రిమాండ్‌కు నిరాకరించిన న్యాయమూర్తి
వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశం
గుంటూరు/అమరావతి/వీరఘట్టం/కడప అర్బన్/నర్సీపట్నం: రెండేళ్ల క్రితం ఓ యూట్యూబర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన ఓ డిగ్రీ విద్యార్థిని అకారణంగా తీసుకువచ్చిన గుంటూరు సీఐడీ పోలీసులకు చుక్కెదురైంది. అతన్ని రిమాండ్‌కు తరలించేందుకు చేసిన విశ్వ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అతన్ని సెల్ఫ్‌బాండ్‌పై విడుదల చేయాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం దశుమంతపురం గ్రామానికి చెందిన అలజంగి యగ్నేష్ భాస్కర్ డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు.
రెండేళ్ల క్రితం ఓ యూట్యూబర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కూటమి పార్టీటలు ఇంకా సీఎం అభ్యర్థి ఎవరో నిర్ణయించుకోలేదని బదులిచ్చాడు. అంతటితో ముగిసిందని భావించి కళాశాలకు వెళ్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాజిక కార్యకర్తలను ఏరివేతకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. 2 రోజుల క్రితం గుంటూరు సీఐడీ పోలీసులు అతని స్వగ్రామానికి వెళ్లారు. నిద్రిస్తున్న అతన్ని గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకువచ్చి రోజంతా విచారించారు.
గురువారం జిల్లా కోర్టు ఆవరణలోని సీబీసీఐడీ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి రిమాండ్‌ను రద్దు చేశారు. సెల్ఫ్‌బాండ్ మీద విడుదల చేయాలని ఉత్తర్వులిచ్చారు. వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ నాయకులు పొలూరి వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మొండితోక శ్రీనివాసరావు, అజీజ్, షేక్.అజీబుల్లా, రమణారెడ్డి యగ్నేష్ ను పరామర్శించి ధైర్యం చెప్పి అండగా నిలిచారు.
అండగా నిలవాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ ఆదేశం
కాగా..యగ్నేష్ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. యగ్నేష్ కుటుంబానికి అండగా నిలవాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌కు, పాలకొండ, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు, వైఎస్సార్‌సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజుకు సూచించారు. సోషల్ మీడియా పోస్టులపై నమోదవుతున్న అక్రమ కేసులతో యువత భవిష్యత్ నాశనం అవుతుందని, అటువంటి వారికి అండగా ఉండాలని సూచించారు.
సోషల్ మీడియా యాక్టివిస్ట్‌పై కేసు నమోదు
పల్నాడు జిల్లా అమరావతి రాజీవ్‌కాలనీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ కంభంపాటి దినేష్ పై గురువారం కేసు నమోదు చేశారు. సీఐ శ్రీనివాసరావు అందించిన వివరాల మేరకు.. దినేష్ ఈ ఏడాది జూలైలో ప్రభుత్వ పెద్దల ఫొటోలు మారి్ఫంగ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. దీనిపై రాజీవ్ కాలనీకి చెందిన వంశీ ఇచి్చన ఫిర్యాదు మేరకు దినేష్ పై కేసు నమోదు చేశారు.
వర్రా కస్టడీపై విచారణ వాయిదా..మరో కేసు నమోదు
సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డిని కస్టడికి ఇవ్వాలని కడప జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. దీనిపై గురువారం (5వ తేదీ) విచారణ చేయాల్సి ఉండగా..దాన్ని ఈ నెల 9కి వాయిదా వేశారు. కాగా, సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డిపై అనకాపల్లి జిల్లా నాతవరం మండలం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు మారి్ఫంగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని నాతవరం మండలం, లింగంపేట టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు దేవాడ అప్పలనాయుడు గత నెల 10న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బిఎన్‌ఎస్, ఐటి చట్టాలను అనుసరించి 192, 196, 61(2), 336(4), 340(4), 353(2) సెక్షన్ల కింద వర్రాపై కేసు నమోదు చేశారు.
ఈ కేసుకు సంబంధించి గుంటూరు జైల్‌లో రిమాండ్‌లో ఉన్న రవీంద్రారెడ్డిని పీటీ వారెంట్‌పై తీసుకువచ్చిన నాతవరం పోలీసులు గురువారం నర్సీపట్నం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మేజి్రస్టేట్ ముందు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించడంతో వర్రాను విశాఖ సెంట్రల్ జైల్‌కు తరలించారు. ఇదే రోజు న్యాయవాది మాకిరెడ్డి బుల్లిదొర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment