నిఖిల్ అనిల్ బ్రిజ్‌లాల్ కుమార్ శర్మ aka నిఖిల్ ముంబైకర్.. మోటో వ్లాగర్, బిజినెస్‌మన్. టాప్ టెన్ రిచెస్ట్‌సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్‌ర్స్ ఆఫ్ ఇండియాలో ఒకడు. హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఈ ముంబై వాసి కొన్నాళ్లు ఖతార్ ఎయిర్‌వేస్‌లో ఫ్లయిట్ అటెండెంట్‌గా పనిచేశాడు.
చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీదున్న ఇంట్రెస్ట్ ఆ ఎయిర్‌వేస్ కొలువులో కుదురుగా ఉండనివ్వలేదు. దాంతో ముంబైకి తిరిగొచ్చి.. నటనలో లక్‌ని పరీక్షించుకున్నాడు. అట్టే అవకాశాలు రాలేదు. వీడియోగ్రఫీ అంటే కూడా ఆసక్తి ఉండటంతో మైండ్‌ని అటువైపు మోల్డ్ చేసుకున్నాడు. యూట్యూబ్‌ని వేదికగా మలచుకున్నాడు.
మోటర్ బైక్ మీద తను వెళ్లిన ప్రదేశాలను షూట్ చేస్తూ ఆ వీడియోలను తన యూట్యూబ్ చానెల్‌లో పోస్ట్ చేయసాగాడు. అలా అతని లద్దాఖ్ మోటో ట్రిప్ వ్లాగ్ తన చానెల్ సబ్‌స్క్రైబర్స్‌ని అమాంతం పెంచేసింది. పాపులారిటీని తెచ్చిపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న తన ఫ్యాన్స్‌ని కలవడానికి నిఖిల్ ఓ2ఓ (కన్యాకుమారి టు కశ్మీర్) బైక్ రైడ్ చేశాడు. ‘ముంబైకర్ నిఖిల్’ పేరుతోనే కీ చైన్స్, బెల్ట్‌ల బ్రాండ్‌ని స్థాపించాడు. ఇవి ఎక్స్‌క్లుజివ్‌గా అమెజాన్‌లోనే దొరుకుతాయి.
ఇవి చదవండి: Revathi Pillai: తానొక.. డిజిటల్ స్టార్.. అండ్ ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్..
Comments
Please login to add a commentAdd a comment