చంఢీగర్: పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్‌పై పంజాబ్ విజిలెన్స్ బ్యూరో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. బటిండా ఆస్తుల కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించింది. మన్‌ప్రీత్ దేశం వీడి వెళ్లొచ్చని భావించారు అధికారులు. దీంతో అన్ని ఎయిర్‌పోర్టుల వద్ద అలర్ట్ జారీ చేశారు. ముందస్తు బెయిల్ కోసం బాదల్ దాఖలు చేసిన పిటిషన్ కూడా ఈరోజు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
బాదల్‌తో పాటు, భటిండా డెవలప్‌మెంట్ అథారిటీ (బిడిఎ) మాజీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ బిక్రమ్‌జిత్ షెర్గిల్ కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. రాజీవ్ కుమార్, అమన్‌దీప్ సింగ్, వికాస్ అరోరా, పంకజ్‌లు కూడా ఈ కేసులో భాగం పంచుకున్నట్లు తెలుస్తోంది.
భటిండాలోని ఆస్తి కొనుగోలులో అవకతవకలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే సరూప్ చంద్ సింగ్లా 2021లో చేసిన ఫిర్యాదు ఆధారంగా విజిలెన్స్ బ్యూరో విచారణ ప్రారంభించింది. గతంలో శిరోమణి అకాలీదళ్‌లో ఉన్న సింగ్లా.. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.
కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్న బాదల్ తన పదవిని దుర్వినియోగం చేసి రెండు కమర్షియల్ ప్లాట్‌లను రెసిడెన్షియల్ ప్లాట్‌గా మార్చుకున్నారనేది ప్రధాన ఆరోపణ. అయితే.. ప్రస్తుతం ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు.
ఇదీ చదవండి: Rahul Gandhi Train Journey Video: రాహుల్ గాంధీ జన్‌కీ బాత్.. ఈసారి రైలులో..
Comments
Please login to add a commentAdd a comment