జూన్ 7 నుంచి లండన్ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తెల్చుకోవడానికి భారత జట్టు సిద్దమైంది. ఇక ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన రోహిత్ సేన.. వరుస ప్రాక్టీస్ సెషన్స్‌లో బీజీబీజీగా గడుపుతోంది.
పటిష్ట ఆస్ట్రేలియాను ఎలాగైనా ఓడించి వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు కూడా తమ సన్నహాకాలను ప్రారంభించింది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఓ సారి తెలుసుకుందాం.
WTC Final poster by Hotstar. pic.twitter.com/yps91HHJsO
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 1, 2023
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?
డబ్ల్యూటీసీ ఫైనల్ లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి 11 వరకు జరగనుంది.
ఇండియాలో ఈ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఫైనల్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్షం అంతరాయం కలిగిస్తే?
డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగే ఐదో రోజుల్లో వర్షం పడి మ్యాచ్‌కు అంతరాయం కలిగితే ఆ రోజు ఆటను రిజర్వ్ డే రోజు కొనసాగిస్తారు. జూన్12ను రిజర్వ్ డేగా ఐసీసీ నిర్ణయించింది.
డ్రాగా ముగిస్తే విజేత ఎవరంటే?
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిస్తే భారత్-ఆస్ట్రేలియా జట్లను సంయుక్త విజేతలుగా ఐసీసీ ప్రకటిస్తుంది. ఇరు జట్లకు ట్రోఫీని అందజేస్తారు.
ప్రైజ్‌మనీ ఎంతంటే?
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో విజేతగా నిలిచిన జట్టుకు 13.22 కోట్లు ప్రైజ్‌మనీని అందజేస్తున్నారు. రన్నరప్‌కు 6.61 కోట్లు దక్కనుంది.
Indian bowling unit is ready for WTC final. pic.twitter.com/g1hsfEIL9E
— Johns. (@CricCrazyJohns) June 2, 2023
చదవండి: Womens Asia Cup 2023: ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. పాకిస్తాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
Comments
Please login to add a commentAdd a comment