![Travis Head Becomes 1st-Batter To Score Century-WTC Final - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/7/head.jpg.webp?itok=6v1068y_)
ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రెవిస్ హెడ్ చరిత్ర సృష్టించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ బాదిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. బుధవారం టీమిండియాతో ఆరంభమైన డబ్ల్యూటీసీ ఫైనల్లో హెడ్ (106 బంతుల్లో 100 బ్యాటింగ్) వన్డే తరహాలో ఆడి సెంచరీ మార్క్ అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.
ఇప్పటివరకు డబ్ల్యూటీసీ ఫైనల్లో డెవాన్ కాన్వే చేసిన 54 పరుగులే అత్యధిక స్కోరుగా ఉంది. ఇప్పుడు హెడ్ ఆ రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా ఏకంగా సెంచరీతో మెరిశాడు. ఇక ట్రెవిస్ హెడ్‌కు తన టెస్టు కెరీర్‌లో ఇది ఆరో సెంచరీ కాగా.. టీమిండియాపై, విదేశాల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.
History - Travis Head becomes first player to have scored Hundred in WTC Final. pic.twitter.com/PKsEQeFSsw
— CricketMAN2 (@ImTanujSingh) June 7, 2023
Comments
Please login to add a commentAdd a comment