సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీఎల్‌ఎఫ్ అభ్యర్థి ట్రాన్స్‌జండర్ చంద్రముఖి అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. బుధవారం రాత్రి 11:30 గంటల సమయంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో పోలీస్‌స్టేషన్‌లో ఆమె ప్రత్యక్షమైంది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 2 రోజుల క్రితం చంద్రముఖి కనిపించకుండా పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ట్రాన్స్‌జండర్లు ఓ వైపు ఆందోళనకు దిగగా, మరోవైపు ఆమె తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. గురువారంలోగా చంద్రముఖిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించడంతో బంజారాహిల్స్ పోలీసులు హుటాహుటిన లుక్‌అవుట్ నోటీస్ జారీ చేశారు. ఇది జరిగిన 12 గంటల వ్యవధిలోనే చంద్రముఖి పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షమైంది. ఆమె నోరు విప్పితేగానీ అసలు ఏం జరిగిందన్న విషయం తెలియదు.
Comments
Please login to add a commentAdd a comment