
లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ బుధవారం(జూన్7) నుంచి ప్రారంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఇంగ్లండ్‌లో ప్రస్తుతం ఇంధన సంస్ధలకు వ్యతిరేకంగా నిరసనలు జరగుతున్నాయి. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగే ఓవల్ పిచ్ ను ధ్వంసం చేస్తామని కూడా ఆందోళనకారులు హెచ్చరించారు.
దీంతో ఐసీసీ ముందస్తు జాగ్రత్తగా ఓవల్‌లో రెండు మ్యాచ్‌లు తయారు చేసింది. ఈ ప్రత్నమాయ పిచ్‌లను తయారు చేయించడానికి ఐసీసీ తమ ప్లేయింగ్ కండిషన్స్ లోని సెక్షన్ 6.4ను 6.4ని కూడా సవరించింది. ఒకవేళ మ్యాచ్ జరిగే పిచ్ దెబ్బతింటే అప్పుడు ఆ పరిస్థితిని అంచనా వేసి ఆ తర్వాత మరో పిచ్‌ను వాడాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోనున్నారు.
అదే విధంగా టీమిండియా, ఆస్ట్రేలియా కెప్టెన్లు పాట్ కమిన్స్, రోహిత్ శర్మల అనుమతి కూడా తీసుకుంటారు. ఒకవేళ ఇద్దరు కెప్టెన్లు రెండో పిచ్‌పై ఆడేందుకు అంగీకరిస్తే అప్పుడు మ్యాచ్ కొనసాగుతుంది, లేదంటే రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక నిరసనకారులు నుంచి ఈ మ్యాచ్‌కు ముప్పు పొంచి ఉండడంతో స్టేడియం వద్ద భారీ భద్రతను ఐసీసీ ఏర్పాటు చేసింది.
చదవండి: WTC Final 2023: హాజల్‌వుడ్ స్థానంలో బోలండ్.. ఆసీస్ తుది జట్టు ఇదే!