రాష్ట్రంలో చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తూ.. కేంద్ర దర్యాప్తు సంస్థలేవి రాష్ట్రానికి రాకుండా అడ్డుకుంటున్నారని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీబీఐ, ఈడీని అడ్డుకున్న చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఎన్‌ఐఏని కూడా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.