
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల నాలుగురోజుల పాటు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన సత్యనాదెళ్లతో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు.
ఈ భేటీ సందర్భంగా ఇద్దరు హైదరాబాదీల భేటీతో ఈ రోజును ప్రారంభించడం సంతోషంగా ఉంది. బిజినెస్ & బిర్యానీతో గురించి మాట్లాడుకున్నాం’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Good start to the day when two Hyderabadis get to catch up @satyanadella
— KTR (@KTRTRS) January 6, 2023
We chatted about Business & Biryani 😊 pic.twitter.com/3BomzTkOiS
ఇక సత్యనాదెళ్లతో జరిపిన భేటీలో కేటీఆర్ హైదరాబాద్‌లో పెట్టుబడులు, టీహబ్ విస్తరణ, ప్రాజెక్ట్‌లతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
చాట్ జీపీటీతో సత్యనాదెళ్ల బిర్యానీ ముచ్చట్లు
బెంగళూరులో జరిగిన ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సమ్మిట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఛాట్ రోబో ‘చాట్ జీపీటీ’, సత్య నాదెళ్ల మధ్య హైదరాబాద్ బిర్యానీ గురించి ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా పాపులర్ సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఏంటని చాట్ రోబోను ప్రశ్నించగా.. ఇడ్లీ, దోశ, వడ, బిర్యానీ అంటూ అది సమాధానమిచ్చింది. వెంటనే స్పందించిన సత్య నాదెళ్ల.. బిర్యానీ టిఫిన్ కాదని, దాని గురించి నాకు బాగా తెలుసని రిప్లయి ఇవ్వడంతో చాట్ జీపీటీ క్షమాపణలు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment