'ఛోటీ బీవీ'ని గుర్తుచేసుకున్న బిగ్‌ బీ! | Big B Gets Nostalgic, Celebrates 35 Years of Laawaris | Sakshi
Sakshi News home page

'ఛోటీ బీవీ'ని గుర్తుచేసుకున్న బిగ్‌ బీ!

Published Mon, May 23 2016 12:44 PM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

'ఛోటీ బీవీ'ని గుర్తుచేసుకున్న బిగ్‌ బీ!

'ఛోటీ బీవీ'ని గుర్తుచేసుకున్న బిగ్‌ బీ!

'జిస్కీ బీవీ ఛోటీ, ఉస్కా భీ బడా నాం హై .. గోద్‌మే బైఠాలో.. బచ్చేకా క్యా కామ్ హై'.. దాదాపు 35 ఏళ్ల కిందట వచ్చిన 'లావారిస్‌' సినిమాలో బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ పాడిన పాట ఇది. మూడున్నర దశాబ్దాలు గడిచిపోయినా భాషలకు అతీతంగా భారతీయులందరినీ ఈ పాట ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంది.

'మేరే అంగ్‌నేమే తుమ్హారా క్యాం కామ్ హై' అంటూ సాగే ఈ పాట అప్పట్లో చాలా సూపర్‌ హిట్‌ అయింది. ఈ పాటను అమితాబ్‌ పాడిన స్టైల్‌ ఎంతో ఆకట్టుకుంది కూడా. ఈ సినిమా 35 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆనాటి జ్ఞాపకాల్లోకి బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్ జారుకున్నారు. 'మేరే అంగ్‌నేమే' పాటను పాడుతూ.. 'జిస్కీ బీవీ ఛోటీ, ఉస్కా భీ బడా నాం హై' అన్న చరణం వద్ద తన భార్య జయాబచ్చన్‌ను ఎత్తుకునే దృశ్యాన్ని ఆయన నెమరువేసుకున్నారు. అదే సమయంలో న్యూయార్క్‌లో లతా మంగేష్కర్‌ సంగీత కచెరీ సందర్భంగా ఆమె కోరిక మేరకు వేదికపై తాను ఈ పాట పాడానని, దాంతో శ్రోతల నుంచి ఊహించిన ప్రతిస్పందన వచ్చిందని, ప్రేక్షకులంతా ముందుకు వచ్చి తనతోపాటు డ్యాన్స్‌ చేయడం మొదలుపెట్టారని, దీంతో వారిని నియంత్రించడం న్యూయార్క్ పోలీసులు చాలా సమయమే పట్టిందని ఆయన వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement