మీ బ్యాంకులను అడగండయ్యా..! | Vijay Mallya Fires On Indian NetiZens Being Trolled Over Chris Gayle Pic | Sakshi
Sakshi News home page

మీ బ్యాంకులను అడగండయ్యా..!

Published Sun, Jul 14 2019 11:14 AM | Last Updated on Sun, Jul 14 2019 4:46 PM

Vijay Mallya Fires On Indian NetiZens Being Trolled Over Chris Gayle Pic - Sakshi

బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. భారత నెటిజన్లపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్‌ క్రికెటర్‌, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌గేల్‌.. విజయ్‌మాల్యాతో కలిసిన ఓ ఫొటోను ట్విటర్‌లో పంచుకోగా నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. ‘బిగ్‌బాస్‌ను కలుసుకోవడం బాగుంది’అని గేల్‌ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అయింది. అయితే భారతీయ బ్యాంకులకు మాల్యా ఎగొట్టిన రూ.9వేల కోట్లను ప్రస్తావిస్తూ నెటిజన్లు ఈ ఫొటోపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మాల్యా గొప్ప దేశభక్తుడు.. అతను కేవలం భారతీయులనే దోచుకుంటాడు.’ అని ఒకరు.. ‘ తనకు ఇష్టమైన బీటీడబ్ల్యూ లాకెట్‌ కోసం.. ఆఖరికి క్రిస్‌గేల్‌ కూడా మాల్యా కోసం ఎదురుచూస్తున్నాడు.’ అంటూ మరొకరు కామెంట్‌ చేశారు. అయితే ఈ కామెంట్స్‌పై స్పందించిన మాల్యా ట్విటర్‌ వేదికగా తన ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

‘ప్రియమిత్రుడైన యూనివర్సల్‌ బాస్‌ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నన్ను ‘చోర్‌’ అని పిలుస్తున్నందరూ.. గతేడాది నుంచి డబ్బులు మొత్తం చెల్లిస్తానని చెబుతున్నా.. తీసుకోని మీ బ్యాంకులను అడగండి. అప్పుడు దొంగెవడో తేల్చండి.’ అంటూ ఘాటుగా ట్వీట్‌ చేశాడు. ‘యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌గేల్‌తో ఉన్న నా ఫొటోను చూసి కామెంట్‌ చేశారో.. వారు దయచేసి వాస్తవాలను తెలుసుకోండి. మాల్యా ఇస్తానన్న 100శాతం డబ్బులను ఎందుకు తీసుకోవడం లేదో మీ బ్యాంకులను ప్రశ్నించండి’ అని మరో ట్వీట్‌లో మండిపడ్డాడు. ఇక ప్రపంచకప్‌ సందర్భంగా భారత మ్యాచ్‌కు హాజరైన మాల్యాను చూసి భారత అభిమానులు చోర్‌చోర్‌ అని పెద్ద ఎత్తున్న అరిచిన విషయం తెలిసిందే. బ్రిటీష్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌-2019 సందర్భంగా గేల్‌, విజయ్‌మాల్యాలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా తీయించుకున్న ఫొటోనే గేల్‌ ట్వీట్‌ చేశాడు. ఇక ఐపీఎల్‌ జట్టైన రాయల్‌చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు మాల్యా మాజీ యజమాననే సంగతి తెలిసిందే.

చదవండి: మాల్యాకు ఊహించని పరిణామం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement