న్యూఢిల్లీ:శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ మీద కాల్పులు జరిగిన ఘటనపై కేంద్ర సహాయ మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాల్పులు జరిపిన నరేన్ సింగ్ చౌరా సిక్కు జాతి రత్నం అని కొనియాడారు. నరేన్‌కు న్యాయ సహాయం అందించాలని శిరోమణి గుర్‌ద్వారా ప్రబంధక్ కమిటీకి విజ్ఞప్తి చేశారు.
నరేన్ కాల్పులు జరపడం వెనుక తన వ్యక్తిగత కారణాలేవీ లేవని, సిక్కుల మనోభావాలు దెబ్బతినడంపై ప్రతీకారం తీర్చుకున్నారన్నాడన్నారు. గతంలో అధికారంలో ఉన్నపుడు బాదల్ ప్రభుత్వం సిక్కులు పవిత్రంగా భావించే శ్రీ గురు గ్రాంత్ సాహిబ్‌ను అపవిత్రం చేయడమే కాకుండా స్వర్ణ దేవాలయం నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
బాదల్ చేసిన తప్పుల ఫలితంగానే కాల్పులు జరిగాయని తెలిపారు. నరేన్ టార్గెట్ స్వర్ణ దేవాలయం, అకల్ తక్త్ సాహిబ్ కాదని కేవలం సుఖ్బీర్ సింగ్ బాదలేనని చెప్పారు. అయితే హింసకు పాల్పడడాన్ని మాత్రం ఖండిస్తున్నట్లు బిట్టు తెలపడం గమనార్హం.
ఇదీ చదవండి: స్వర్ణ దేవాలయంలో కాల్పులు
Comments
Please login to add a commentAdd a comment