్రేలియా తొలి రోజే 300 మార్క్ దాటి భారీ స్కోరుపై కన్నేసింది. ట్రెవిస్ హెడ్(146 పరుగులు బ్యాటింగ్), స్టీవ్ స్మిత్(95 పరుగులు బ్యాటింగ్) టీమిండియా బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారారు.
ఈ ఇద్దరు ఇప్పటికే నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 251 పరుగులు జోడించారు. తొలి సెషన్‌లో రెండు వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు.. మలి రెండు సెషన్లు కలిపి కేవలం ఒకే ఒక్క వికెట్ పడగొట్టారు. ఇక రోజంతా కలిపి కేవలం మూడు వికెట్లు మాత్రమే తీసిన బౌలర్లు పూర్తిగా తేలిపోయారు.
ఆస్ట్రేలియాకు ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇచ్చిన మంచి ఆరంభాన్ని ట్రెవిస్ హెడ్, స్టీవ్ స్మిత్ కొనసాగించారు. భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా పరుగులు రాబట్టారు. ముఖ్యంగా ట్రెవిస్ హెడ్ వన్డే తరహా బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. రోజు ముగిసే సరికి 150 పరుగులు చేసిన ట్రెవిస్ హెడ్ ఇదే దూకుడు కొనసాగిస్తే రెండోరోజు ఆటలో డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అటు తన మార్క్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న స్మిత్ 95 పరుగులతో బ్యాటింగ్ చేస్తూ డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డులకెక్కే పనిలో ఉన్నాడు. రెండో రోజు ఆటలో స్మిత్ సెంచరీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
చదవండి: WTC Final: ట్రెవిస్ హెడ్ చరిత్ర.. సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment