Controversial statement
-
బాదల్‌పై కాల్పులు..కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ మీద కాల్పులు జరిగిన ఘటనపై కేంద్ర సహాయ మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాల్పులు జరిపిన నరేన్ సింగ్ చౌరా సిక్కు జాతి రత్నం అని కొనియాడారు. నరేన్‌కు న్యాయ సహాయం అందించాలని శిరోమణి గుర్ద్వారా ప్రబంధక్ కమిటీకి విజ్ఞప్తి చేశారు.నరేన్ కాల్పులు జరపడం వెనుక తన వ్యక్తిగత కారణాలేవీ లేవని, సిక్కుల మనోభావాలు దెబ్బతినడంపై ప్రతీకారం తీర్చుకున్నారన్నాడన్నారు. గతంలో అధికారంలో ఉన్నపుడు బాదల్ ప్రభుత్వం సిక్కులు పవిత్రంగా భావించే శ్రీ గురు గ్రాంత్ సాహిబ్‌ను అపవిత్రం చేయడమే కాకుండా స్వర్ణ దేవాలయం నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. బాదల్ చేసిన తప్పుల ఫలితంగానే కాల్పులు జరిగాయని తెలిపారు. నరేన్ టార్గెట్ స్వర్ణ దేవాలయం, అకల్ తక్త్ సాహిబ్ కాదని కేవలం సుఖ్బీర్ సింగ్ బాదలేనని చెప్పారు. అయితే హింసకు పాల్పడడాన్ని మాత్రం ఖండిస్తున్నట్లు బిట్టు తెలపడం గమనార్హం. ఇదీ చదవండి: స్వర్ణ దేవాలయంలో కాల్పులు -
మహిళలపై రామ్‌దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు..
ముంబై: యోగా గురు రామ్‌దేవ్ బాబా మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర థానెలో శుక్రవారం జరిగిన యోగా సైన్స్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 'మహిళలు చీరకట్టులో అందంగా కన్పిస్తారు. సల్వార్ సూట్స్‌లోనూ బాగుంటారు. ఇంకా చెప్పాలంటే నా దష్టిలో వాళ్లు అసలు దుస్తులు ధరించకపోయినా అందంగానే ఉంటారు.' అని రాందేవ్ బాబా నోరుపారేసుకున్నారు. రామ్‌దేవ్ బాబా పాల్గొన్న ఈ కర్యక్రమానికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత ఫడణవీస్, సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే కూడా హాజరయ్యారు. వాళ్ల సమక్షంలో రామ్‌దేవ్ బాబా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇది రాజకీయంగానూ దుమారం రెపే సూచనలు కన్పిస్తున్నాయి. రామ్‌దేవ్ బాబా వ్యాఖ్యలను మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్ తీవ్రంగా ఖండించారు. రామ్‌దేవ్ బాబా అసలు మనస్తత్వం ఏంటో బయటపడిందని విమర్శలు గుప్పించారు. మహిళలకు ఆయన ఇచ్చే గౌరవం ఏంటో తెలుస్తోందన్నారు. చదవండి: కొలీజియం పరాయి వ్యవస్థ -
మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పాతబస్తీలో టెన్షన్
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా రాజాసింగ్.. యూ ట్యూబ్‌లో వీడియోను విడుదల చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో, ముజ్లిస్ నేతలు.. తమ మనోభావాలను కించపరిచే విధంగా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈక్రమంలో మజ్లిస్ నేతలు.. అర్ధరాత్రి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ముందు, పట్టణంలోని ఇతర ప్రాంతాలలో బైఠాయించి నిరసనలకు దిగారు. రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ పలు పీఎస్‌లలో ఫిర్యాదులు చేశారు. భవానీనగర్, డబీర్‌పురా, రెయిన్ బజార్ పీఎస్‌లలో ఫిర్యాదులు చేయడంతో రాజాసింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలో హై టెన్షన్ నెలకొంది. -
బయటకొచ్చిన ‘కత్తి’.. రాముడిపై మళ్లీ పోస్ట్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ బయటికొచ్చారు. గత రాత్రి(సోమవారం) బంజారాహిల్స్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అర్థరాత్రి విచారణ కోసం స్టేషన్‌కి తీసుకెళ్లిన పోలీసులు.. ఆయన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే కేసుకు సంబంధించిన వివరాలు చెప్పటంతో.. వివరణ కోరుతూ ఇప్పుడు నోటీస్ ఇచ్చారని, దర్యాప్తుకు సహకరించమని కోరారని కత్తి మహేష్ తెలిపారు. ఇకపైన మిగతా విషయాలు చూడాలి అంటూ ఫేస్బుక్లో ఆయన ఓ పోస్ట్ చేశారు. అయితే అంతటితో ఆగకుండా మరో పోస్టుతో ఆయన దుమారం రేపారు. ‘శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనువదించిన రామాయంలోని యుద్ధకాండలోని కొంత భాగాన్ని’ ఆయన పోస్ట్ చేశారు. తాను ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదని తన వ్యాఖ్యలను మహేష్ సమర్థించుకుంటున్న విషయం తెలిసిందే. (ఇంతకీ కత్తి ఏమన్నాడంటే...) -
అనుచిత వ్యాఖ్యలకు సత్యనాదెళ్ల క్షమాపణలు!
న్యూయార్క్: వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల క్షమాపణలు చెప్పారు. నేను మాట్లాడింది చాలా తప్పు అని సత్యనాదెళ్ల వివరణ ఇచ్చారు. ఉద్యోగాలు చేసే మహిళలు తమ జీతాల పెంపు విషయంలో కర్మసిద్ధాంతాన్ని నమ్ముకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళలకు ఆగ్రహం తెప్పించాయి. ఆరిజోనాలో ఓ కంప్యూటింగ్ సదస్సులో స్టేజి మీద చర్చలో మాట్లాడుతున్నప్పుడు ఆయనీ వ్యాఖ్యలు చేశారు.