Badal
-
బాదల్‌పై కాల్పులు..కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ మీద కాల్పులు జరిగిన ఘటనపై కేంద్ర సహాయ మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాల్పులు జరిపిన నరేన్ సింగ్ చౌరా సిక్కు జాతి రత్నం అని కొనియాడారు. నరేన్‌కు న్యాయ సహాయం అందించాలని శిరోమణి గుర్ద్వారా ప్రబంధక్ కమిటీకి విజ్ఞప్తి చేశారు.నరేన్ కాల్పులు జరపడం వెనుక తన వ్యక్తిగత కారణాలేవీ లేవని, సిక్కుల మనోభావాలు దెబ్బతినడంపై ప్రతీకారం తీర్చుకున్నారన్నాడన్నారు. గతంలో అధికారంలో ఉన్నపుడు బాదల్ ప్రభుత్వం సిక్కులు పవిత్రంగా భావించే శ్రీ గురు గ్రాంత్ సాహిబ్‌ను అపవిత్రం చేయడమే కాకుండా స్వర్ణ దేవాలయం నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. బాదల్ చేసిన తప్పుల ఫలితంగానే కాల్పులు జరిగాయని తెలిపారు. నరేన్ టార్గెట్ స్వర్ణ దేవాలయం, అకల్ తక్త్ సాహిబ్ కాదని కేవలం సుఖ్బీర్ సింగ్ బాదలేనని చెప్పారు. అయితే హింసకు పాల్పడడాన్ని మాత్రం ఖండిస్తున్నట్లు బిట్టు తెలపడం గమనార్హం. ఇదీ చదవండి: స్వర్ణ దేవాలయంలో కాల్పులు -
బీజేపీ నేతపై లుక్అవుట్ నోటీసులు
చంఢీగర్: పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్‌పై పంజాబ్ విజిలెన్స్ బ్యూరో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. బటిండా ఆస్తుల కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించింది. మన్‌ప్రీత్ దేశం వీడి వెళ్లొచ్చని భావించారు అధికారులు. దీంతో అన్ని ఎయిర్‌పోర్టుల వద్ద అలర్ట్ జారీ చేశారు. ముందస్తు బెయిల్ కోసం బాదల్ దాఖలు చేసిన పిటిషన్ కూడా ఈరోజు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. బాదల్‌తో పాటు, భటిండా డెవలప్మెంట్ అథారిటీ (బిడిఎ) మాజీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ బిక్రమ్‌జిత్ షెర్గిల్ కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. రాజీవ్ కుమార్, అమన్‌దీప్ సింగ్, వికాస్ అరోరా, పంకజ్‌లు కూడా ఈ కేసులో భాగం పంచుకున్నట్లు తెలుస్తోంది. భటిండాలోని ఆస్తి కొనుగోలులో అవకతవకలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే సరూప్ చంద్ సింగ్లా 2021లో చేసిన ఫిర్యాదు ఆధారంగా విజిలెన్స్ బ్యూరో విచారణ ప్రారంభించింది. గతంలో శిరోమణి అకాలీదళ్‌లో ఉన్న సింగ్లా.. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్న బాదల్ తన పదవిని దుర్వినియోగం చేసి రెండు కమర్షియల్ ప్లాట్లను రెసిడెన్షియల్ ప్లాట్‌గా మార్చుకున్నారనేది ప్రధాన ఆరోపణ. అయితే.. ప్రస్తుతం ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. ఇదీ చదవండి: Rahul Gandhi Train Journey Video: రాహుల్ గాంధీ జన్‌కీ బాత్.. ఈసారి రైలులో.. -
రాజీవ్‌పై బాదల్ సంచలన ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ : సిక్కు వ్యతిరేక అల్లర్లను అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ స్వయంగా పర్యవేక్షించారని పంజాబ్ మాజీ సీఎం, అకాలీదళ్ నేత సుక్బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను పరిశీలించేందుకు రాజీవ్ తనతో ఢిల్లీ అంతటా కలియతిరిగారని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా బాదల్ ప్రస్తావించారు. జగదీష్ టైట్లర్ వ్యాఖ్యల ప్రకారం రాజీవ్‌గాంధీ సిక్కుల హత్యాకాండను దగ్గరుండి పర్యవేక్షించారని స్పష్టమవుతోందని బాదల్ ఆరోపించారు. టైట్లర్ వెల్లడించిన విషయాలను సీబీఐ సీరియస్‌గా పరిశీలించాలని కోరారు. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లపై సుప్రీం కోర్టు ఇటీవల నూతన సిట్‌ను ఏర్పాటు చేసి కేసుల పునర్విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. 1984 అక్టోబర్ 31న ఇంధిరాగాంధీని ఆమె బాడీగార్డులు కాల్చిచంపిన అనంతరం ఢిల్లీ, యూపీ, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో చెలరేగిన అల్లర్లలో 3325 మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలోనే 2,733 మంది మరణించారు. -
బాదల్ సొగసైన నిరసన
-
పంజాబ్‌లో బాదల్, ‘కెప్టెన్’ ఆఖరి పోరాటం
రెండు వారాల్లో దాదాపు రెండు కోట్ల ఓటర్లు పంజాబ్ పాలకపక్షం ఏదో నిర్ణయించబోతుండగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేగం పుంజుకుంటోంది. అమృత్సర్ లోక్‌సభ సీటుకు ఉప ఎన్నికతోపాటు 117 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల నాలుగున పోలింగ్ జరుగుతుంది. పదేళ్లుగా ప్రతిపక్ష స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ చావోరేవో అనే రీతిలో శిరోమణి అకాలీదళ్–బీజేపీ కూటమిని ఓడించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. పంజాబ్ గెలుపుతో కాంగ్రెస్ వరుస పరాజయాలకు ముగింపు పలకవచ్చని అధిష్టానం ఆశిస్తోంది. పదిహేనో పంజాబ్ శాసనసభ ఎన్నికల ప్రత్యేకత ఏమంటే, ప్రస్తుత సీఎం, అకాలీ అధ్యక్షుడు ప్రకాశ్‌సింగ్ బాదల్‌తో మాజీ సీఎం, పీసీసీ నేత ‘కెప్టెన్’ అమరీందర్‌సింగ్ ముక్తసర్ జిల్లా లంబీ సీటులో ముఖాముఖి తలపడడం. 2013 డిసెంబర్ దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం షీలా దీక్షిత్‌పై ఆమ్ఆద్మీపార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పోటీచేసిన సందర్భాన్ని లంబీ పోటీ గుర్తుచేస్తోంది. పదేళ్లు బీజేపీ అమృత్సర్ ఎంపీగా పనిచేశాక మూడోసారి టికెట్ దక్కకపోయినా రాజ్యసభకు నామినేట్ అయిన ప్రఖ్యాత క్రికెటర్ నవజోత్‌సింగ్ సిద్ధూ ఈసారి కాంగ్రెస్‌లో చేరి అమృత్సర్ ఈస్ట్ నుంచి అసెంబ్లీకి పోటీచేయడం మరో విశేషం. ఆయనపై పాలక కూటమి తరఫున రాజేష్‌కుమార్ హనీ(బీజేపీ)పోటీచేస్తున్నారు. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న మరో వీవీఐపీ స్థానం జలాలాబాద్‌లో డెప్యూటీ సీఎం, బాదల్ కుమారుడు సుఖ్బీర్సింగ్ బాదల్‌తో సంగ్రూర్ ఆమ్ఆద్మీపార్టీ ఎంపీ భగవంత్ మాన్ తలపడుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ సీఎం బియాంత్‌సింగ్ మనవడు, లూథియాణా ఎంపీ రవనీత్‌సింగ్ బిట్టూ రంగంలోకి దిగారు. ‘కెప్టెన్’ చివరి ప్రయత్నం 2007 నుంచీ సీఎం పదవిలో ఉన్న బాదల్ తనకు ఇదే చివరి ఎన్నికలని లంబీలో ప్రచారం చేస్తున్నారు. డిసెంబర్లో 89 ఏళ్లు నిండిన బాదల్ వారసునిగా సుఖ్బీర్ వ్యవహరిస్తున్నారు. జ్ఞానీ జైల్‌సింగ్(1972–75) తర్వాత కాంగ్రెస్ తరఫున ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించిన అమరీందర్ కూడా యువకుడేమీ కాదు. ఎన్నికల ఫలితాలు ప్రకటించే మార్చి11న ఆయనకు 75 ఏళ్లు నిండుతాయి. పటియాలా ‘రాజ’ కుటుంబంలో గత 150 ఏళ్లలో 70 ఏళ్లు బతికిన వారసులు ఇంతవరకూ లేరు. ఈ లెక్కన ఆ రోజు ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తే ఈ పటియాలా మాజీ యువరాజు పుట్టిన రోజును విజయోత్సవంగా జరపాలని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో అమరీందర్‌ను కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించవచ్చని తెలుస్తోంది. లంబీలో నామినేషన్ వేసినా సొంతూరు పటియాలా(అర్బన్)నుంచి కూడా ఆయన పోటీచేస్తున్నారు. లంబీలో గెలుపుపై నమ్మకం లేకనే ‘కెప్టెన్’ సురక్షిత స్థానం పటియాలా నుంచి కూడా రంగంలోకి దిగారని అకాలీ–బీజేపీ కూటమి, ఆప్‌లు ఎత్తిపొడుస్తున్నాయి. ఇక్కడ పాలక కూటమి అభ్యర్థిగా ఆర్మీ మాజీ చీఫ్ జేజే సింగ్ బీజేపీ తరఫున తలపడుతున్నా, ఆయనకు జనాదరణ కనిపించడం లేదు. ఆర్మీ నేపథ్యం ఉన్న ఇద్దరూ వ్యక్తిగత నిందారోపణలకు దిగుతున్నారు. జేజేను జనరల్‌గా పిలవనని అమరీందర్ చెబుతుండగా, ఈ మాజీ కెప్టెన్ రెండు చోట్లా ఓడిపోతారని జేజే సింగ్ జోస్యం చెబుతున్నారు. లంబీలో తాను పోటీచేయడం ద్వారా 68 సీట్లున్న మాల్వా ప్రాంతంలో కాంగ్రెస్ విజయావకాశాలు మెరుగవుతాయని కూడా ‘కెప్టెన్’ ఆశపడుతున్నారు. బాదల్ కుటుంబంపైనే అందరి గురి పదేళ్లలో బాదల్ కుటుంబం మద్యం, మాదకద్రవ్యాల వ్యాపారులతో కుమ్మక్కయి పంజాబ్‌ను నాశనం చేసిందని కాంగ్రెస్‌తోపాటు, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. హోటళ్లు సహా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయించిన బాదల్ కుటుంబం ఆయా వ్యాపారాల్లో దాదాపు లక్ష కోట్లు సంపాదించిందని శుక్రవారం నవజోత్ సిద్ధూ ఆరోపించారు. వ్యవసాయరంగంలో సంక్షోభం కారణంగా నెలకు 35 మంది రైతులు భాక్రా కెనాల్లోకి దూకి ప్రాణాలు తీసుకుంటున్నారనే అంశం కూడా అకాలీ కూటమి సర్కారును ఇరుకునపెడుతోంది. విజయావకాశాలపై తలో మాట! పాలకపక్షాన్ని ప్రతి ఎన్నికల్లో మార్చే సంప్రదాయాన్ని 2012లో జనం మరిచారు. ఈసారైనా గెలుస్తామన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్‌కు పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఉపకరిస్తుందని పార్టీ నేతలు భావించారు. ఆరు నెలల క్రితమైతే కాంగ్రెస్, అకాలీ కూటమి కన్నా ఆప్ ముందుందని సర్వేలు చెప్పాయి. తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆప్ ఆకర్షణ తగ్గిందని కొన్ని పరిణామాలు సూచించాయి. అయినా, కెనడాలో స్థిరపడిన పంజాబీలు దాదాపు 200 మంది ఇక్కడికొచ్చి ఆప్ తరఫున ప్రచారం చేయడం విశేషం. ఆప్‌ను దెబ్బదీసే లక్ష్యంతో కాంగ్రెస్, అకాలీ కూటమి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆప్‌కు మెజారిటీ వస్తే పంజాబ్ సీఎం కావాలని కేజీవాల్ ఆశిస్తున్నారని అమరీందర్ ప్రచారం చేస్తున్నారు. జనవరి 5న సీఎస్డీఎస్–ఏబీపీ విడుదల చేసిన సర్వేలో అకాలీ కూటమికి మెజారిటీ రాకున్నా ఇతర పక్షాల కన్నా ముందున్నట్టు సూచించగా, ఈ కూటమి, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని ఇండియా టుడే–యాక్సిస్ సర్వే జోస్యం చెప్పింది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
పంజాబ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత
-
పంజాబ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత
పంజాబ్: పంజాబ్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సిక్కుల పవిత్ర గ్రంథమైన 'గురుగ్రంథ్ సాహెబ్'ను అవమానించారంటూ కొనసాగుతున్న అల్లర్లు పంజాబ్‌లో ఉద్రిక్తతకు దారితీశాయి. పంజాబ్‌లోని పలు పట్టణాల్లో ఆందోళనకారులు తమ నిరసనలు తెలుపున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు సమస్యాత్మక నగరాల్లో పారామిలటరీ బలగాలను మోహరించారు. ప్రజలు సంయమనం పాటించాలని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ పిలుపునిచ్చారు. కాగా ఈ అల్లర్ల వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందేమోనన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్టిస్టులు కాదు.. నేటితరం దేశ భక్తులు..!
సాక్షి, స్కూల్ ఎడిషన్: ‘భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను’ అంటూ చిన్నతనంలో ప్రతిఒక్కరూ ప్రతిజ్ఞ చేసే ఉంటారు. దేశమంటే ఏంటి..? మనం నివసించే ఊరు, మన చుట్టూ ఉండే ప్రజలు, మన పరిసరాలు.. ఇవి కావా దేశమంటే..? వీటిని పరిరక్షించడమంటే మన దేశాన్ని ప్రేమించినట్టేగా..? దేశాన్ని ప్రేమించడమంటే చిన్ననాటి ప్రతిజ్ఞకు కట్టుబడినట్టేగా?! ఈ లెక్కన చూస్తే బెంగళూరులోనే దేశభక్తులు మెండుగా ఉన్నట్టు! ఆర్టిస్ట్ బాదల్ నంజుందస్వామి, ‘నమ్మా బెంగళూరు’ సీఈవో శ్రీధర్ పబ్బిషెట్టి, ఆ సంస్థ ఆర్టిస్ట్ పుష్పరాజ్ లాంటి వారే నేటితరం దేశభక్తులు. 2015, ఆగస్టు 9.. బెంగళూరులోని యశ్వంత్‌పూర్ మార్కెట్ ప్రాంతం. ఆదివారం కావడంతో బెంగళూరు వాసులు కాస్త ఆలస్యంగా నిద్రలేచారు. అలవాటుగా మార్కెట్‌వైపు అడుగులేశారు. రోడ్డు నిండా ఉన్న బురద గుంటలను దాటుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలా ఒక బురదగుంట దగ్గరకు వెళ్లేసరికి ఓ భయంకర దృశ్యం వారి కంట పడింది. నడిరోడ్డు మీదే ఉన్న ఓ మురుగునీటి గుంటలోంచి భారీ అనకొండ నోరు తెరచుకుని నేలపైకి జొచ్చుకొచ్చింది. దాని నోట్లో సగం తినేసిన మానవ హస్తం ఉంది. అదే వారి గుండె గాబరాకు కారణం. రక్తసిక్తంగా ఉన్న ఆ ప్రాంతాన్ని చూడలేక కొందరు పరుగులెట్టారు. మరికొందరు దగ్గరకు వెళ్లే సాహసం చేశారు. అప్పుడే తెలిసింది వారికి.. అది నిజమైన అనకొండ కాదు, బొమ్మ అని! ఒక్కక్షణం ‘హమ్మయ్య’ అని అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇంతలో అక్కడికి ‘నమ్మా బెంగళూరు’ ఫౌండేషన్ సభ్యులు వచ్చారు. ఆ బొమ్మ అనకొండను ఏర్పాటు చేసింది తామేనని, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపేందుకే ఇలా చేశామని వివరణ ఇచ్చుకున్నారు. భయపడ్డ ప్రజలకు సారీ కూడా చెప్పారు. అయితే, అప్పుడే ప్రజల్లో ఓమూల ఆందోళన మొదలైంది. ‘నిజంగానే ఈ గుంటల్లోంచి భయంకర జీవులు నేలమీదికి వస్తే పరిస్థితి ఏంటీ..?’ అనుకున్నారు. ఫేస్బుక్, ట్వీటర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ‘బృహత్ బెంగళూరు మహానగర పాలికే’ (బీబీఎంపీ) నిర్లక్ష్యాన్ని కడిగిపారేశారు. బొమ్మలతో చెంపపెట్టు.. నిజానికి బెంగళూరు మాత్రమే కాదు, దేశంలోని మహానగర రోడ్లన్నీ దాదాపు ఇలా నిర్లక్ష్యపు కోరల్లోనే చిక్కుకున్నాయి. మితిమీరిన ట్రాఫిక్ ఉండే బెంగళూరులో ఈ నిర్లక్ష్యం పాళ్లు కాస్తంత ఎక్కువ. అయితే, దీన్ని ఉపేక్షించకూడదనుకున్నారు బెంగళూరు వాసులు. ముఖ్యంగా బాదల్ నంజుంద స్వామి లాంటి వారికైతే ‘బీబీఎంపీ’ అధికారులకు చెంపపెట్టులా ఏదైనా చేయాలనిపించింది. స్వతహాగా ఆర్టిస్ట్ అయిన ఆయన తొలి ప్రయత్నంగా తన జేబులోని ఆరువేల రూపాయలు తీసి ఓ ఫైబర్ మొసలి బొమ్మను రూపొందించాడు. అచ్చమైన మొసలిని పోలినట్టు ఉండే ఈ నిర్మాణాన్ని బెంగళూరు రహదారుల్లోని నీటిగుంటపై అమర్చాడు. దీన్ని చూసిన వాహనదారులు కొద్దిసేపటివరకూ హడలిపోయారు. అంతే.. ఈ విషయం బీబీఎంపీ దృష్టికి వెళ్లింది. వెంటనే రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టారు. బాదల్ సేవ.. రోడ్డుపై ప్రమాదకరంగా ఉండే గుంటలు, మ్యాన్‌హోల్స్ నుంచి ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యంగా 36 ఏళ్ల బాదల్ నంజుంద స్వామి బొమ్మలు గీస్తూ ఉంటారు. ఇవి విశేష ఆదరణ పొందుతున్నాయి. కేవలం అప్రమత్తం చేయడానికే గాక, మున్సిపాలిటీ అధికారుల కళ్లు తెరపించేందుకూ ఉపయోగపడుతున్నాయి. నమ్మా బెంగళూరు.. బాదల్ రూపొందించిన ఫైబర్ మొసలి స్ఫూర్తితో నమ్మా బెంగళూరు (మన బెంగళూరు) స్వచ్ఛంద సంస్థ సైతం ఇటువంటి నిర్మాణాలు చేయడం ప్రారంభించింది. మీడియాలో విశేష ప్రచారం పొందిన అనకొండ కోసమైతే ఆ సంస్థ ఆర్టిస్టు పుష్పరాజ్ రెండు రోజులు కష్టపడ్డారు. దీని గురించి ప్రశ్నించినపుడు సంస్థ సీఈవో శ్రీధర్ పబ్బిషెట్టి ఒకింత అసహనంగా స్పందించారు. అనకొండ తయారీ కోసం తాము పెద్దగా కష్టపడలేదని, దాన్ని యశ్వంత్‌పూర్‌లో అమర్చేందుకు మాత్రం చాలా కష్టపడాల్సివచ్చిందని అన్నారు. కొందరు వీధి గూండాలు తమను బెదిరించారని, తమ కార్యకర్తలను కొట్టారని అన్నారు. చివరకు జర్నలిస్టులు రంగప్రవేశం చెయ్యడంతో గూండాలు పారిపోయారని, మంచిపని చేయడానికి కూడా మన దేశంలో అవాంతరాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన వాపోయారు. సామాజిక స్పృహ.. ఆర్టిస్టు బాదల్ తరహాలోనే ప్రస్తుతం ఆర్ట్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేస్తోన్న పుష్పరాజ్ కూడా ఫైబర్ నిర్మాణాలతో ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాడు. ఇతడు తయారుచేసిన అనకొండతో పాటు, మ్యాన్‌హోల్‌లో ఇరుక్కుని సహాయం కోసం అర్థిస్తున్న ఓ మానవుడి ఆకారం కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక, బాదల్ గురించైతే బెంగళూరు మొత్తానికీ తెలుసు. ఇప్పుడు అతనో సెలబ్రిటీ. తన కళాఖండాలతో బీబీఎంపీ అధికారుల్లో కదలిక తెచ్చి, మరమ్మత్తులు చేయిస్తున్న ఘనుడు. యువత వీరిని ఆదర్శంగా తీసుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి నేటితరం దేశ భక్తులు వీరే అనడంలో అతిశయోక్తి అసలే లేదు. -
16 స్థానాల్లో సాద్ (బాదల్) పోటీ
న్యూఢిల్లీ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 16 స్థానాలనుంచి పోటీ చేయాలని నిర్ణయించినట్లు శిరోమణి అకాలీదళ్ ఢిల్లీ శాఖ ప్రకటించింది. అయితే తుదినిర్ణయం మాత్రం పార్టీ అధిష్టానం తీసుకుంటుందని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ శాఖ ఒక తీర్మానం చేసి పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు పంపింది. ఢిల్లీలో తమకు పట్టున్న 16 స్థానాల్లో సొంతంగా పోటీచేయాలని పార్టీ కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించామని మంగళవారం సాద్ ఢిల్లీ అధ్యక్షుడు మంజిత్ సింగ్ తెలిపారు. అయితే బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటామన్నారు. సాద్ గతంలో ఢిల్లీలో బీజేపీతో పొత్తులో నాలుగు స్థానాలకు పోటీపడింది కాని అన్నింటా ఓటమి పాలైన విషయం తెలిసిందే.