Biriyani
-
ఛీ..ఛీ.! బావర్చి.. బిర్యానీలో ఏముందో చూడండి
-
జెర్రి పడిన బిరియాని తిన్న నలుగురికి అస్వస్థత
తమిళనాడు: ఊటీలో శుక్రవారం జెర్రి పడిన బిరియాని తిన్న నలుగురు అస్వస్థతకు గురయ్యారు. నీలగిరి జిల్లా ఊటీ పక్కనే వున్న ఎం.పాలాడా పరిసర ప్రాంతాలలో పెద్ద మొత్తంలో క్యారెట్ సాగవుతోంది. రెండువేల మందికి పైగా కార్మికులు అక్కడే వుంటూ పనిచేస్తున్నారు. ఎం.పాలాడ సమీపంలోని నరికుజియాడ ప్రాంతానికి చెందిన కృష్ణస్వామి శుక్రవారం మధ్యాహ్నం మమ్మీ మెస్ నుంచి నాలుగు బిరియానీలు కొన్నాడు. కృష్ణస్వామి, అతని సహచరులు కలిసి దీనిని తింటున్నారు. అందులో జెర్రి మృతి చెంది ఉంది. నలుగురు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఎం.పాలాడాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చి చికిత్స అందించారు. దీనిపై ఆహార భద్రత శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం నీలగిరి జిల్లా ఫుడ్ సేప్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ సురేష్, అధికారులు నందకుమార్, శివరాజ్ నేతృత్వంలోని బృందం రెస్టారెంట్లో పరిశీలించారు. అక్కడ అపరిశుభ్రంగా ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది. వారికి రూ.2000 జరిమానా విధించి నోటీసులు జారీ చేశారు. -
బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు..
బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు ఓ ఐఐటీయన్. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆహార బ్రాండ్లలో ఒకటైన ‘బిర్యానీ బై కిలో’ అనే సంస్థను 2015లో విశాల్ జిందాల్ స్థాపించారు. అప్పటి నుంచి కంపెనీ వార్షిక ఆదాయం పెరుగుతూ వస్తోంది. అయితే దీంతోనే అతను సంతృప్తి చెందలేదు. వచ్చే రెండు మూడేళ్లలో రూ.1000 కోట్ల టర్నోవర్ సాధించబోతున్నాడు. బిర్యానీ బిజినెస్‌తో సక్సెస్ అయిన ఐఐటీయన్ కథ ఇది.. అనేక వ్యాపారాలు ఉన్న విశాల్ జిందాల్ స్వయంగా ఆహార ప్రియుడు. అందుకే ఆయనకు ఎన్ని వ్యాపారాలు ఉన్నా బిర్యానీ వ్యాపారమంటేనే ఆయనకు మక్కువ. ఈ బిరియానీ వ్యాపారం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన భారతదేశంలోని ఖాన్సామా సంప్రదాయాన్ని పునరుద్ధరించడం. అంటే ఇక్కడ ప్రతి ఆర్డర్‌ను విడివిడి వండుతారు. వండిన బిర్యానీని మట్టి పాత్రల్లో కాల్చిన పిండి సహాయంతో ప్యాక్ చేస్తారు. ఇదీ చదవండి: అపరిచితుడికి కిడ్నీ దానం.. అపర దాన కర్ణుడు ఈ బిలియనీర్.. ఐఐటీ నుంచి ఇంజినీరింగ్ చేసిన విశాల్ జిందాల్ ఆ తర్వాత న్యూయార్క్‌లోని సిరక్యూస్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఫైనాన్స్ చదివారు. సింగపూర్‌కు చెందిన ఎకోసిస్టమ్ అడ్వైజరీ బోర్డులో జిందాల్ కూడా ఉన్నారు. ఇది అతని మొదటి కంపెనీ కాదు. గుర్గావ్లో కార్పెడియం క్యాపిటల్ పార్టనర్స్ అనే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌ను స్థాపించారు. ఫిడిలిటీ వెంచర్స్ వ్యవస్థాపకుడు అలాగే ఆ సంస్థకు ఎండీగా, అక్షయం క్యాపిటల్ సీఈవోగా ఉన్నారు. (layoffs: షాకిచ్చిన ఇండియన్ ట్విటర్, 30 శాతం మందికి గుడ్ బై?) భారతీయ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థను ఆయనే స్థాపించి మిలియన్ డాలర్ల కంపెనీగా మార్చారు. ఇది అన్ని మెట్రో నగరాల్లో 100 మంది ఉద్యోగులు, కార్యాలయాలను కలిగి ఉంది. విశాల్ జిందాల్ అమెరికాలో 1994లో అమనో సిన్సినాటి అనే కంపెనీకి మార్కెటింగ్ అసోసియేట్‌గా పనిచేశారు. ‘బిర్యానీ బై కిలో’ సంస్థ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 300 కోట్ల ఆదాయం వస్తుందని ఆశించారు. అయితే ప్రస్తుతం కంపెనీ నష్టాల్లో ఉంది. అయినప్పటికీ జూన్ నాటికి పుంజుకుంటుందని ఆశిస్తున్నారు. కంపెనీకి రూ. 700-750 టిక్కెట్ సైజుతో రోజుకు 10,000 కంటే ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. ఈ కంపెనీకి అన్ని మెట్రో నగరాలతో సహా 45 కంటే పైగా నగరాల్లో 100కి పైగా అవుట్లెట్లు ఉన్నాయి. (కండోమ్స్ బిజినెస్: 50లక్షలనుంచి రూ. 43వేల కోట్లతో దడ పుట్టించిన బ్రదర్స్) 2022 ఆర్థిక సంవత్సరంలో వారు రూ. 135 కోట్లు, అంతకుముందు 2021 సంవత్సరంలో రూ. 65.6 కోట్లు ఆర్జించారు విశాల్ జిందాల్. వచ్చే రెండు మూడు ఏళ్లలో రూ.1000 కోట్ల టర్నోవర్‌ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందు కోసం మార్కెటింగ్ వ్యయాన్ని కూడా పెంచాలనుకుంటున్నట్లు, మెక్‌డొనాల్డ్స్, స్టార్‌బక్స్ కంటే పెద్ద వ్యాపారాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు విశాల్ జిందాల్ టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా సంస్థతో పేర్కన్నారు. ఇదీ చదవండి: Mukesh Ambani Birthday: వ్యాపారంలోకి రాకముందు ముఖేష్ అంబానీ ఏమవ్వాలనుకున్నారో తెలుసా? -
అక్కడి బిర్యాని తింటే.. కోరికలు నెరవేరుతాయి, పోటేత్తిన జనం!
సాక్షి, చెన్నై: మునియాండి ఆలయ ఉత్సవాల్లో భాగంగా మదురై సమీపంలోని వడకం పట్టిలో శనివారం 50 గ్రామాల ప్రజలకు బిర్యాని విందు ఏర్పాటు చేశారు. ఈ బిర్యాని (ప్రసాదం) తింటే ఎలాంటి కోరికలైనా త్వరితగతిన తీరుతాయని ఇక్కడి భక్తులు భావిస్తుంటారు. వివరాలు.. మదురై జిల్లా తిరుమంగలం సమీపంలో కల్లికుడి వడకంపట్టి గ్రామం ఉంది. ఇక్కడ కొలువై ఉన్న మునియాండి స్వామిని తమ కులదైవంగా రాష్ట్రంలోని వేలాది కుటుంబాలు భావిస్తుంటాయి. రాష్ట్రంలో మునియాండి విలాస్ పేరిట హోటళ్లు నడుపుతున్న వాళ్లందరికీ ఇక్కడి మునీశ్వరరే కులదైవం. ఏటా ఇక్కడ ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఉత్సవాలు నిర్వహించ లేదు. ఈ ఏడాది భారీ స్థాయిలో ఈ ఉత్సవాలను (వారం రోజులుగా) నిర్వహిస్తున్నారు. ఇక శనివారం బిర్యాని విందు అట్టహాసంగా సాగింది. బారులుదీరిన జనం.. ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి.. అభిషేకం కోసం పాల బిందెలతో ఊరేగింపు చేపట్టారు. అతిపెద్ద కత్తులను ఆలయానికి సమర్పించారు. తర్వాత 50 గ్రామాలకు చెందిన భక్తులకు బిర్యాని విందు ఏర్పాటు చేశారు. 74 మేకలను, 200కు పైగా కోళ్లు, 2,500 కేజీల బియ్యంతో బిర్యాని తయారు చేసి, అందరికీ పంచి పెట్టారు. ఇక్కడి బిర్యాని కోసం జనం ఎగబడ్డారు. ఈ బిర్యాని తింటే పెళ్లి కాని వారికి పెళ్లిలు అవుతాయని, బిడ్డలు లేని వారికి పిల్లల భాగ్యం కలుగుతుందని, ఇతర కోరికలన్నీ నెర వేరుతాయని భక్తులు వెల్లడించారు. ఈ ఆలయంలోని స్వామి వారి పేరిట రాష్ట్రవ్యాప్తంగా మునియాండి విలాస్‌లను నడుపుతున్నామని, రోజూ తమ హోటల్లో తొలి బిల్లు రూపంలో వచ్చే మొత్తా న్ని ఆలయం కోసం తాము కేటాయిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆలయం రాష్ట్రంలోని వేలాది కుటుంబాలకు కుల దైవం అని, ఇక్కడికి వచ్చే వారిలో ఎక్కువ శాతం మంది ఆలయం వద్దే బంధురికం కలుపుకోవడం విశేషం. అలా బంధువుల్లోని యువతి, యువకులను ఎంపిక చేసి వివాహాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: తమిళనాడులో విషాదం.. ఆలయ ఉత్సవాల్లో కుప్పకూలిన క్రేన్.. నలుగురి మృతి -
సత్య నాదెళ్లతో బిజినెస్, బిర్యానీ గురించి చర్చించా : మంత్రి కేటీఆర్
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల నాలుగురోజుల పాటు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన సత్యనాదెళ్లతో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఇద్దరు హైదరాబాదీల భేటీతో ఈ రోజును ప్రారంభించడం సంతోషంగా ఉంది. బిజినెస్ & బిర్యానీతో గురించి మాట్లాడుకున్నాం’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. Good start to the day when two Hyderabadis get to catch up @satyanadella We chatted about Business & Biryani 😊 pic.twitter.com/3BomzTkOiS — KTR (@KTRTRS) January 6, 2023 ఇక సత్యనాదెళ్లతో జరిపిన భేటీలో కేటీఆర్ హైదరాబాద్‌లో పెట్టుబడులు, టీహబ్ విస్తరణ, ప్రాజెక్ట్‌లతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. చాట్ జీపీటీతో సత్యనాదెళ్ల బిర్యానీ ముచ్చట్లు బెంగళూరులో జరిగిన ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సమ్మిట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఛాట్ రోబో ‘చాట్ జీపీటీ’, సత్య నాదెళ్ల మధ్య హైదరాబాద్ బిర్యానీ గురించి ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా పాపులర్ సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఏంటని చాట్ రోబోను ప్రశ్నించగా.. ఇడ్లీ, దోశ, వడ, బిర్యానీ అంటూ అది సమాధానమిచ్చింది. వెంటనే స్పందించిన సత్య నాదెళ్ల.. బిర్యానీ టిఫిన్ కాదని, దాని గురించి నాకు బాగా తెలుసని రిప్లయి ఇవ్వడంతో చాట్ జీపీటీ క్షమాపణలు చెప్పింది. -
ఆ వంటకి పేరు మార్చి చైనా బిరియానీ అన్నారు.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!
ఇటీవల యూట్యూబ్‌లో వంటల వీడియోలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతెందుకు ఇందులో కొందరు సెలబ్రిటీలు సైతం తమ చేతివాటం చూపిస్తున్నారు. ఇంకొందరు సామాన్యులు తమ వంటల రెసిపీతో నెటిజన్ల నోరూరిస్తూ సెలబ్రిటీలుగా మారుతున్నారు. ఈ జాబితాలో గ్రామీణ వంటలు, రెస్టారెంట్ వంటలు, దేశీయ, విదేశీ వెరైటీలంటూ ఇలా చాలా రకాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. ఓ యువతి గతంలో చేసిన వంటకంపై కొంతమంది నెటిజన్లు తాజాగా మండిపడుతున్నారు. అది ఎందుకో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.. యూట్యూబ్‌లో కుకింగ్ విత్ సరియా అనే ఛానెల్ ఉంది. ఇందులో ఆమె రకరకాల వంటల వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. అదే తరహాలో 2020 ఫిబ్రవరి 3న చైనీస్ బిర్యానీ రెసిపీ తయారీ విధానం అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. దానిపైనే అప్పట్లో దుమారమే రేగిందనుకోండి. ఆ వీడియో సంగతి ఇప్పుడెందుకు అంటారా! అయితే తాజాగా ఓ నెటిజన్ తన ట్విట్టర్లో.. ప్రతీ దగ్గర చూసేదే ఇది... ఇందులో కొత్తదనం ఏముంది అన్నట్లుగా క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ పోస్టుతో ఈ వీడియోపై నెట్టింట నెగెటివ్ కామెంట్లు కురుస్తున్నాయి. కొంతమంది ఫ్రైడ్ రైస్‌ని చైనా బిరియానీ అంటే నమ్మాలా అని కామెంట్ చేయగా, తెలిసిన వంటకన్ని చేసి పేరు మార్చడం ఏంటని మండిపడుతున్నారు. I have seen everything 🤦🏻♀️ pic.twitter.com/Pf53gbNdwn — javeria (@jikhlaq52) October 5, 2021 -
వ్యాక్సిన్ వేసుకుంటే.. బిర్యానీ, బైకు, బంగారం.. ఎక్కడో తెలుసా?
చెన్నై: కోవిడ్ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సినేషన్ కీలకమని ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. మరో పక్క టీకా వేసుకుంటే ఏమౌతుందో అన్న అపోహ ఇంకా పలు చోట్ల ఉండడంతో వ్యాక్సినేషన్‌కు ప్రజలు ముందుకు రావడం లేదు. దీంతో తమిళనాడులో ఓ స్వచ్ఛంద సంస్థ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. వ్యాక్సిన్ వేయుంచుకున్న వారికి లక్కీ డ్రా రూపంలో విలువైన వస్తువులను అందిస్తోంది. ఈ లక్కీ డ్రాలో బిర్యానీ, మిక్సీ గ్రైండర్, 2 గ్రాముల బంగారం, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, స్కూటర్‌ను బహుమతులుగా ఇస్తామని చెప్పడంతో ప్రజలు టీకా వేయించుకోవడానికి ముందుకొస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే..బైకు, బంగారం మీకే కోవలం ప్రాంతంలో సుమారు 7000 జనాభా ఉండగా, గత రెండు నెలల్లో కేవలం 58 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ వేసుకునే వారి సంఖ్య తగ్గుతుందనే ఆందోళనతో ఆ ప్రాంతానికి చెందిన ఎస్ఎన్ రామ్‌దాస్ ఫౌండేషన్, ఎస్టిఎస్ ఫౌండేషన్, చిరాజ్ ట్రస్ట్‌కు చెందిన వలంటీర్లు చేతులు కలిపి ఓ పథకాన్ని ప్రవేశపెట్టారు. అందులో భాగంగానే వ్యాక్సిన్ వేసుకున్నావారికి ఉచిత బిర్యానీ భోజనం అందించడం ప్రారంభించారు. అనంతరం దీన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి, ముగ్గురు వ్యక్తులకు మిక్సీ, గ్రైండర్ , 2-గ్రాముల బంగారు నాణెలను లక్కీ డ్రా ద్వారా ఇవ్వడం ప్రారంభించారు. రాను రాను అందులో విజేతలకు బహుమతిగా రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, స్కూటర్‌ను కూడా జత చేర్చారు. ఈ నేపథ్యంలో కొత్తగా టీకా వేయించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇలా ఈ లక్కీ డ్రా వల్ల కేవలం మూడు రోజుల్లో 345 మందికి టీకాలు వేసుకున్నారు. చదవండి: మంత్రి ప్రకటనపై ప్రజలు హర్షం, ఆ వెంటనే యూటర్న్.. -
బిర్యానీ తిన్న బాలిక కాసేపటికే..
సాక్షి, భువనేశ్వర్ (జయపురం) : నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్ పట్టణంలో పాచిపోయిన బిర్యానీ తిన్న ఒక బాలిక మరణించగా మరో ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఉమ్మరకోట్ మునిసిపాలిటీ 6వ వార్డులో మంగళవారం జరిగిన ఈ సంఘటనతో బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వివరాలిలా ఉన్నాయి ఉమ్మరకోట్‌లోని 8 వ వార్డుకు చెందిన సంజు హరిజన ఇంట ఆదివారం రాత్రి బిర్యానీ వండారు. వారు తిన్నంత తిని మిగిలిన దాన్ని దాచి ఉంచారు. సోమవారం మధ్యాహ్నం అదే వార్డుకు చెందిన లచ్చమన హరిజన్ ఇద్దరు కుమార్తెలు, కుమారుడు, మరో చిన్నారి సంజు హరిజన్ ఇంటికి వెళ్లడంతో దాచి ఉంచిన బిర్యానీని వారికి పెట్టారు. అది తిన్న లచ్చమన హరిజన్ కుమార్తెలు జయ హరిజన్, ఘాసిని హరిజన్, కుమారుడు దావూద్ హరిజన్‌లతో పాటు మరో చిన్నారి రొయిత్ హరిజన్ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వారిని వెంటనే ఉమ్మరకోట్ కమ్యూనిటీ హాస్పిటల్‌కు తరలించగా ప్రాథమిక చికిత్స చేసి ఇళ్లకు పంపారు. మార్గమధ్యంలో మృతి అయితే అదే రాత్రి 7 గంటలకు ఆ చిన్నారులకు మరోసారి ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్‌కు తీసుకు వెళ్తుండగా లచ్చమన హరిజన్ కుమార్తె జయ హరిజన్ (5) మార్గమధ్యంలోనే మృతి చెందింది. ఘాసిని హరిజన్ (8), దావూద్ హరిజన్ (3), రొయిత్ హరిజన్ (2)లు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న ముగ్గురి ఆరోగ్యం స్థిమితంగా ఉందని, పాచిపోయిన బిర్యానీ తినడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని శిశు వైద్య నిపుణుడు డాక్టర్ సంతోష్ కుమార్ పండా అభిప్రాయపడ్డారు. చదవండి: ‘మాయలేడి’ మామూలుది కాదు.. ఎన్ని కేసులో -
బిర్యానీ ఇవ్వలేదని కరెంట్ కట్
అమీర్‌పేట: కరెంటు బిల్లులు చెల్లించినా బిర్యానీ ఇవ్వడం లేదన్న కోపంతో హోటల్‌కు కరెంటు సరఫరాను నిలిపివేశారని బల్కంపేటలో గల క్రిస్టల్ బావర్చి హోటల్ నిర్వా హకుడు ఆరోపించారు. హోటల్‌కు సంబంధించి మూడు కరెంటు మీటర్లు ఉన్నాయి. ఒక మీటరుకు రూ. 39,566, రెండో మీటర్‌కు రూ. 4,529, మూడో మీటర్‌కు రూ. 9,682ల కరెంటు బిల్లు వచ్చింది. పై రెండు మీటర్లకు సంబంధించి బిల్లులు 25న చెల్లించగా మూడో మీటర్ బిల్లును 29న చెల్లించామని హోటల్ నిర్వాహకుడు సైయ్యద్ హస్మతుల్లా ఖాద్రి తెలిపారు. ఉదయం కరెంటు సిబ్బంది సుధీర్‌కుమార్, రాజు, జీఎన్ రావులు హోటల్‌కు వచ్చి బిల్లులు చెల్లించని కారణంగా కరెంటును కట్ చేస్తున్నామని తెలిపారు. ఫోన్ పే ద్వారా రెండు బిల్లులు చెల్లించామని, ఓ బిల్లు ఈ రోజే చెల్లించామని, ఫోన్లో చెల్లించినట్లు ఉన్న స్క్రీన్ షాట్‌ను కూడా చూపించారు. అయినా వారి మాటలు పట్టించుకోకుండా మూడు మీటర్లకు కరెంటును కట్ చేశారు. హోటల్ యజమాని వచ్చే వరకైనా ఆగాలని హోటల్ సిబ్బంది నవీద్ వేడుకోగా మీ సార్... వచ్చేదాక ఆగాలా అంటూ కరెంటు కట్ చేసి అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఒక మీటర్‌కు ఆలస్యమైతే మూడు మీటర్లకూ కట్ చేస్తారా.. మూడో మీటర్ ఒక్క దానికి బిల్లు చెల్లింపు ఆలస్యం జరిగితే మూడు మీటర్లకు విద్యుత్ సరఫరా ఎలా నిలిపివేస్తారని యజమాని ఖాద్రి వాపోయాడు. ఉదయం నుంచి కరెంటు లేకపోవడంతో ఆహార పదార్థాలు అన్ని పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ( చదవండి: కరోనా బాధితులకు గుడ్ న్యూస్: ఫోన్ కొడితే.. ఇంటి వద్దకే.. ) -
గరిటె పట్టిన రాహుల్.. వీడియో వైరల్
చెన్నై: ప్రస్తుతం యూట్యూబ్‌లో బాగా పాపులర్ చానెల్స్ ఏంటి అంటే వంటల వీడియోలకు సంబంధించిన చానెల్స్. సరదాగా మొదలు పెట్టిన వారు ఇప్పుడు తమ పాక శాస్త్ర ప్రావీణ్యంతో జనాలను ఆకట్టుకుని.. లక్షల్లో సంపాదిస్తున్నారు అంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక ఇలాంటి వీడియోలో ఎవరైనా సెలబ్రిటీ కనిపిస్తే.. ఇంకేముంది.. వారి చానెల్ ఎక్కడికో వెళ్లి పోతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ యూట్యూట్ కుకింగ్ చానెల్లో కనిపించడమే కాక స్వయంగా గరిటె తిప్పి.. సదరు యూట్యూబ్ చానెల్ మెంబర్స్‌తో కలిసి వారు చేసిన వంటను ఆరగించారు. ఇక వంట చేసే సమయంలో రాహుల్ ఆయా పదార్థాల పేర్లను తమిళంలో పలికేందుకు ట్రై చేయడం.. చాలా బాగా కుదిరింది అంటూ సరదాగా కామెంట్ చేస్తూ.. ఉత్సాహంగా కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. వివరాలు.. ఇటీవల తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ.. అక్కడ బాగా ఫేమస్ అయిన ఓ‘విలేజ్ కుకింగ్ ఛానెల్’ పెరియతంబీ బృందాన్ని కలిశారు. సడెన్‌గా వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చారు. వారు చేస్తోన్న మష్రూమ్ (పుట్టగొడుగులు) బిర్యానీ తయారీ విధానం చూశారు. ఆ బృందంతో పాటు తాను గరిటె తిప్పారు. (చదవండి: లెక్కల ‘అంతు’ తేల్చినవాడు) బిర్యానీ సైడ్ డిష్ కోసం రాహుల్ రైతా తయారు చేశారు. ఇక దానికి వాడే పదార్థాలైన ఉల్లిపాయలు, పెరుగు, కల్లుప్పును తమిళంలో ఏం అంటారో తెలుసుకుని.. తిరిగి పలకడానికి ప్రయత్నించారు. ఇక బిర్యానీ వంటడం పూర్తయిన తర్వాత వారంతా అక్కడే కూర్చుని దాన్ని తిన్నారు. అనంతరం బిర్యానీ సూపర్ అంటూ వారిని తమిళంలో ప్రశంసించారు. రాహుల్‌కి, పెరియతంబీ బృందానికి మధ్య జరిగిన ఆ సంభాషణ ఆసాంతం ఆకట్టుకునేలా ఉంది. స్థానిక మహిళ ఒకరు రాహుల్‌కు, పెరియతంబి టీమ్‌కు మధ్య ట్రాన్స్‌లేటర్‌గా వ్యవహరించారు. రాహుల్ ఆంగ్లంలో చెప్పింది వారికి తమిళంలో చెప్పి, వాళ్లు తమిళంలో మాట్లాడింది రాహుల్‌కు ఆంగ్లంలో వివరించి సంభాషణ కొనసాగించారు. ఈ క్రమంలో ఒకసారి ఆమె రాహుల్ ఇంగ్లిష్‌లో చెప్పిన మాటలను వారికి మళ్లీ అదే భాషలో చెప్పడం వీడియోలో నవ్వులు పూయిస్తుంది. (చదవండి: తమిళులపై మోదీ సవతి ప్రేమ ) తమ వంటలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే తమ లక్ష్యమని ఈ బృందానికి చెందిన సుబ్రహ్మణ్యం రాహుల్ గాంధీకి తెలిపాడు. తమిళనాడు మాత్రమే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాలు, ఇతర దేశాలకు కూడా వెళ్లి వంటలు చేయాలనేది తమ కోరిక అని చెప్పాడు. అంతేకాక తమ చానెల్ ద్వారా తాము డబ్బు సంపాదించడమే కాక మరో నలుగురికి ఉపాధి కల్పించడమే తమ ధ్యేయం అన్నారు. అది విన్ని రాహుల్.. అమెరికాలో తనకొక మిత్రుడు ఉన్నాడని, ఆయనకు చెప్పి షికాగోలో వంట కార్యక్రమం పెట్టిస్తానని హామీ ఇచ్చారు. ఆ మిత్రుడు ఎవరో కాదు.. శ్యామ్ పిట్రోడా. 14 నిమిషాల నిడివి గల ఈ వీడియో చివరివరకూ ఆసక్తికరంగా సాగింది. ఇక ఈ వీడియోపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఆవకాయ బిర్యాని 13th january 2016
-
ఆవకాయ బిర్యాని 17th December 2015
-
బిర్యానీ రెడీ
రెండు కూరలు, పప్పు, పచ్చడి, అప్పడం, పెరుగుతో భోం చేస్తే షరా మామూలే! వారానికోసారైనా బిర్యానీ లాగించెయ్యడమే ఇప్పుడు నగరవాసుల కొత్త టేస్ట్. అదీ ఇంటిలో చేసింది కాదు.. బిర్యానీ పాయింట్‌కి వెళ్లి బిర్యానీ తినాల్సిందే. దీనికి అనుగుణంగానే నగరంలో భారీగా బిర్యానీ విక్రయ సెంటర్లు వెలిశాయి. ర్యానీ పాయింట్.. ఇప్పుడు నగరంలో ఇదో పెద్ద వ్యాపారం. నగర ప్రజల అభిరుచికి అనుగుణంగా ఈ బిర్యానీ తయారీ సెంటర్లు వెలుస్తున్నాయి. రోజూవారీ అమ్మకాలు ఒక్కో పాయింట్లో రూ.25 వేల పైబడే జరుగుతున్నట్లు అంచనా. కొందరు బిర్యానీ ప్రియులు నెలకు సుమారు రూ.వెయ్యిరూపాయలు బిర్యానీకే వెచ్చిస్తున్నారు. అదికూడా బాస్మతి బియ్యంతో చేసిన బిర్యానీకి ఎక్కువ డిమాండ్ ఉంది. బిర్యానీలో మటన్ దమ్, మటన్ ఫ్రై, చికెన్ దమ్, చికెన్ ఫ్రై, చికెన్ జాయింట్, చికెన్ బోన్‌లెస్ బిర్యాని, వెజ్ బిర్యాని రైస్ రకాలు లభిస్తున్నాయి. నగరంలో మద్రాస్ బిలాల్, వైస్రాయ్, న్యూ బావాచి, మౌర్యా, బాబు బిర్యాని పాయింట్, అజ్మీర్ మహరాజ్ తదితర పాయింట్లలో బిర్యాని లభిస్తోంది. వీటితోపాటు పెద్ద రెస్టారెంట్లలో కూడా పలు రకాల బిర్యానీలు లభిస్తున్నాయి. ఆర్డర్లపై బిర్యానీల సప్లయి.. వివాహాది, శుభకార్యాలకు బిర్యానీలు సప్లయి చేసేందుకు బిర్యానీ పాయింట్లు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటున్నాయి. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసుకున్నాయి. బిర్యానీ ధరలు రూ.100 నుంచి రూ.300 వరకు ఉన్నాయి. హోటళ్లలో మామూలు భోజనం ధర దాదాపు రూ.70 నుంచి రూ.80 వరకు ఉంది. దీంతో రూ.100 పెట్టి బిర్యానీ తినేందుకు చాలామంది వెనుకాడడం లేదు. కొన్ని హోటళ్లలో తిన్నంత బిర్యానీ అందిస్తున్నారు. బిర్యానీ పార్సిల్‌కు కూడా వినియోగదారుల నుంచి మంచి ఆదరణ ఉంది. నాలుగేళ్లుగా బిర్యానీ చేస్తున్నా.. మా స్వస్థలం చెన్నై. నాలుగేళ్లుగా నేను బిర్యానీ చేస్తున్నాయి. నాతోపాటు హోటల్లో నలుగురు నిష్ణాతులైన బిర్యానీ మాస్టర్లు ఉన్నారు. నేతితో తయారుచేసిన బిర్యానీకి డిమాండ్ ఉంది. బిర్యానీని బాసుమతి బియ్యంతో తయారు చేస్తే ఆ రుచి మరింతగా బాగుంటుంది. మూడేళ్లుగా.. మూడేళ్లుగా బిర్యానీ అమ్మకాలను కొనసాగిస్తున్నాం. రుచికరమైన బిర్యానీని వినియోగదారులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాం. నగరంలో రోజురోజుకీ బిర్యానీ విక్రయించే పాయింట్లు పెరుగుతున్నాయి. - నసీర్, అజ్మీర్ మహారాజ్ బిర్యానీ పాయింట్ కస్టమర్లు ఆదరిస్తారు.. నాలుగేళ్లనుంచి బిర్యానీ అమ్మకాలు ప్రారంభించాం. నాణ్యతతో కూడిన నేతి బిర్యానీని అందిస్తే కస్టమర్లు ఆదరిస్తారని గట్టిగా నమ్ముతున్నాం. -మహ్మద్, బిర్యానీ మాస్టర్, హోటల్ బాబు బిర్యాని పాయింట్ -
మంచి బిరియాని తిన్న అనుభూతినిస్తుంది
‘‘నాకు ‘బిరియాని’ చాలా స్పెషల్ మూవీ. ఇందులో ప్లేబోయ్‌గా నటించాను. తెలుగు ప్రేక్షకులకు మంచి స్పైసీ బిరియాని తిన్న ఫీల్‌ని ఇస్తుందీ సినిమా’’ అన్నారు కార్తీ. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో కార్తీ, హన్సిక జంటగా జ్ఞానవేల్‌రాజా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రం ‘బిరియానీ’. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానుంది. యువన్‌శంకర్‌రాజా స్వరాలందించిన ఈ చిత్రం పాటలను చిత్రం యూనిట్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ -‘‘అన్ని అంశాలనూ మేళవించి వెంకట్‌ప్రభు ఈ కథ తయారు చేశారు. యువన్ నా చిన్ననాటి స్నేహితుడు. అతనికి ఇది వందవ సినిమా కావడం చాలా ఆనందంగా ఉంది. హన్సిక ఈ సినిమాకోసమే బరువు తగ్గారు. అలాగే మాండి థాకర్ చేసిన ఐటమ్‌సాంగ్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. సినిమా సక్సెస్ సాధిస్తుందని నా నమ్మకం’’ అన్నారు. ఇందులో జర్నలిస్ట్ ప్రియగా నటించానని, కార్తీ మంచి టైమ్ సెన్స్ ఉన్న నటుడని హన్సిక చెప్పారు. దాసరిగారి ‘ఒసేయ్ రాములమ్మ’, ‘రౌడీ దర్బార్’ చిత్రాల తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని రాంకీ అన్నారు. నిర్మాత జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ -‘‘తమిళంలో మేం తీసిన ప్రతి సినిమా తెలుగులో విడుదల చేశాం. వాటిల్లో తమిళంలో కంటే తెలుగులోనే మంచి విజయం సాధించిన సినిమాలున్నాయి. రాబోతున్న ‘బిరియాని’ కూడా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని నా నమ్మకం’’ అన్నారు. తమ ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ -‘‘సూర్య కథానాయకునిగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలోనే ఓ సినిమా చేయబోతున్నాం. ఫిబ్రవరిలో ఈ చిత్రం మొదలవుతుంది. అలాగే వచ్చే ఏడాది ఆగస్ట్‌లో ఓ టాప్ డెరైక్టర్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ స్ట్రయిట్ తెలుగు సినిమా ఉంటుంది’’ అని జ్ఞానవేల్ రాజా తెలిపారు. -
కార్తి స్పెషల్ ‘బిరియానీ’ రెడీ
కార్తి, హన్సిక కలిసి వడ్డించనున్న ‘బిరియాని’ సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజాకు ఓ మరపురాని జ్ఞాపకంగా నిలిచిపోనుంది. ఎందుకంటే అది యువన్‌కు వందో సినిమా. వెంకట్ ప్రభు దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞాన్‌వేల్‌రాజా ఈ చిత్రాన్ని నిర్మిచారు. ఈ వారంలో పాటలను, 20న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా జ్ఞాన్‌వేల్‌రాజా మాట్లాడుతూ -‘‘కార్తీ ఇప్పటివరకూ చేయని విభిన్న పాత్రను ఇందులో చేశారు. యాక్షన్, కామెడీల కలబోత ఇది’’ అని చెప్పారు. మెండీ థాకర్ మరో నాయికగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: శక్తి శరవణన్, మాటలు: శశాంక్, వెన్నెలకంటి, సహనిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు.