
బర్మింగ్‌హామ్: సుదీర్ఘ పర్యటనలో భాగంగా భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. అయితే తొలి టెస్టు మ్యాచ్‌లో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు భారత జట్టును కలిసేందుకు అనుమతి కావాలని వ్యాపారవేత్త విజయ్ మాల్యా కోరాడట. దానికి ససేమిరా వీలు కాదంటూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
భారత్‌లో పలు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి.. పలు కేసులు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లితో పాటు భారత జట్టును కలిసేందుకు అవకాశం ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని మాల్యా కోరాడట. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెటర్లను కలిసేందుకు వీల్లేదని, వారిని కలిసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దని తెలుపుతూ ప్రభుత్వం మాల్యాకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మాల్యా నిరుత్సాహానికి గురయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment