Manpreet
-
బీజేపీ నేతపై లుక్అవుట్ నోటీసులు
చంఢీగర్: పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్‌పై పంజాబ్ విజిలెన్స్ బ్యూరో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. బటిండా ఆస్తుల కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించింది. మన్‌ప్రీత్ దేశం వీడి వెళ్లొచ్చని భావించారు అధికారులు. దీంతో అన్ని ఎయిర్‌పోర్టుల వద్ద అలర్ట్ జారీ చేశారు. ముందస్తు బెయిల్ కోసం బాదల్ దాఖలు చేసిన పిటిషన్ కూడా ఈరోజు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. బాదల్‌తో పాటు, భటిండా డెవలప్మెంట్ అథారిటీ (బిడిఎ) మాజీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ బిక్రమ్‌జిత్ షెర్గిల్ కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. రాజీవ్ కుమార్, అమన్‌దీప్ సింగ్, వికాస్ అరోరా, పంకజ్‌లు కూడా ఈ కేసులో భాగం పంచుకున్నట్లు తెలుస్తోంది. భటిండాలోని ఆస్తి కొనుగోలులో అవకతవకలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే సరూప్ చంద్ సింగ్లా 2021లో చేసిన ఫిర్యాదు ఆధారంగా విజిలెన్స్ బ్యూరో విచారణ ప్రారంభించింది. గతంలో శిరోమణి అకాలీదళ్‌లో ఉన్న సింగ్లా.. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్న బాదల్ తన పదవిని దుర్వినియోగం చేసి రెండు కమర్షియల్ ప్లాట్లను రెసిడెన్షియల్ ప్లాట్‌గా మార్చుకున్నారనేది ప్రధాన ఆరోపణ. అయితే.. ప్రస్తుతం ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. ఇదీ చదవండి: Rahul Gandhi Train Journey Video: రాహుల్ గాంధీ జన్‌కీ బాత్.. ఈసారి రైలులో.. -
‘టోక్యో’లో ఫైనల్ చేరే సత్తా మాకుంది: మన్‌ప్రీత్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరే సత్తా భారత పురుషుల హాకీ జట్టుకు ఉందని సారథి మన్‌ప్రీత్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇందుకోసం భారత జట్టు క్రమశిక్షణ, నిలకడ ప్రదర్శించాలని ఆయన పేర్కొన్నాడు. ‘2019 సంవత్సరాన్ని విశ్లేషిస్తే... భారత జట్టుకు గొప్పగా గడిచింది. మేము గత ఏడాదిని 5వ ర్యాంకుతో ఆరంభించి అదే ర్యాంకుతో ముగించాం. మేము జట్టుగా సాధించిన అతి పెద్ద విజయం ఏదైనా ఉందంటే అది ఒలింపిక్స్‌కు అర్హత సాధించటమే. ప్రస్తుతం మా ముందున్న లక్ష్యం... ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరటమే... నమ్మండి అది సాధించగల లక్ష్యమే...’ అంటూ మన్‌ప్రీత్ పేర్కొన్నాడు. -
టాప్ ర్యాంకు నిలబెట్టుకోవడమే లక్ష్యం: మన్‌ప్రీత్
బెంగళూరు: ఆసియా హాకీలో భారత టాప్ ర్యాంకు నిలబెట్టడమే తమ లక్ష్యమని జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ అన్నాడు. ఈ నెల 11 నుంచి బంగ్లాదేశ్‌లో జరిగే ఆసియా కప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది. ఈ టోర్నీ కోసం హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ డేవిడ్ జాన్, కొత్త కోచ్ జోయెర్డ్ మరిన్ నేతృత్వంలో భారత సీనియర్ పురుషుల జట్టుకు ఆరు వారాల శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై మన్‌ప్రీత్ మాట్లాడుతూ ‘ఆసియా టాప్ ర్యాంకు నిలబెట్టుకునేలా మా ప్రదర్శన ఉంటుంది. ప్రతీ జట్టు టైటిల్ గెలిచేందుకే బరిలోకి దిగుతుంది. మేం ఏ జట్టునూ తేలిగ్గా తీసుకోం. ఇక్కడి శిబిరంలో మావాళ్లంతా చక్కగా సన్నద్ధమయ్యారు. కొత్త కోచ్ మా ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సన్నాహకాల్లో మార్పులేమీ జరగలేదు’ అని అన్నాడు. పూల్ ‘ఎ’లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కూడా ఉంది. ఈ మ్యాచ్‌పై ఎక్కడలేని అంచనాలుంటాయని... తాము మాత్రం ప్రత్యర్థి ఎవరైనా ఓడించాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగుతామని మన్‌ప్రీత్ అన్నాడు. భారత జట్టు ఆదివారం ఢాకాకు బయల్దేరింది. భారత్ ‘ఎ’ కాంస్యం చేజారింది... పెర్త్: ఆస్ట్రేలియన్ హాకీ లీగ్ (ఏహెచ్ఎల్)లో భారత్ ‘ఎ’ జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో భారత్ 2–3తో న్యూసౌత్‌వేల్స్ చేతిలో పోరాడి ఓడింది. సిమ్రన్‌జీత్ సింగ్ (3వ ని.), అఫాన్ యూసుఫ్ (9వ ని.) చెరో గోల్ చేయగా... న్యూసౌత్ వేల్స్ తరఫున క్రెయిగ్ (39వ ని.), సైమన్ ఒర్చర్డ్ (55వ ని.), లాచ్లన్ షార్ప్ (56వ ని.) తలా ఒక గోల్ చేశారు. -
హాకీ కెప్టెన్‌గా మన్‌ప్రీత్
ప్రపంచ లీగ్ సెమీఫైనల్‌కు భారత జట్టు హైదరాబాద్: జూన్‌లో జరిగే మూడు దేశాల హాకీ టోర్నీ, ప్రపంచ హాకీ లీగ్ సెమీఫైనల్ టోర్నీలో పాల్గొనే భారత హాకీ జట్టుకు మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జర్మనీ, లండన్‌లో జరిగే ఈ టోర్నీల్లో పాల్గొనే 18 మందితో కూడిన భారత జట్టును గురువారం ప్రకటించారు. ‘అజ్లాన్‌షా కప్ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన కెప్టెన్, గోల్‌కీపర్ శ్రీజేశ్ మోకాలి గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. అతడి స్థానంలో జట్టును మన్‌ప్రీత్ నడిపిస్తాడు’ అని హాకీ ఇండియా తెలిపింది. వరల్డ్ లీగ్‌ను కనీసం రెండో స్థానంతో ముగించాలని కోరుకుంటున్నట్టు జట్టు కోచ్ ఓల్ట్స్‌మన్ అన్నారు. జట్టు వివరాలు: ఆకాశ్ చిక్తే, వికాస్ దహియా(గోల్‌కీపర్లు), పర్దీప్ మోర్, కొథాజీత్ సింగ్, సురేందర్‌కుమార్, రూపిందర్‌పాల్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, చింగ్లన్సన సింగ్, ఎస్కేఉతప్ప, సత్బీర్సింగ్, సర్దార్‌సింగ్, మన్‌ప్రీత్ సింగ్, హీర్జీత్ సింగ్, రమణ్‌దీప్ సింగ్, ఎస్వీ సునీల్, తల్విందర్ సింగ్, మన్దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్. -
నెత్తురు చిందిన ప్రేమ
నిజాలు దేవుడికెరుక జూన్ 9, 2000... పంజాబ్‌లోని ఓ మారుమూల ప్రాంతం... ‘‘ఏంటో ఈ చాకిరీ. పొద్దున్న లేచింది మొదలు రాత్రి మంచమెక్కేవరకూ ఒకటే కష్టం. ఈ బాధలు ఎప్పుడు తీరతాయో తెలియడంలా’’... చంకన పెట్టుకుని వచ్చిన బట్టల మూటని నేలమీద పడేస్తూ విసుగ్గా అంది రజ్జీ. ఆమె విసుగు చూసి నవ్వింది మన్‌ప్రీత్. ‘‘వదినా... ఈ మాట అనకుండా నువ్వెప్పుడైనా పని మొదలుపెట్టావా? రోజూ వస్తావు. తిట్టుకుంటావు. తర్వాతే పని ప్రారంభిస్తావు. ఇవాళ కొత్తేముంది?’’ ఆ మాటలకి తనూ నవ్వేసింది రజ్జీ. రజకులు కావడంతో బట్టలు ఉతకడానికి రోజూ పొద్దున్నే కాలువ దగ్గరకు వస్తారు ఇద్దరూ. ప్రతిరోజూ తన కష్టాన్ని తలచు కుని రజ్జీ విసుక్కుంటూనే ఉంటుంది. మొగుడు తాగుబోతు. దమ్మిడీ పని చేయడు. అన్నీ తనే చక్కబెట్టాలి. అందుకే ఆమెకు అంత విసుగు! ‘‘అవునూ వదినా... అన్నయ్యతో తాగుడు మాన్పించడానికి ఎవరో స్వామీజీ మందు ఇస్తారన్నావ్ కదా! తీసుకెళ్లావా?’’ మన్‌ప్రీత్ ప్రశ్నకి తల అడ్డంగా ఊపింది రజ్జీ. ‘‘తీసుకెళ్తానంటే వచ్చేస్తాడా మీ అన్నయ్య! ఎడ్డెమంటే తెడ్డెమనడం అలవాటేగా... రాను పొమ్మన్నాడు. ఆ మనిషిని ఒప్పించడం నా వల్ల ఎప్పుడ య్యిందని! అందుకే వదిలేశాను’’ అంటూ కాలువలోకి దిగింది రజ్జీ. మన్‌ప్రీత్‌తో మాటా మంతీ చెబుతూనే బట్టలు జాడించసాగింది. అంతలో అనుకోకుండా ఆమె చూపులు మరోవైపు మళ్లాయి. ‘‘ఏయ్ మన్‌ప్రీత్... అటు చూడు’’ అంది కంగారుగా. అటువైపు చూసిన మన్‌ప్రీత్ ముఖంలో రంగులు మారాయి. ‘‘అమ్మో... అది శవమే కదా’’ అంది వణుకుతున్న గొంతుతో. అవునన్నట్టు తలూపింది రజ్జీ. ఇద్దరూ ముఖాలు చూసు కున్నారు. వెంటనే విషయం పోలీసుల చెవిని వేయడానికి స్టేషన్‌కు పరుగెత్తారు. వాళ్లు పోలీసుల్ని తీసుకుని వచ్చేసరికి ఆ శవం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. చుట్టూ కొంతమంది జనం కూడా గుమిగూడారు. వాళ్లందరినీ చెదరగొట్టి మృతదేహం దగ్గరకు వెళ్లాడు ఇన్స్పెక్టర్. ఎవరో అమ్మాయి. పాతికేళ్లుంటాయి. నీటిలో ఉబ్బిపోయినా కూడా ఆమె ఎంతో అందంగా ఉండేదన్న విషయం తెలు స్తోంది. ఖరీదైన బట్టలే వేసుకుంది. ఒంటి మీద నగలున్నాయి. వాటితో పాటు గాయాలు కూడా. పదునైన ఆయుధంతో కోయడంతో మెడ దాదాపు తెగిపోయింది. ఎవరో చిత్రహింసలు పెట్టి చంపారని చూడగానే అర్థమైపోతోంది. ‘‘ఈమె ఎవరో మీలో ఎవరికైనా తెలుసా?’’... అడిగాడు ఇన్స్పెక్టర్. ఎవరూ మాట్లాడలేదు. దాంతో బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి ఏ కోణంలో విచారించాలా అని ఆలోచనలో పడ్డాడు. ‘‘సర్... ఇన్స్పెక్టర్గారు...’’ కానిస్టేబుల్స్‌తో కేసు గురించి డిస్కస్ చేస్తోన్న ఇన్స్పెక్టర్ చప్పున తల ఎత్తి చూశాడు. ఎదురుగా ఓ యువకుడు నిల బడి ఉన్నాడు. మంచి ఒడ్డూ పొడవూ... చక్కని రంగు... చూడటానికి బాగున్నాడు. కానీ కళ్లలో మాత్రం ఏదో భయం. ఎందుకో కంగారు. ‘‘నేనే... రండి, కూర్చోండి’’ అంటూ కుర్చీ చూపించాడు ఇన్స్పెక్టర్. ఆ యువకుడు కూర్చోలేదు. కాస్త ముందుకు వచ్చి ఇన్స్పెక్టర్కి ఎదురుగా నిలబడ్డాడు. మాట్లాడటం మొదలుపెట్టక ముందే కళ్ల నుంచి నీళ్లు జారడం మొదలైంది. ‘‘ఏంటి... ఏం జరిగింది?’’... అడిగాడు ఇన్స్పెక్టర్ అనునయంగా. ‘‘నా పేరు సుఖ్వీందర్ సర్. నా భార్య జస్వీందర్ వారం రోజుల్నుంచీ కనిపించడం లేదు’’... అతని గొంతు వణికింది. ‘‘వారం నుంచీ కనబడకపోతే ఇప్పటి వరకూ ఏం చేస్తున్నావ్?’’... సహజ సిద్ధమైన పోలీసు ఆలోచనలతో అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘హాస్పిటల్లో ఉన్నాను సర్. ఎవరో రౌడీలు... నన్ను చితక్కొట్టి రోడ్డు పక్కన పడేశారు. నా భార్యను కారులో ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. తనని ఏం చేశారోనని భయంగా ఉంది సర్. ఇన్ని రోజులూ ఆస్పత్రిలో స్పృహ లేకుండా పడివున్నాను. స్పృహలోకి రాగానే మీ దగ్గరికొచ్చాను’’... దుఃఖాన్ని అణచుకుంటూ చెప్పాడు. మాటల్లో తడబాటు లేదు. కళ్లలో నిజాయితీ కూడా కనిపిస్తోంది. దాంతో పెద్దగా సాగదీయలేదు ఇన్స్పెక్టర్. వివరాలు చెప్పమని అడిగాడు. సుఖ్వీందర్ చెబుతుంటే ఇన్స్పెక్టర్ భృకుటి ముడి వడింది. మెదడులో ఏదో ఆలోచన తళుక్కుమంది. వెంటనే అతడిని తనతో రమ్మని తీసుకెళ్లాడు. మార్చురీ అన్న బోర్డు చూడగానే సుఖ్వీందర్ కాళ్లకు బ్రేకులు పడ్డాయి. ‘‘ఇక్కడికెందుకు తీసుకొచ్చారు సర్’’ అన్నాడు భయపడుతూ. ‘‘సారీ సుఖ్వీందర్. వారం రోజుల క్రితం కాలువలో మాకు ఓ అమ్మాయి మృతదేహం దొరికింది. అది ఎవరిదో ఇప్పటివరకూ తెలియలేదు. ఇప్పుడు నువ్వు చెప్పిన వివరాలు వింటుంటే... ఆ అమ్మాయే నీ భార్యయేమోనని అనుమానంగా...’’ ఇన్స్పెక్టర్ మాట పూర్తి కాకముందే ‘‘లేదు’’ అంటూ అరిచాడు సుఖ్వీందర్. ‘‘అంత మాటనకండి. నా జస్వీందర్ చావదు. నన్ను వదిలిపెట్టి వెళ్లదు. ఎందుకంటే తను లేకుండా నేను బతకలేనని తనకు బాగా తెలుసు’’... వెక్కివెక్కి ఏడుస్తోన్న సుఖ్వీందర్ని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు ఇన్స్పెక్టర్కి. ధైర్యం చెబు తున్నట్టుగా భుజం తట్టి, చేయి పట్టుకుని లోనికి తీసుకెళ్లాడు. ఆ అమ్మాయి మృత దేహాన్ని చూపించమని అక్కడున్న వ్యక్తికి సైగ చేశాడు. అతడు మృతదేహాన్ని బయటకు తీశాడు. ఆమెను చూస్తూనే కుప్పకూలి పోయాడు సుఖ్వీందర్. ‘‘జస్సీ... నన్ను వదిలేసి వెళ్లిపోయావా’’ అంటూ గుండె లవిసేలా ఏడవసాగాడు. అతడి పరిస్థితి చూసి ఇన్స్పెక్టర్ సైతం కదిలిపోయాడు. వెంటనే తనని మార్చురీ బయటకు తీసు కొచ్చేశాడు. కాస్త తేరుకున్నాక అడిగాడు... ‘‘అసలేమైంది సుఖ్వీందర్? నిన్ను ఎందుకు కొట్టారు? జస్వీందర్ని ఎందుకు చంపారు? అసలిదంతా ఎవరు చేశారు?’’ దీనంగా ఇన్స్పెక్టర్ ముఖంలోకి చూశాడు సుఖ్వీందర్. గుండెల్ని పిండేసే తన కథ చెప్పడం మొదలుపెట్టాడు. మే 12, 2000. ఎయిర్‌పోర్ట్‌లో సుఖ్వీందర్ని చూస్తూనే పరిగెత్తుకుని వచ్చి అతణ్ని అల్లుకుపోయింది జస్వీందర్ కౌర్. ‘‘వచ్చేశావా జస్సీ. నువ్వు రావేమో, ఎంత కంగారు పడ్డానో తెలుసా’’ అంటూ ఆమెను గుండెలకు అదుముకున్నాడు సుఖ్వీందర్. ‘‘రాకుండా ఉండగలనా? ప్రపంచ మంతా ఒక్కటై ప్రయత్నించినా నన్ను నీ దగ్గరకు రాకుండా ఎవ్వరూ ఆపలేరు’’ అంటూ చిలిపిగా నవ్వింది జస్వీందర్. జస్సీ అలా నవ్వుతుంటే చూస్తూ ఈ ప్రపం చాన్నే మర్చిపోతాడతను. అసలు అతడిని ఆమెవైపు లాగిందే ఆ అందమైన నవ్వు! జస్వీందర్ పుట్టింది పంజాబ్‌లోనే. కానీ చదువుకుంది, సెటిలయ్యింది మాత్రం కెనడాలో. అక్కడామెకు బ్యూటీ షియన్‌గా మంచి పేరుంది. రెండు చేతులా సంపాదిస్తోంది. 1994లో ఓసారి కుటుంబ సభ్యులతో కలిసి లూధి యానాలో ఒక ఫంక్షన్‌కి వచ్చింది. అప్పుడే ఆమెకు ఆటో డ్రైవర్ సుఖ్వీందర్‌తో పరిచయమయ్యింది. అతడు ఆమెలా ఎక్కువ చదువుకోలేదు. ఆమెతో పోలిస్తే అంత అందగాడు కాదు. ఆమెలాగా బాగా సంపాదించడమూ లేదు. కానీ ఆమెలో చలనాన్ని కలిగించాడు. తొలి పరిచయంలోనే వాళ్ల మధ్య ప్రేమ పుట్టింది. కొద్ది రోజుల తర్వాత జస్వీందర్ వాళ్లు కెనడా వెళ్లిపోయినా ఆ ప్రేమ అలాగే నాలుగేళ్లు కొనసాగింది. అయితే జస్సీకి ఇంట్లోవాళ్లు మరొకరితో పెళ్లి సెటిల్ చేయడంతో వారి ప్రేమకథ కొత్త మలుపు తిరిగింది. సుఖ్వీందర్నే పెళ్లాడతానంది జస్సీ. ఇంట్లోవాళ్లు విరుచుకుపడ్డారు. ఆటో వాడితో ప్రేమేంటి అంటూ తిట్టారు, కొట్టారు, ఇంట్లో బంధించారు. అయినా ఆమె మనసును మాత్రం మార్చలేక పోయారు. సుఖ్వీందర్ కోసం పరితపిం చింది జస్సీ. ఫ్రెండ్స్ సాయంతో ఎలాగో తప్పించుకుని ఇండియా వచ్చేసింది. సుఖ్వీందర్‌తో తాళి కట్టించుకుని కొత్త జీవితం మొదలుపెట్టింది. ఇక తనకు ఏ కష్టమూ రాదనుకుంది. కానీ అన్నీ అనుకున్నట్టు జరిగితే జీవితం ఎందుకవు తుంది! నెల రోజులు తిరక్కుండానే సుఖ్వీందర్ని, జస్వీందర్ని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. సుఖ్వీందర్ని చితక్కొట్టి రోడ్డు పక్కన పడేశారు. జస్సీని కారులో దూరంగా తీసుకెళ్లి చంపేశారు. తర్వాత ఆమె మృతదేహాన్ని ఓ కాలువలో పడేశారు. ‘‘ఇది కచ్చితంగా వాళ్ల ఇంట్లోవాళ్ల పనే అయ్యుంటుంది సర్. వాళ్లు నన్ను అల్లుడిగా ఒప్పుకోలేదు. నన్ను పెళ్లి చేసుకుందన్న కోపంతో చివరికి తనని పొట్టన పెట్టుకున్నారు.’’ బాధేసింది ఇన్స్పెక్టర్కి. ఏం మనుషులు వీళ్లు! అల్లుడు నచ్చలేదని కూతుర్ని చంపేసుకుంటారా! కడుపు మండిపోయిందతనికి. విచారణ వేగవంతం చేశాడు. సుఖ్వీందర్ చెప్పిన గుర్తుల్ని బట్టి ఈ దారుణానికి పాల్పడిన ఏడుగురు దుండగుల్నీ అరెస్ట్ చేశాడు. వాళ్ల వాంగ్మూలం ఆధారంగా ఈ హత్య చేయిం చింది జస్సీ తల్లి మల్కిత్, మేనమామ సుర్జీత్ అని తేలింది. దాంతో వాళ్లమీద కూడా కేసు ఫైలు చేశాడు. కానీ వాళ్లు కెనడాలో ఉండటంతో కేసు త్వరగా ముందుకు సాగలేదు. వాళ్లని అరెస్ట్ చేయడానికి చాలాకాలం పట్టింది. తీరా అరెస్టయ్యాక వారి పలుకుబడి కేసును పక్కదారి పట్టించింది. వాంగ్మూలాలు మారిపోయాయి. సాక్ష్యాలు తారుమారు అయ్యాయి. వాద ప్రతివాదనలు జరిగాయి. కానీ కేసు మాత్రం ఓ కొలిక్కి రాలేదు. పదిహేనేళ్లుగా సాగుతూనే ఉంది. అయితే ఇప్పటికీ సుఖ్వీందర్లో మాత్రం ఆశ చావలేదు. తన ప్రాణానికి ప్రాణమైన జస్సీని చంపినవాళ్లు ఉరి కంబానికి వేళ్లాడటం ఏదో ఒక రోజు తాను చూస్తాననే అంటున్నాడు. పాపం... నేటికీ ఆమె జ్ఞాపకాల కొలిమిలో కాలిపోతున్నాడు ఆ పేద ప్రేమికుడు. ‘‘జస్సీని మొదటిసారి చూసినప్పుడే ప్రేమలో పడ్డాను. తను కూడా నన్ను మొదటి చూపులోనే ఇష్టపడింది. ఆరోజు తను నా ఆటో ఎక్కింది. దిగేటప్పుడు తన లిప్‌స్టిక్‌తో ఐ లవ్యూ అని సీటు మీద రాసింది. నేనెంతో అదృష్టవంతుడిని అనుకున్నాను. కానీ నాకు తెలియలేదు... ఆ భగవంతుడు మా తలరాత నెత్తుటితో రాశాడని’’ అంటాడు చెమ్మగిల్లిన కళ్లతో. ఆ చెమ్మ నిండా జెస్సీ జ్ఞాపకాలే!