అనుచిత వ్యాఖ్యలకు సత్యనాదెళ్ల క్షమాపణలు!
న్యూయార్క్: వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల క్షమాపణలు చెప్పారు. నేను మాట్లాడింది చాలా తప్పు అని సత్యనాదెళ్ల వివరణ ఇచ్చారు.
ఉద్యోగాలు చేసే మహిళలు తమ జీతాల పెంపు విషయంలో కర్మసిద్ధాంతాన్ని నమ్ముకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళలకు ఆగ్రహం తెప్పించాయి. ఆరిజోనాలో ఓ కంప్యూటింగ్ సదస్సులో స్టేజి మీద చర్చలో మాట్లాడుతున్నప్పుడు ఆయనీ వ్యాఖ్యలు చేశారు.